STOCKS

News


అంచనాల్ని మించిన చైనా జీడీపీ...కుదుటపడిన మార్కెట్లు

Wednesday 17th April 2019
Markets_main1555487685.png-25184

మార్చి క్వార్టర్లో చైనా జీడీపీ వృద్ధి అంచనాల్ని మించి నమోదుకావడంతో ఆసియా మార్కెట్లు స్థిరంగా ముగిసాయి. ఈ ఏడాది జనవరి–మార్చి త్రైమాసికంలో చైనా స్థూల ఆర్థిక వ్యవస్థ 6.4 శాతం వృద్ధిచెందినట్లు అధికారిక డేటా వెలువడింది. అమెరికాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధ ప్రభావంతో చైనా జీడీపీ వృద్ధి 6.3 శాతం దిగువన నమోదుకావొచ్చంటూ పలు అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థలు అంచనావేశాయి. ఈ ఏడాది తమ వృద్ధి రేటు 6–6.5 శాతానికి పరిమితమవుతుందంటూ బీజింగ్‌ సైతం గత అంచనాల్లో పేర్కొంది. అయితే మార్చి నెలలో పారిశ్రామికోత్పత్తి భారీగా 8.5 శాతం వృద్ధిచెందడంతో మొత్తంగా జీడీపీ వృద్ధి అంచనాలకు మించి నమోదయ్యింది. అలాగే మార్చి నెలలో రిటైల్‌ అమ్మకాలు కూడా 8.7 శాతం పెరిగినట్లు చైనా నుంచి తాజా గణాంకాలు వెలువడ్డాయి. బుధవారం చైనా జీడీపీ డేటా వెలువడకముందు..క్షీణతతో ట్రేడవుతున్న ఆసియా స్టాక్‌ సూచీలు తదుపరి కోలుకుని పాజిటివ్‌గా ముగిసాయి. ట్రేడింగ్‌ ఆరంభం నుంచి జపాన్‌ నికాయ్‌ సూచీ సానుకూలంగా ట్రేడయ్యి, చివరకు 57 పాయింట్ల లాభంతో ముగిసింది. అయితే హాంకాంగ్, చైనా, సింగపూర్, తైవాన్‌ సూచీలు ఆసియా ట్రేడింగ్‌ ప్రారంభం తర్వాత నష్టాల్లోకి మళ్లి, చివరకు స్వల్పలాభాలతో ముగిసాయి 



You may be interested

ఈ మూడు రంగాల కంపెనీలకే మంచి లాభాలు

Wednesday 17th April 2019

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు రంగాల్లోని కంపెనీలు మంచి లాభాల్ని ఆర్జించే అవకాశం వుందని తాము అంచనావేస్తున్నట్లు కొటక్‌ మహింద్రా అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ షిబాని సర్కార్‌ కురియన్‌ చెప్పారు. ఆమె ఒక అంగ్లచానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గత మూడేళ్ల నుంచి కార్పొరేట్‌ లాభాల్లో పెద్దగా వృద్ధిలేదని, అయితే 2018-19 క్యూ4లో కొంతవరకూ ఎర్నింగ్స్‌ మూమెంటమ్‌ వుంటుందన్న అంచనాలు వున్నాయన్నారు. ఈ క్రమంలో 2019.20లో

11,800 వద్ద పుట్‌రైటింగ్‌...బుల్లిష్‌నెస్‌కు సంకేతం

Wednesday 17th April 2019

మంగళవారంనాటి ర్యాలీ సమయంలో నిఫ్టీ 11,800 స్ర్టయిక్‌ వద్ద పెద్దస్థాయిలో పుట్‌రైటింగ్‌ జరగడం...ట్రేడర్లు బుల్లిష్‌గా వున్నారనడానికి సంకేతమని టెక్నికల్‌ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు ‘ఇన్‌ ద మనీ’ స్ర్టయిక్‌ అయిన 11,800 వద్ద పెద్ద ఎత్తున ట్రేడర్లు పుట్స్‌ విక్రయించినట్లు, అలాగే 11,700 స్ర్టయిక్‌ వద్ద కూడా గణనీయమైన స్థాయిలో పుట్‌ రైటింగ్‌ జరిగినట్లు డెరివేటివ్‌ డేటా వెల్లడిస్తున్నది. ఏ స్ర్టయిక్‌ వద్ద పుట్‌ ఆప్షన్ల విక్రయం ఎక్కువగా జరిగితే ఆ

Most from this category