STOCKS

News


ఆటో, మెటల్‌ షేర్లు పెరగొచ్చు

Wednesday 17th April 2019
Markets_main1555496185.png-25189

ప్రధాన సూచి నిఫ్టీ బ్రేక్‌అవుట్‌ అయిన నేపథ్యంలో స్వల్పకాలిక చార్టుల్లో ఆటో, మెటల్‌ షేర్లు పటిష్టంగా కన్పిస్తున్నాయని, తగిన స్టాప్‌లాస్‌తో ఈ రంగాలకు చెందిన లార్జ్‌క్యాప్‌ షేర్లలో పొజిషన్లు తీసుకోవొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ డెరివేటివ్‌ అనలిస్ట్‌ వినయ్‌ రజని సూచించారు. నిఫ్టీ 11,760 పాయింట్ల ఎగువన 12,000 పాయింట్ల స్థాయికి చేరే ఛాన్స్‌ వుందని, అయితే సూచీ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా స్వల్పకాలంలో కొన్ని షేర్లు పెరగవచ్చని, వాటిలో ఆటో, మెటల్‌ షేర్లు పటిష్టంగా వున్నాయని వినయ్‌ వివరించారు. ఈ సందర్భంగా వచ్చే కొద్ది రోజుల్లో 6-11 శాతం మధ్య రాబడినిచ్చే మూడు షేర్లను ఆయన సూచించారు. అవి....

టీవీఎస్‌ మోటార్‌: ప్రస్తుత ధర: రూ.516, టార్గెట్‌ ధర: రూ.549, స్టాప్‌లాస్‌: రూ. 480

సెయిల్‌: ప్రస్తుత ధర: రూ.58.60, టార్గెట్‌ ధర: రూ.65, స్టాప్‌లాస్‌: రూ.55

జస్ట్‌ డయిల్‌: ప్రస్తుత ధర: రూ.599, టార్గెట్‌ ధర: రూ.680, స్టాప్‌లాస్‌: రూ. 570



You may be interested

జెట్‌ఎయిర్‌వేస్‌ బిడ్డర్లు వీరే..!

Wednesday 17th April 2019

జెట్‌ ఎయిర్‌ను రుణ సంక్షోభ కష్టాల నుంచి గట్టిక్కేంచే దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. దివాళా ప్రక్రియ చర్చల్లో భాగంగా కంపెనీ వాటాలను విక్రయించేందుకు ఎస్‌బీఐ మార్కెట్‌ క్యాపిటల్స్‌ నాలుగు బిడ్డర్లను ష్టార్‌ లిస్ట్‌ చేసినట్లు తెలిపింది. ఎతిహాత్‌ ఎయిర్‌లైన్స్‌తో పాటు టీపీజీ క్యాపిటల్‌, ఇండిగో పేరెంట్స్‌, ఎన్‌ఐఐఎఫ్‌లు షార్ట్‌లిస్టయిన బిడ్డర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. లిస్టింగ్‌లో చోటు దక్కించుకున్న ఈ నాలుగు కంపెనీలు ఏప్రిల్‌ 30 తేదీలోపు బిడ్ల‌ను సమర్పించాల్సి ఉంటుంది.

పదేళ్లలో నిఫ్టీ రాబడి 150 శాతం

Wednesday 17th April 2019

విదేశీ ఇన్వెస్టర్లకు డాలరు రూపేణా రాబడులిచ్చిన ప్రపంచ టాప్‌ 20 సూచీల్లో నిఫ్టీ అత్యుత్తమ ప్రదర్శన కనపర్చింది. ఏ కాలపట్టికతో పోల్చినా నిఫ్టీ ర్యాంకింగ్‌ 5 దిగువకు తగ్గకపోవడం విశేషం. ఒక ఏడాది, మూడేళ్లు, ఐదేళ్లు, పదేళ్లు కాలంలో వరుసగా 6 శాతం, 42 శాతం, 53 శాతం, 150 శాతం చొప్పున నిఫ్టీ కంపెనీల్లో పెట్టుబడులకు విదేశీ ఇన్వెస్టర్లు లాభాల్ని అందుకున్నారు. అమెరికాలోని డోజోన్స్‌ ఇండస్ట్రియల్‌ ఏవరేజ్‌ సూచితోపాటు

Most from this category