STOCKS

News


బీఓబీ సీఈఓ పదవీకాలం పొడిగింపు

Friday 12th October 2018
news_main1539318573.png-21072

న్యూఢిల్లీ: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ) ఎండీ, సీఈఓ పి.ఎస్‌.జయకుమార్‌ పదవీకాలం మరో ఏడాది వరకు పొడిగించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2015లో పదవీ బాధ్యతలు చేపట్టిన ఈయన పదవీకాలం ఈ ఏడాది అక్టోబరు 12న (శుక్రవారం) పూర్తికానుండగా.. వచ్చే ఏడాది అక్టోబరు 12 వరకు పొడగిస్తున్నట్లు క్యాబినెట్‌ నియామకాల కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. బీఓబీలో పదవీ బాధ్యతలు చేపట్టకముందు.. వాల్యూ బడ్జెట్‌ హౌసింగ్‌ (వీబీహెచ్‌సీ) కో-ఫౌండర్‌, సీఈఓగా కొనసాగారు. చార్టర్డ్ అకౌంటెంట్ పూర్తిచేసిన ఈయన 1986 నుంచి బ్యాంకింగ్‌ రంగంలో సేవలందిస్తున్నారు. 



You may be interested

ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌ డిసెంబర్‌ 3 నుంచి

Friday 12th October 2018

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ షేర్ల కోసం ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌ డిసెంబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నది. ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా ఒక్కొక్క ఐడీబీఐ బ్యాంక్‌ షేర్‌ను రూ.61.73 ధరకు ఎల్‌ఐసీ కొనుగోలు చేయనున్నదని ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. ఈ  ఓపెన్‌ ఆఫర్‌ డిసెంబర్‌​14న ముగుస్తుంది. ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా 26 శాతం వాటాకు సమానమైన 204, 15, 12, 929 షేర్లను ఎల్‌ఐసీ కొనుగోలు చేస్తుంది. ఐడీబీఐ బ్యాంక్‌లో

వచ్చే నెల 15న ‘జావా’ మోటార్ సైకిల్ రీఎంట్రీ

Friday 12th October 2018

న్యూఢిల్లీ: గతంలో ఒక వెలుగువెలిగిన ‘జావా’ మోటార్‌ సైకిల్‌ త్వరలోనే మళ్లీ మర రోడ్లపై రయ్‌మంటూ దూసుకుపోనుంది. మహీంద్రా గ్రూపునకు చెందిన క్లాసిక్‌ లెజెండ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 1929 నాటి ఈ బైక్‌లను వచ్చే నెల 15న విడుదలచేసేందుకు సిద్ధమైంది. ఈ బైక్‌ల అధునాతన 293 సీసీ ఇంజిన్‌ను గురువారం ప్రదర్శించింది. చెక్‌ రిపబ్లిక్‌లోని ప్రాగ్‌ నగరానికి చెందిన ఆనాటి మోటార్ సైకిల్‌ ఇంజిన్‌ను ఇటలీ, పూణే ఆర్‌ అండ్‌

Most from this category