STOCKS

News


​‍బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్విట్‌ చేతికి ముకేశ్‌ అంబానీ ఈస్ట్‌ వెస్ట్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌

Saturday 16th March 2019
news_main1552721655.png-24640

డీల్‌ విలువ రూ.13,000 కోట్లు 
న్యూఢిల్లీ: ముకేశ్‌ అంబానీకి చెందిన నష్టాల్లో నడుస్తున్న ఈస్ట్‌-వెస్ట్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌  చేతులు మారుతోంది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గ్యాస్‌ను వినియోగదారులకు సరఫరా చేసే ‘పైప్‌లైన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ కంపెనీని బ్రూక్‌ఫీల్డ్‌ నేతృత్వంలోని ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌  ట్రస్ట్‌(ఇన్విట్‌) కొనుగోలు చేయనున్నది. ఈ కంపెనీలో వంద శాతం వాటాను రూ.13,000 కోట్లకు బ్రూక్‌ఫీల్డ్‌ ఇన్విట్‌ కొనుగోలు చేయనున్నదని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి గుజరాత్‌లోనిన భరూచ్‌ వరకూ 1,460 కిమీ. మేర ఈ గ్యాస్‌పైప్‌లైన్‌ విస్తరించి ఉంది. పైప్‌లైన్‌ కార్యకలాపాలు 2009లో మొదలయ్యాయి. ఈ పైప్‌లైన్‌ నిర్మాణానికి రూ.16,348 కోట్లు​ ఖర్చయింది. 



You may be interested

బీఎస్‌ఎన్‌ఎల్ నష్టాలు @ రూ. 90వేల కోట్లు

Saturday 16th March 2019

- నిధులు సమకూర్చడం లేదా మూసేయడం రెండే మార్గాలు - కోటక్‌ ఈక్విటీస్ నివేదిక న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్ఎల్ నష్టాలు డిసెంబర్ ఆఖరు నాటికి ఏకంగా రూ. 90,000 కోట్లు దాటిపోయాయని కోటక్ ఇనిస్టిట్యూషనల్ ఈక్విటీస్ (కేఐఈ) పేర్కొంది. ఈ నేపథ్యంలో మరింత పెట్టుబడులు పెట్టి కంపెనీని నిలబెట్టడమా లేదా వ్యయాలు తగ్గించుకునేందుకు సంస్థను మూసేసి వన్‌ టైమ్ భారాన్ని భరించడమా అన్న దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి

‘గ్రేడ్‌ అప్‌’తో ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ ఈజీ

Saturday 16th March 2019

‘గ్రేడ్‌ అప్‌’తో ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ ఈజీ – త్వరలోనే ఒలంపియాడ్, ఎన్‌టీఎస్‌ఈ పరీక్షల కంటెంట్‌ – ప్రస్తుతం 50కి పైగా ఎగ్జామ్స్‌; 1.3 కోట్ల మంది విద్యార్థులు – తెలుగు రాష్ట్రాల్లో గేట్, ఇంజనీరింగ్‌ స్టూడెంట్సే అధికం – ఈ ఏడాది రూ.100 కోట్ల నిధుల సమీకరణ – ‘స్టార్టప్‌ డైరీ’తో కో–ఫౌండర్‌ శోభిత్‌ భట్నాగర్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘‘దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ ప్రిపరేషన్‌ స్టార్టప్‌ ‘గ్రేడ్‌ అప్‌’.. త్వరలోనే ఒలంపియాడ్, నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ (ఎన్‌టీఎస్‌ఈ)

Most from this category