STOCKS

News


పెరిగిన ఆంధ్రా బ్యాంకు నష్టాలు

Tuesday 12th February 2019
Markets_main1549951167.png-24149

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ప్రభుత్వ రంగంలోని ఆంధ్రా బ్యాంకు నష్టాలు డిసెంబరు త్రైమాసికంలో మరింత పెరిగాయి. ఈ కాలంలో బ్యాంకు రూ.578 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. 2017 డిసెంబరు త్రైమాసికంలో ఈ నష్టం రూ.532 కోట్లుగా ఉంది. టర్నోవరు రూ.5,093 కోట్ల నుంచి రూ.5,322 కోట్లకు ఎగసింది. ఏప్రిల్‌- డిసెంబరు కాలంలో మొత్తం రూ.15,663 కోట్ల టర్నోవరుపై రూ.1,552 కోట్ల నష్టం వచ్చినట్లు బ్యాంకు వెల్లడించింది. మొండి బకాయిల కోసం చేసిన కేటాయింపులు రూ.1,749 కోట్ల నుంచి రూ.1,790 కోట్లకు చేరాయి. 2018 డిసెంబరు నాటికి అడ్వాన్సుల్లో మొండి బకాయిల వాటా 14.26 నుంచి 16.68 శాతానికి పెరిగింది. స్థూల నిరర్ధక ఆస్తులు రూ.21,599 కోట్ల నుంచి రూ.28,703 కోట్లను తాకాయి. నికర నిరర్ధక ఆస్తులు 7.72 శాతం నుంచి 6.99 శాతానికి దిగొచ్చాయి.



You may be interested

ఎలారా క్యాపిటల్‌ నుంచి క్వాలిటీ పిక్స్‌

Tuesday 12th February 2019

బడ్జెట్‌ ముగిసిపోవడంతో ఇకపై దేశీయ సూచీలు రాజకీయ యాక్టివిటీ జోన్‌లోకి అడుగుపెడుతున్నాయని ఎలారా క్యాపిటల్‌ అభిప్రాయపడింది. ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో సీబీఐ సంక్షోభం లాంటివి రాజకీయ ప్రకంపనలకు ఉదాహరణలని తెలిపింది. సాధారణ ఎన్నికలు ముగిసే వరకు ఇదే ధోరణి ఉంటుందని పేర్రొకంది. ఈ ఏడాది మిడ్‌క్యాప్స్‌ ఇప్పటికే 7 శాతం పతనమయ్యాయని తెలిపింది. ప్రధాన సూచీలతో సహా మార్కెట్లన్నీ ఆటుపోట్లకు గురయ్యే వేళ హైక్వాలిటీ స్టాక్స్‌ మాత్రమే నాణ్యమైన ఫలితాలు

స్పైస్‌జెట్‌కు ఇంధన సెగ

Tuesday 12th February 2019

77 శాతం తగ్గిన నికర లాభం రూ.2,531 కోట్లకు మొత్తం ఆదాయం ముంబై: చౌక ధరల విమానయాన సంస్థ, స్పైస్‌జెట్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక  కాలంలో 77 శాతం తగ్గింది. గత క్యూ3లో రూ.240 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో రూ.55 కోట్లకు చేరిందని స్పైస్‌జెట్‌ తెలిపింది. విమానయాన ఇంధనం ధరలు 34 శాతం పెరగడం,  రూపాయి 11 శాతం పతనం కావడం

Most from this category