News


పెళ్లి కోసం లోన్‌ తీసుకుంటున్నారా?

Saturday 12th January 2019
personal-finance_main1547304304.png-23556

కొత్త శతాబ్దపు యువత ఇటీవల కాలంలో వివాహానికి లోన్‌ తీసుకోవడం పరిపాటైంది. ధూంధాంగా పెళ్లి చేసుకోవాలని భావిస్తున్న కుర్రకారు ఇందుకోసం బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణం తీసుకుంటున్నారు. అయితే ఈ రుణ భారం తమపై, తమ ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి భారం మోపుతుందో తెలుసుకోలేకపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. పేరుకు మ్యారేజ్‌ లోన్‌ కానీ అది కూడా ఒక రకమైన పర్సనల్‌ లోనేనని, పర్సనల్‌ లోన్స్‌లాగానే ఎక్కువ వడ్డీ ఉంటుందని చెబుతున్నారు.

మ్యారేజ్‌కి లోన్‌ తీసుకునే ముందు కొన్ని అంశాలను పరిశీలించి ముందడుగు వేయాలని సూచిస్తున్నారు.
- మీ ఆదాయం, వ్యయాలను లెక్కించి తదనుగుణంగా ఈఎంఐని నిర్ణయించుకోవాలి. 
- వివిధ బ్యాంకులు ఇస్తున్న మ్యారరేజ్‌ లోన్స్‌ను పోల్చిచూసుకోవాలి.
- ప్రాసెసింగ్‌ ఫీజులు, ఇతర ఛార్జీలు వీలయినంత తక్కువగా ఉండేలా ముందే మాట్లాడుకోవాలి.
- ఎన్‌బీఎఫ్‌సీల కన్నా బ్యాంకుల వద్ద పెళ్లికి లోన్‌ తీసుకోవడం ఉత్తమం. బ్యాంకుల్లో సహజంగా వడ్డీ తక్కువ.
- రుణం తీసుకోవడం కన్నా పెళ్లి ఖర్చులు తగ్గించుకోవడం, ఉద్యోగంలో చేరినప్పటినుంచే పెళ్లి కోసం కొంత సొమ్ము ఆదా చేయడం మంచిది. 



You may be interested

ఇరాన్‌ చమురు దిగుమతులపై కొత్త సడలింపులుండవు!

Saturday 12th January 2019

అమెరికా స్పష్టీకరణ ఇరాన్‌ నుంచి ముడిచమురు దిగుమతి చేసుకోవాలనుకునేదేశాలకు ఇకపై కొత్తగా నిబంధనల సడలింపు ఉండదని యూఎస్‌ తేల్చిచెప్పింది. ఇరాన్‌పై ఆంక్షల అనంతరం భారత్‌తో సహా 8 దేశాలకు అమెరికా కొద్దిపాటి సడలింపు ఇచ్చింది. అయితే ఇకపై కొత్తగా ఇలాంటి సడలింపులేవీ ఉండవని యూఎస్‌ ప్రతినిధి హుక్‌ చెప్పారు. ఇప్పటికే వేవియర్స్‌ పొందిన దేశాలకు సదరు సడలింపు గడువు మేతో ముగియనుంది. ఆపై వీటి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో హుక్‌

క్యు3 ఫలితాలపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనాలు

Saturday 12th January 2019

మూడో త్రైమాసికంలో వివిధ రంగాల ఫలితాలపై హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనాలు వెలువరించింది. ఎఫ్‌ఎంసీజీ, కన్జూమర్‌ అప్లయిన్సెస్‌, ఆల్కహాల్‌ అండ్‌ బెవరేజెస్‌, హోటల్స్‌ రంగాలకు చెందిన కంపెనీల ఫలితాలు ఎలా ఉండొచ్చనే విషయాన్ని వివరించింది.  ఎఫ్‌ఎంసీజీ: ఈ రంగంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయని బ్రోకరేజ్‌ సంస్థ భావిస్తోంది. ప్రభుత్వం లిక్విడిటీ మెరుగుపరిచే చర్యలు తీసుకోవడం, రైతు రుణమాఫీలు, ట్రేడ్‌ ఛానెల్స్‌ సాధారణ స్థితికి రావడం, ద్రవ్యోల్బణం స్థిరంగా ఉండడం వంటి పరిస్థితులు కలిసివస్తాయని

Most from this category