STOCKS

News


రిలయన్స్‌ రిఫైనింగ్‌లో రూ.లక్ష కోట్ల వాటా విక్రయం?

Wednesday 17th April 2019
Markets_main1555481857.png-25180

25 శాతం వాటా కొనుగోలుకు సౌదీ అరామ్‌కో చర్చలు

మార్కెట్‌క్యాప్‌లో దేశంలో నంబర్‌వన్‌ కంపెనీ, రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, రిటైల్, టెలికాం వ్యాపారాల దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన రిఫైనింగ్, పెట్రోకెమికల్స్‌ వ్యాపారంలో 25 శాతం వాటాను  కొనుగోలు చేసేందుకు ప్రపంచంలో అతిపెద్ద చమురు ఉత్పాదక కంపెనీల్లో ఒకటైన సౌదీ అరామ్‌కో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు వెలువడతున్నాయి. ఈ వ్యాపారంలో 25 శాతం మైనారిటీ వాటా విక్రయం ద్వారా 10 నుంచి 15 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.70,000 కోట్ల నుంచి రూ.1,05,000 కోట్లు) రిలయన్స్‌కు లభించవచ్చన్నది ఆంగ్ల దినపత్రిక టైమ్స్‌ ఆఫ్‌ కథనం. దీని ప్రకారం రిలయన్స్‌ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్‌ వ్యాపారం మొత్తం విలువ 55 నుంచి 60 బిలియన్‌ డాలర్ల విలువ (దాదాపు రూ.4.25 లక్షల కోట్లు) వుండవచ్చని అంచనా. ఇరు కంపెనీలు జరుపుతున్న చర్చలు దరిమిలా వాటా విలువపై జూన్‌లో ఇరు కంపెనీలూ ఒక ఒప్పందానికి రావచ్చని ఆ పత్రిక పేర్కొంది. ఈ డీల్‌ను కుదిర్చేందుకు అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ గోల్డ్‌మాన్‌ శాక్స్‌ను ఇరు కంపెనీలు నియమించినట్లు ఆంగ్ల పత్రిక వెల్లడించింది. ఇదే వార్తను రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అనుబంధ సంస్థ అయిన టీవీ18మనీకంట్రోల్‌ వెబ్‌సైట్‌లో కూడా ప్రచురించడం విశేషం. అయితే ఈ చర్చలపై సౌదీ అరామ్‌కో, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌లు స్పందించలేదు. సౌదీ అరేబియా యువరాజు సల్మాన్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీ సందర్శించినపుడు...భారత్‌లో 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి అవకాశాల కోసం చూస్తున్నట్లు తెలిపారు. అటు తర్వాత అరామ్‌కో...రిలయన్స్‌ రిఫైనింగ్‌ వ్యాపారంలో వాటా కొనుగోలుకు సిద్ధమైనట్లు వార్త. 
 



You may be interested

11,700పైన... 12,000 స్థాయికి నిఫ్టీ

Wednesday 17th April 2019

గత 8 ట్రేడింగ్‌ సెషన్లుగా 11,550–11,760 పాయింట్ల శ్రేణి మధ్య కన్సాలిడేట్‌ అయిన నిఫ్టీ ఎట్టకేలకు బ్రేక్‌అవుట్‌ను సాధించగలగడం పాజిటివ్‌గా పరిణామంగా టెక్నికల్‌ అనలిస్టులు పేర్కొంటున్నారు. మంగళవారం నిఫ్టీ 11,810 పాయింట్ల గరిష్టస్థాయి వద్ద కొత్త రికార్డును నెలకొల్పి 97 పాయింట్ల లాభంతో 11,787 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ క్రమంలో డెయిలీ టెక్నికల్‌ చార్టుల్లో బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పర్చినందున, తదుపరి అప్‌ట్రెండ్‌ సాధ్యపడుతుందని అనలిస్టులు వివరిస్తున్నారు. మంగళవారంనాటి గ్యాప్‌అప్‌

త్వరలో స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ ఐపీఓ

Wednesday 17th April 2019

 ఇష్యూ సైజు రూ.4,500 కోట్లు  న్యూఢిల్లీ: స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ కంపెనీ త్వరలో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు రానున్నది. ఐపీఓ సంబంధిత పత్రాలను ఈ సోలార్‌, ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ ఇటీవలనే మార్కెట్‌ నియంత్రణ సంస్థకు సమర్పించింది. షాపూర్‌జీ పల్లోంజీ అండ్‌ కంపెనీ ప్రమోట్‌​ చేస్తున్న స్టెర్లింగ్‌ అండ్‌ విల్సన్‌ సంస్థ ఈ ఐపీఓ ద్వారా రూ.4,500 కోట్లు సమీకరిస్తుందని అంచనా. ఈ ఐపీఓలో భాగంగా కంపెనీ చైర్మన్‌

Most from this category