STOCKS

News


అపోలో లాభం రూ.60 కోట్లు

Saturday 11th August 2018
news_main1533958225.png-19169

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అపోలో ఆసుపత్రి ప్రస్తుతం ఆర్ధిక సంవత్సరం తొలి త్రైమాసికంలో స్టాండలోన్‌ ప్రాతిపదికన రూ.60 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. గత ఆర్ధిక సంవత్సరం క్యూ1లో ఇది రూ.35 కోట్లు మాత్రమే. వార్షికంగా చూస్తే 71 శాతం వృద్ధి సాధించినట్లు కంపెనీ తెలియజేసింది. ఇక, గతేడాది క్యూ1లో మొత్తం ఆదాయం రూ.1,650 కోట్లుగా ఉండగా... ప్రస్తుతం క్యూ1లో ఇది 16 శాతం వృద్ధితో రూ.1,910 కోట్లకు చేరింది. ఎబిటా 31 శాతం వృద్ధితో రూ.289 కోట్లుగా నమోదయింది. శుక్రవారం బీఎస్‌ఈలో అపోలో హాస్పిటల్స్ షేరు ధర 1.81 శాతం క్షీణించి రూ. 946.55 వద్ద ముగిసింది. 
 



You may be interested

గల్ఫ్‌ ఆయిల్‌ నికర లాభం రూ.7 కోట్లు

Saturday 11th August 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో గల్ఫ్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ నికర లాభం రూ.7.95 కోట్లుగా ఉంది. గత ఆర్ధిక సంవత్సరం క్యూ1లో ఇది రూ.7.16 కోట్లు. 11 శాతం వృద్ధి. 2018 క్యూ1 కాన్సాలిడేషన్‌ ఫలితాల్లో ఆదాయం రూ.150 కోట్లను నమోదు చేసింది. గత ఆర్ధిక సంవత్సరం క్యూ1తో పోలిస్తే ఇది 3 శాతం వృద్ధి. టర్నోవర్‌ 17 శాతం వృద్ధితో రూ.133 కోట్లుగా ఉంది.

గ్రామాల్లో ‘నయాగాడీ’

Saturday 11th August 2018

 వాహనాల డీలర్‌షిప్‌కు ప్రత్యామ్నాయం  బైక్, కారు, ఆటో, ట్రాక్టర్‌ ఏదైనా కొనే వీలు  వాహన రుణం, బీమా, నిర్వహణ సేవలు కూడా  త్వరలో రూ.5 కోట్ల నిధుల సమీకరణ పూర్తి  ‘స్టార్టప్‌ డైరీ’తో నయాగాడీ ఫౌండర్‌ బాలాజీ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టూవీలరైతే ఓకే!! కానీ ట్రాక్టర్ల వంటి భారీ వాహనాల షోరూమ్‌లు ప్రతి గ్రామంలోనూ ఉండాలంటే కష్టమే. స్థలం... పెట్టుబడి... మార్జిన్లు... ఇలాంటివన్నీ దీనిపై ప్రభావం చూపిస్తాయి. ఇదిగో... ఇలాంటి సమస్యలకు చిత్తూరు జిల్లా నగరి

Most from this category