అశోక్ లేలాండ్, హెచ్‌పీసీఎల్ కో-బ్రాండెడ్ కార్డు
By Sakshi

చెన్నై: హిందూజా గ్రూప్‌నకు చెందిన అశోక్ లేలాండ్... తాజాగా హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) భాగస్వామ్యంతో ‘ఇన్-ధన్ ఫ్యూయెల్ కార్డు’ను మార్కెట్లోకి తెచ్చింది. దీని ద్వారా వాణిజ్య వాహన యజమానులు కస్టమైజ్డ్ సేవలు పొందొచ్చు. ఈ కార్డు ఆవిష్కరణ సందర్భంగా అశోక్ లేలాండ్ ఎండీ కె దాసరి మాట్లాడుతూ.. ‘వాహనాల నిర్వహణలో ఇంధనం ఖర్చే 70 శాతం వరకు ఉంటుంది. కస్టమర్లకు మా కో-బ్రాండెడ్ కార్డు కస్టమైజ్డ్ సర్వీసులందిస్తుంది. దీని ద్వారా ఏడాదికి దాదాపు రూ.50,000 ఆదా చేసుకోవచ్చు. ఇలాంటి సదుపాయాన్ని మేమే తొలిసారిగా అందిస్తున్నాం’ అన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 15,000 హెచ్‌పీసీఎల్ పెట్రోల్ ఔట్‌లెట్స్‌లో ఇన్-ధన్ ఫ్యూయెల్ కార్డును వాడొచ్చని, హెచ్‌పీసీఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ టి.ఆర్.సుందరం చెప్పారు. ఇన్-ధన్ ఫ్యూయెల్ కార్డుతో టోల్ పేమెంట్స్ చెల్లింపుల విషయమై ఆర్బీఐతో చర్చిస్తున్నామని కూడా చెప్పారాయన. ఈ కో-బ్రాండెడ్ కార్డు తీసుకుంటే డ్రైవర్‌కు, క్లీనర్‌కు రూ.లక్ష చొప్పున ప్రమాద బీమా లభిస్తుంది. అశోక్ లేలాండ్ భారీ, తేలికపాటి వాణిజ్య వాహనాల తాలూకు కస్టమర్లు అన్ని డీలర్షిప్స్ వద్ద ఉచితంగా ఇన్-ధన్ ఫ్యూయెల్ కార్డులు పొందొచ్చు.
You may be interested
మరో 20 నగరాలకు ట్రూజెట్ సేవలు!
Thursday 12th July 2018హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టర్బో మేఘ ఎయిర్వేస్కు చెందిన విమానయాన సంస్థ ‘ట్రూజెట్’... వచ్చే మార్చి నాటికి మరో 20 నగరాల్లోకి అడుగుపెట్టనుంది. తక్కువ ధరలో సామాన్యులకూ విమాన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉడాన్ పథకంలో భాగంగా అహ్మదాబాద్ నుంచి కాండ్లా, పోర్బందర్, కేశోడ్, జైసల్మేర్, జల్గావ్, నాసిక్ నగరాలకు ట్రూజెట్ సర్వీసులు నడపనుంది. అలాగే అస్సాం రాజధాని గువహటి నుంచి బర్న్‌పూర్, కూచ్
మార్కెట్ ర్యాలీకి ఈ 5 నాణ్యమైన షేర్లే కారణం..!
Thursday 12th July 2018ముంబై: ప్రస్తుతం నిఫ్టీ 11,000 మార్కును అధిగమించినప్పటికీ.. నిజానికి ఈ సూచీ 10,000 వద్దనే ఉన్నట్లు లెక్కని యాక్సిస్ ఏఎమ్‌సీ ఈక్విటీస్ హెడ్ జినేష్ గోపానీ విశ్లేషించారు. 11,000 అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. సరిగ్గా గతేడాది ఇదే రోజు నుంచి ఇప్పటి వరకు చూస్తే స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 19 శాతం నష్టపోగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 24 శాతం