News


బంధన్‌ బ్యాంక్‌ చేతికి గృహ్‌ ఫైనాన్స్‌ !

Saturday 16th March 2019
news_main1552720902.png-24638

న్యూఢిల్లీ: బంధన్‌ బ్యాంక్‌లో గృహ్‌ ఫైనాన్స్‌ విలీనానికి ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. ఈ విలీనానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఆర్‌బీఐ తమకు లేఖ రాసిందని బంధన్‌  బ్యాంక్‌ తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన అందుబాటు ధరల్లో గృహాలకు రుణాలందించే గృహ్‌ ఫైనాన్స్‌ను కోల్‌కతాకు చెందిన బంధన్‌ బ్యాంక్‌ ఈ జనవరిలో టేకోవర్‌ చేసింది. షేర్ల మార్పిడి విధానంలో ఈ టేకోవర్‌ జరిగింది. ఈ డీల్‌ కారణంగా బంధన్‌ బ్యాంక్‌ ప్రమోటర్‌ బంధన్‌ ఫైనాన్షియల్‌ హోల్డింగ్స్‌ వాటా 82 శాతంనుంచి 61 శాతానికి, హెచ్‌డీఎఫ్‌సీ వాటా 57 శాతం నుంచి 15 శాతానికి తగ్గుతాయి. ప్రతి వెయ్యి గృహ్‌ ఫైనాన్స్‌ షేర్లకు 568 బంధన్‌ బ్యాంక్‌ షేర్లు లభిస్తాయి.



You may be interested

‘గ్రేడ్‌ అప్‌’తో ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ ఈజీ

Saturday 16th March 2019

‘గ్రేడ్‌ అప్‌’తో ఎంట్రెన్స్‌ ఎగ్జామ్స్‌ ఈజీ – త్వరలోనే ఒలంపియాడ్, ఎన్‌టీఎస్‌ఈ పరీక్షల కంటెంట్‌ – ప్రస్తుతం 50కి పైగా ఎగ్జామ్స్‌; 1.3 కోట్ల మంది విద్యార్థులు – తెలుగు రాష్ట్రాల్లో గేట్, ఇంజనీరింగ్‌ స్టూడెంట్సే అధికం – ఈ ఏడాది రూ.100 కోట్ల నిధుల సమీకరణ – ‘స్టార్టప్‌ డైరీ’తో కో–ఫౌండర్‌ శోభిత్‌ భట్నాగర్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘‘దేశంలోనే అతిపెద్ద ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌ ప్రిపరేషన్‌ స్టార్టప్‌ ‘గ్రేడ్‌ అప్‌’.. త్వరలోనే ఒలంపియాడ్, నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ (ఎన్‌టీఎస్‌ఈ)

ఏటీఎం కార్డు లేకుండానే

Saturday 16th March 2019

నగదు విత్‌డ్రా హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) మరొక వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. యోనో యాప్‌ ద్వారా ఏటీఎం కార్డు అవసరం లేకుండానే నగదు ఉపసంహరణ సేవలను ప్రారంభించింది. ఈ మేరకు తెలంగాణ సర్కిల్‌ సీజీఎం జె.స్వామినాథన్‌ శుక్రవారమిక్కడ బ్యాంక్‌ ఆవరణలో సేవలను ప్రారంభించారు.  16500 ఏటీఎంల్లో సేవలు... దేశంలోని అన్ని ఎస్‌బీఐ ఏటీఎం సెంటరల్లో యోనో క్యాష్‌ సేవలను వినియోగించుకోవచ్చని

Most from this category