STOCKS

News


స్వల్పంగా పెరిగిన బీఓఐ రుణ రేటు

Friday 12th October 2018
news_main1539318107.png-21066

ముంబై: ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (బీఓఐ) రుణ రేటు (ఎంసీఎల్ఆర్‌) రెండు కాలపరిమితులకు సంబంధించి అరశాతం పెరిగింది. దీనిప్రకారం- ఓవర్‌నైట్‌  (స్వల్పకాలపరిమితి) రుణ రేటు 8.05 శాతానికి పెరిగితే, నెల కాలపరిమితి రేటు 8.15 శాతానికి చేరింది. అక్టోబర్‌ 10 నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది. మూడు (8.30 శాతం), ఆరు (8.50 శాతం), 12 నెలల (8.60 శాతం) రుణ రేట్లలో ఎటువంటి మార్పూ లేదు. 

ఇతర బ్యాంకులు...
దేశంలో వడ్డీరేట్ల పెంపు వాతావరణం నేపథ్యంలో పలు బ్యాంకులు ఇప్పటికే పలు కాలపరిమితులకు సంబంధించి రుణ రేట్లను పెంచాయి. ఇందులో పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (0.2 శాతం వరకూ), ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (0.10 శాతం వరకూ) సిండికేట్‌ బ్యాంక్‌ ( 0.10 శాతం) ఉన్నాయి.  ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌లు కూడా ఇటీవల తమ గృహ రుణ రేట్లను పెంచాయి. 



You may be interested

ఇంకా తగ్గించాలని ఓఎంసీలకు చెప్పం!!

Friday 12th October 2018

న్యూఢిల్లీ: పెట్రోల్ రేట్లు తగ్గించాలంటూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించడం ద్వారా ప్రభుత్వం ఇంధన రేట్ల సంస్కరణలను పక్కన పెట్టి మళ్లీ పాత విధానాలకే మళ్లుతోందంటూ వస్తున్న ఆరోపణలను కేంద్రం తోసిపుచ్చింది. ఇది ఈ ఒక్కసారికి మాత్రమే పరిమితమని, మరోసారి జరగబోదని స్పష్టం చేసింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలకు ఇకపైనా మార్కెటింగ్ స్వేఛ్చ ఉంటుందని, ఇక ఓఎన్‌జీసీ వంటి చమురు ఉత్పత్తి సంస్థలను కూడా ఇంధన సబ్సిడీ

మార్కెట్లోకి టీవీఎస్‌ సరికొత్త ‘వీగో’

Friday 12th October 2018

న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన సంస్థ టీవీఎస్‌ మోటార్స్‌ అధునాత ‘వీగో’ స్కూటర్‌ను గురువారం మార్కెట్లోకి విడుదల చేసింది. నూతన వెర్షన్‌లో 20 లీటర్ల యుటిలిటీ బాక్స్‌, స్పోర్టి వీల్-రిమ్ స్టిక్కర్స్‌, పాస్-బై స్విచ్, నిర్వహణ అవసరంలేని బ్యాటరీ వంటి నూతన ఫీచర్లు ఉన్నట్లు సంస్థ వైస్‌ ప్రెసిడెంట్ అనిరుధ్ హల్దార్ వివరించారు. 110 సీసీ, పూర్తి మెటల్‌ బాడీ, అధునాతన డిజిటల్‌ స్పీడోమీటర్‌ కలిగిన ఈ స్కూటర్‌ ధర రూ.53,027

Most from this category