STOCKS

News


అవెన్యూ సూపర్‌ మార్ట్‌ లాభం 18 శాతం అప్‌

Saturday 13th October 2018
news_main1539427572.png-21138

రిటైల్‌ వ్యాపార సంస్థ అవెన్యూ సూపర్‌(డీ-మార్ట్‌) ఈ క్యూ2లో మార్కెట్‌ ఆశించిన స్థాయిలోనే ఫలితాలను నమోదు చేసింది. . ఈ క్యూ2లో  కంపెనీ నికర లాభం 18 శాతం వృద్ధి చెంది రూ. 226 కోట్లను సాధించింది. గతేడాది ఇదే క్యూ2లో రూ.191 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. కంపెనీ మొత్తం ఆదాయం రూ.4,872.52 కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే క్యూ2లో సాధించిన రూ.3507 కోట్లతో పోలిస్తే ఇది 39శాతం ఎక్కువ. ఇదే కాలంలో ఈబిటా గత క్యూ2 తో పోలిస్తే 22.60శాతం పెరిగి రూ.390 కోట్లను ఆర్జించింది. ఇబిటా మార్జిన్‌ సైతం 8శాతం పెరిగింది. ఆర్థిక ఖర్చులు తగ్గడం నికర లాభాన్ని పెరగడానికి దోహదపడగా, కన్జ్యూమర్‌ వస్తువులపై ధర తగ్గించడం ఆదాయాలపై ప్రభావాన్ని చూపినట్లు అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నెవిల్లే నోరోన్హా తెలిపారు.  
కంపెనీ షేరు శుక్రవారం బీఎస్‌ఈలో 6శాతం లాభపడి రూ.1410.75ల వద్ద ముగిసింది. 



You may be interested

ఓపిక ఉంటేనే లాభాలు!

Sunday 14th October 2018

స్టాక్‌ మార్కెట్లలో ఇటీవలి కరెక్షన్‌ కొంత మంది ఇన్వెస్టర్లను నష్టాల పాలు చేసింది. మార్కెట్లు మరో 10 శాతం వరకు దిద్దుబాటుకు గురయ్యే అవకాశాలు లేకపోలేదని మార్సెల్లస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ వ్యవస్థాపకుడు సౌరభ్‌ ముఖర్జియా పేర్కొన్నారు. నిజానికి ఈక్విటీలన్నవి సహజంగా ఆటుపోట్లతో కూడి ఉంటాయని, కాకపోతే నష్టాలను పరిమితం చేసుకునే మార్గాలు కూడా ఉన్నాయని మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. నష్టాలను పరిమితం చేసుకోవడం అన్నది లాభాలు గడించేందుకు కీలకమని చెబుతున్నారు.

మిశ్రమంగా రియల్టీ రంగ ఫలితాలు: హెచ్‌డీఎఎఫ్‌సీ

Saturday 13th October 2018

ముంబై:- ఇటీవల ద్రవ్యత్వ కొరతతో అతలాకుతలమైన రియల్టీ రంగం రెండో త్రైమాసిక ఫలితాలపై హెచ్‌డీఎఫ్‌సీ అంచనాలను నివేదించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం(క్యూ2) రియల్టీ రంగం మిశ్రమ ఆర్థిక ఫలితాలను నమోదు చేయవచ్చని బ్రోకరేజ్‌ సంస్థ అంచనావేస్తుంది. డీఎల్‌ఎఫ్‌, బబేరాయ్‌, బ్రిగేడ్‌ కంపెనీలు ఇయర్‌ టు ఇయర్‌ బలమైన గణాంకాలను నమోదు చేయవచ్చు. ప్రేస్టేజ్‌, శోభ, కోట్లే లాభాదాయ పెరుగుదల బలహీనంగా ఉండొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ అంచనా వేస్తుంది. నిఫ్టీ

Most from this category