STOCKS

News


లాభాల్లో బ్యాంక్‌ నిఫ్టీ

Tuesday 16th April 2019
Markets_main1555388482.png-25151

మార్కెట్‌ ప్రారంభంలోనే బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మంగళవారం దాదాపు 0.8 వరకూ లాభపడింది. ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకు షేర్లకు ప్రాతినిథ్యం వహించే ఈ సూచీ 30,236.25ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇన్వెస్టర్లు ట్రేడింగ్‌ ప్రారంభంలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించడంతో 0.77శాతం పెరిగి 30,338.30 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఇండెక్స్‌లో అత్యధికంగా ఐసీఐసీఐ బ్యాంక్‌ 3.50శాతం లాభపడగా, ఎస్‌బీఐ, యాక్సిస్‌ బ్యాంక్‌ 1శాతం, ఇండస్‌ ఇండ్‌, యస్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ అరశాతం, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, ఫెడరల్‌ బ్యాంక్‌ అరశాతం పెరిగాయి. మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 0.20శాతం, పీఎన్‌బీ 0.11శాతం, కోటక్‌ బ్యాంక్‌ 0.11శాతం నష్టపోయాయి. ఉదయం గం.9:30ని.లకు ఇండెక్స్‌ గతముగింపు (30,104.25)తో పోలిస్తే 0.75శాతం లాభపడి 30,334.10ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.
 



You may be interested

నిఫ్టీ కొత్త రికార్డు

Tuesday 16th April 2019

ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ సూచీ మంగళవారం కొత్త జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపడంతో నిఫ్టీ ఇండెక్స్‌ గతముగింపు(11,690.35)తో పోలిస్తే 76 పాయింట్ల లాభపడి 11,776.55 పాయింట్ల వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని తాకింది. 8 రోజుల క్రితం 11,761 వద్ద  రికార్డ్‌ గరిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. మరో సూచీ సెన్సెక్స్‌ ఆల్‌టైం గరిష్టానికి 100 పాయింట్ల దూరంలో ఉంది.

స్వల్ప నష్టంతో ప్రారంభమైన రూపాయి

Tuesday 16th April 2019

ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ మంగళవారం నష్టంతో ప్రారంభమైంది. నిన్న ముగింపు(69.42)తో పోలిస్తే 7 పైసల నష్టంతో 69.49ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఈ వారంలో మార్కెట్‌ రెండు రోజులు సెలవు(మార్చి 17న, మార్చి 19న) కావడంతో ఫారెక్స్‌ మార్కెట్లో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించడంతో సోమవారం 25పైసలు క్షీణించి 69.42 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు దిగిరావడం, దేశీయ ఈక్విటీ మార్కెట్లోకి విదేశీ నిల్వలు క్రమంగా

Most from this category