STOCKS

News


బ్యాంకర్లతో ఈనెల 13న నిర్మల సమావేశం

Thursday 13th June 2019
news_main1560407522.png-26268

  • రుణ ప్రవాహం సులభతరం చేయడమే ప్రధాన అజెండా

న్యూఢిల్లీ: బడ్జెట్‌ ముందస్తు చర్చల్లో భాగంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 13న (గురువారం) బ్యాంకర్లతో సమావేశం కానున్నారు. రుణ ప్రవాహం సులభతరం చేయడమే ప్రధాన అజెండాగా ఈ చర్చలు కొనసాగనున్నట్లు వెల్లడైంది. ఆ తరువాత రోజైన 14న ప్రభుత్వ వర్గాల నుంచి ఇందుకు సంబంధించిన కీలక ప్రకటన జరిగే అవకాశం ఉంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా (ఎంఎస్‌ఎంఈ), చిన్న రుణగ్రహీతలకు క్రెడిట్‌ ఫ్లో సౌలభ్యం దిశగా నిర్ణయాలు ఉండనుండగా.. రుణ పునరుద్ధరణకు సంబంధించి ఇందుకు అనుగుణంగా ఆర్‌బీఐ సర్క్యులర్‌ వెలువడనుందనే అంచనాలు వెలువడుతున్నాయి.



You may be interested

అనిల్‌ అంబానీ కంపెనీల నుంచి వైదొలగిన పీడబ్ల్యూసీ

Thursday 13th June 2019

స్టాట్యుటరీ ఆడిటర్‌ పదవికి గుడ్‌బై న్యూఢిల్లీ: అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌, రిలయన్స్‌ హోమ్‌ ఫైనాన్స్‌ కంపెనీల స్టాట్యుటరీ ఆడిటర్‌ పదవి నుంచి పీడబ్ల్యూసీ వైదొలగింది. ప్రైస్‌ వాటర్‌హౌస్‌ అండ్‌ కో చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ (పీడబ్ల్యూసీ) ఈ నెల 11 నుంచి అమల్లోకి వచ్చే విధంగా స్టాట్యుటరీ ఆడిటర్‌ పదవికి రాజీనామా చేసిందని, రెండు కంపెనీలూ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌లకు నివేదించాయి. గత ఆర్థిక సంవత్సరం ఆడిట్‌కు  సంబంధించి పీడబ్ల్యూసీ కొన్ని

సుప్రీం కోర్ట్‌లో సత్వర విచారణ పిటీషన్‌

Thursday 13th June 2019

దాఖలు చేసిన ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ సెలవుల అనంతరం విచారిస్తామన్న వెకేషన్‌ బెంచ్‌ న్యూఢిల్లీ: ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌) కంపెనీకి  సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఈ కంపెనీలో రూ.98,000 కోట్ల మేర అవకతవకలు జరిగాయంటూ సుప్రీం కోర్ట్‌లో పిటీషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. కేవలం రూ.3,000తో నాలుగు ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌ షేర్లు కొనుగోలు చేసిన పాలు విక్రయదారొకరు ఈ పిటిషన్‌ను దాఖలు చేశాడని ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌ తరపున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది ఏ.ఎమ్‌. సింఘ్వి పేర్కొన్నారు.

Most from this category