STOCKS

News


ఆనంద్‌ రాథీ మిడ్‌క్యాప్‌ సిఫార్సులు

Thursday 12th July 2018
Markets_main1531373629.png-18238

బలమైన వృద్ధి, నాణ్యమైన మేనేజ్‌మెంట్‌, తక్కువ రుణాలు, ఆకర్షణీయమైన వాల్యూషన్లు ఉన్న కంపెనీలను ఎంచుకొని పెట్టుబడులు పెట్టాలని ఆనంద్‌ రాథీ బ్రోకరేజ్‌ సలహా ఇస్తోంది. ప్రస్తుత ఎర్నింగ్స్‌ సీజన్‌ కోసం మూడు మిడ్‌క్యాప్స్‌ను కొనొచ్చని రికమండ్‌ చేస్తోంది. 
1. పెరిసిస్టెంట్‌ సిస్టమ్స్‌: టార్గెట్‌ రూ. 960. ఈ ఆర్థిక సంవత్సరం మంచి రికవరీ చూపుతుందని అంచనా. గత రెండేళ్లుగా కంపెనీ డిజిటల్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కలిసిరానుంది. ఈ సంవత్సరం సేల్స్‌, మార్కెటింగ్‌పై ఎక్కువ ఫోకస్‌ పెట్టనుంది. రెవెన్యూలోటును ఇకమీదట పుంజుకునే మార్జిన్లు భర్తీ చేస్తాయి. ప్రస్తుతం మిగులునిధులు ఉండడంతో కొత్త కంపెనీల కొనుగోళ్లు చేయవచ్చని అంచనా. యూఎస్‌ఏతర మార్కెట్లపై కంపెనీ దృష్టి పెడుతోంది. సరైన వ్యాపార మిశ్రమం, వినియోగితా నిష్పత్తి బాగుండడం, ప్రైసింగ్‌, కరెన్సీ క్షీణతలు మార్జిన్ల మెరుగుదలకు తోడ్పడతాయి. 
2. ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌: టార్గెట్‌ రూ,. 2248. భారత్‌ ఫైనాన్స్‌తో డీల్‌ మిడ్‌టర్మ్‌లో ప్రయోజనాలు అందిస్తుంది. రిటైల్‌ పోర్టుఫోలియోపై అధిక శ్రద్ధ కారణంగా వృద్ధి పుంజుకుంటోంది. కార్పొరేట్‌, రిటైల్‌ నిష్పత్తిని చెరి సమానంగా ఉంచాలని కంపెనీ యత్నిస్తోంది. స్వల్పకాలానికి లోన్‌గ్రోత్‌లో 26 శాతం వృద్ధి ఉంటుంది. స్లిపేజ్‌లు తగ్గడంతో ఆస్తుల నాణ్యత మెరుగుపడుతోంది. రాబోయే కాలంలో బ్యాంకు స్థిరమైన అసెట్‌క్వాలిటీ కొనసాగిస్తుందని అంచనా. నికర వడ్డీ మార్జిన్లలో సైతం మెరుగుదల నమోదుకానుంది. రెండంచెల డీడీఎం మోడల్‌ను అనుసరించి చేసిన అధ్యయనం ప్రకారం ఈ షేరును కొనుగోలు చేయవచ్చు. 
3. అపోలో టైర్స్‌: టార్గెట్‌ రూ. 340. యాంటీ డంపింగ్‌ డ్యూటీ కారణంగా డిమాండ్‌ జోరందుకోవడం, హయ్యర్‌ టన్‌ కమర్షియల్‌ వాహనాల టైర్ల విక్రయాల్లో వృద్ధి.. కంపెనీకి ప్రయోజనకారులు. ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీ రెండంకెల రిప్లే్‌స్‌మెంట్‌ గ్రోత్‌ నమోదు చేస్తుందని అంచనా. ట్రక్‌రేడియల్‌ టైర్లలో కూడా బలమైన వృద్ధి కనిపిస్తోంది. ఈ ఏడాది చెన్నై ప్లాంట్‌ ఉత్పత్తి సామర్ధ్యం పెంచుకోనుంది. హంగరీ ప్లాంట్‌ సామర్ధ్యం సైతం ఈ ఆర్థిక సంవత్సరంలో పెరగనుంది. దీంతో వాల్యూంల్లో మంచి పెరుగుదల ఉంటుందని అంచనా. ఏపీలో కొత్త ప్లాంట్‌కు పునాది వేసింది. విదేశీ వ్యాపారం బాగుండడంతో యూరప్‌లో ఆపరేటింగ్‌ మార్జిన్లు 4 శాతానికి పెరుగుతాయి. రెవెన్యూ వచ్చే రెండేళ్లు 19 శాతం చక్రీయ వార్షిక వృద్ధి నమోదు చేయగలదు. 



You may be interested

ఇన్ఫీ ఫలితాలపై అంచనాలేంటి?

Thursday 12th July 2018

దేశీయ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలను శుక్రవారం ప్రకటించనుంది. ఇప్పటికే తోటి సంస్థ టీసీఎస్‌ అదరగొట్టే ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఇన్ఫీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇన్ఫీ ఫలితాలపై వివిధ బ్రోకరేజ్‌ల అభిప్రాయాలు, అంచనాలు ఇలా ఉన్నాయి... - ఫిలిప్‌ క్యాపిటల్‌: గతంలో ప్రకటించిన 6-8 శాతం రెవెన్యూ గ్రోత్‌ గైడెన్స్‌ను కొనసాగిస్తుంది. డీల్స్‌ వరద కారణంగా అవుట్‌లుక్‌

గురువారం వార్తల్లోని షేర్లు

Thursday 12th July 2018

ముం‍బై:- వివిధ వార్తలకు అనుగుణంగా గురువారం ప్రభావితం అయ్యే షేర్ల వివరాలు అశోకా బిల్డ్‌కాన్‌, జనరల్‌ ఇన్యూరెన్స్‌:- 2:1 నిష్పత్తిలో ఎక్స్‌-బోనస్‌ ప్రకటించాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌:- నేడు జరిగే బోర్డు సమావేశంలో బై-బ్యాక్‌ అంశంపై చర్చించనుంది. సిప్లా:- దక్షిణాఫ్రికాలోని తన అనుబంధ సంస్థ ద్వారా మిర్రేన్‌ సంస్థను రూ.228 కోట్లకు కొనుగోలు చేసింది. ఐడీఎఫ్‌సీ:- మధ్యంతర చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా రిన్‌కో సోమనీ నియమితులయ్యారు. హెచ్‌ఐఎల్‌:- జర్మనిలోని తన అనుబంధ సంస్థలో పూర్తి వాటాను కొనుగోలు చేసినట్లు

Most from this category