News


హోండా నుంచి ప్రీమియం యాక్టివా125

Thursday 13th June 2019
news_main1560405413.png-26262

న్యూఢిల్లీ, సాక్షి బిజినెస్‌ బ్యూరో:- వచ్చే ఏడాది నుంచి అమల్లోకి రానున్న బీఎస్‌-6 ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన న్యూ ప్రీమియం యాక్టివా 125ను హోండా బుధవారం ఆవిష్కరించింది. ఈ ఏడాది రెండవ త్రైమాసికం నుంచి దీని అమ్మకాలను మొదలుపెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీ నుంచి ఉత్పత్తి చేస్తున్న తొలి బీఎస్‌-6 అనుగుణ ద్విచక్రవాహనం ఇదేనని తెలిపింది. దీని ధర బీఎస్‌4 యాక్టివా స్కూటర్‌ కన్నా 10- 15 శాతం ఎక్కువ ఉంటుందని తెలిపింది. 
ప్రత్యేకతలు:- హోండా ఈఎస్‌పీ టెక్నాలజీతో కూడిన 125 సీసీ ఇంజన్‌, 3+3=6 ఏళ్ల వారెంటీ, సైలెంట్‌ స్టార్ట్‌ సిస్టమ్‌, డిజిటల్‌ అనలాగ్‌ మీటర్‌, ఇడ్లింగ్‌ స్టాప్‌ సిస్టమ్‌, ఇంజన్‌ ఇన్‌హిబిటర్‌తో కూడిన సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌ మరియు ఫ్రిక‌్షన్‌ రిడక‌్షన్‌ సాంకేతికత, ఇంటిగ్రేటెడ్‌ డ్యూయల్‌ ఫంక్షన్‌ స్విచ్‌ తదితరాలు. 



You may be interested

మార్కెట్లోకి థాంప్సన్‌ ఆండ్రాయిడ్‌ టీవీలు

Thursday 13th June 2019

న్యూఢిల్లీ నుంచి సాక్షి బిజినెస్‌ బ్యూరో ప్రతినిధి: ఫ్రెంచ్‌ కన్స్యూమర్‌ దిగ్గజం థాంప్సన్‌... దేశీయ మార్కెట్లోకి సరికొత్త ఆండ్రాయిడ్‌ టీవీలను విడుదల చేసింది. మేక్‌ ఇన్‌ ఇండియాకు అనుగుణంగా ఈ టీవీలను భారత్‌లోనే ఉత్పత్తి చేశామని కంపెనీ ఇండియా పేటెంట్‌ హక్కుదారు ఎస్‌పీపీఎల్‌ సీఈఓ అవనీత్‌ సింగ్‌ మార్వా చెప్పారు. దీంతో అన్ని రకాల ఆండ్రాయిడ్‌ టీవీలను స్థానికంగా ఉత్పత్తి చేస్తున్న తొలి బ్రాండ్‌గా నిలిచామన్నారు. 43, 49, 55,

60 డాలర్ల దిగువకు క్రూడ్‌

Thursday 13th June 2019

క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గురువారం స్థిరంగా ట్రేడవుతున్నాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ప్యూచర్‌ 0.2శాతం పెరిగి 60.09 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్‌ క్రూడ్‌ బుధవారం 3.7శాతం కోల్పోయి ఐదు నెలల కనిష్ఠమైన 59.97 డాలర్లకు పడిపోయింది. అమెరికా క్రూడ్‌ నిల్వలు పెరగడంతో పాటు మందగమనం కారణంగా డిమాండ్‌ తగ్గడంతో గత సెషన్‌లో 4 శాతం మేర నష్టపోయాయి. యూఎస్‌ వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర

Most from this category