STOCKS

News


సిటీ యూనియన్‌ బ్యాంక్‌ను కొనొచ్చు : ఆనంద్‌రాఠి

Saturday 10th November 2018
Markets_main1541842345.png-21870

స్థిరమైన పనితీరుతో మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్న సిటీ యూనియన్ బ్యాంక్ షేరును కొనొచ్చని ప్రముఖ రేటింగ్‌ సంస్థ ఆనంద్‌ రాఠి సిఫార్సు చేస్తుంది. తమిళనాడు కేంద్రంగా పనిచేసే ప్రైవేట్ రంగ సంస్థ సిటీ యూనియన్ బ్యాంక్‌ మొత్తం 607 బ్రాంచులున్నాయి. అందులో అత్యధికంగా తమిళనాడులోనే ఏకంగా 418 బ్రాంచులు ఉన్నాయి. బ్యాంక్‌ ఎక్కువగా చిన్న, మధ్య ఎంటర్‌ప్రైజెస్‌(ఎస్‌ఎంఈ) సంస్థలకు రుణాలు కేటాయింపునకు ప్రాధాన్యత ఇస్తుంది. రూ.2.50 లక్షల నుంచి రూ.10లక్షల వరకు రుణాలను ఇస్తుంది. ఎస్‌ఎంఈలు త్వరగతిన రుణాలు చెల్లించడంతో పాటు, రుణాలు చెల్లించడంలో విఫలయ్యే అవకాశాలు బాగా తక్కువ కాబట్టి బ్యాంకు గత కొంతకాలంగా స్థిరమైన ఆదాయాలను ఆర్జిస్తుంది. ఇప్పుడు ఈ షేరుపై ఆనంద్‌రాఠి విశ్లేషణలు ఇలా ఉన్నాయి.
రంగం:- బ్యాంకింగ్‌ రంగం
రేటింగ్‌:- కొనొచ్చు
టార్గెట్‌ ధర:- రూ.211
విశ్లేషణ:-
ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసికంలో నికర వడ్డీ మార్జిన్‌(ఎన్‌ఐఎం) 4.3శాతంగా నమోదైంది. అధిక క్రిడెట్‌ - డిపాజిట్‌ నిష్పతి, వ్యయనియం‍త్రణ ఎన్‌ఐఎం పెరుగుదలకు దోహదపడ్డాయి. రిటైల్‌ రుణాలు పెరుగుదలతో రానున్న రెండేళ్లలో ఎన్‌ఐఎం ఇంచుమించు ఇదే స్థాయిలో నమోదుకావచ్చు. నాణ్యమైన అస్సెట్‌ క్వాలిటీ, తగినంత మూలధనంలు మరో ప్రధాన అనుకూలాంశాలని చెప్పవచ్చు. మొత్తం రుణాల్లో ఒత్తిడి ఆస్తుల విలువ రూ.2.9శాతం మాత్రమే ఉంది. బ్యాంక్‌ యాజమాన్యం ఈ శాతాన్ని 1.5శాతం నుంచి 2శాతానికి పరిమితం చేయడానికి ప్రణాళికలు రూపొందించింది. మరోవైపు రుణాల వృద్ధిని పెంపొందించుకునేందకు మూలధన నిల్వలు సమృద్ధిగా ఉన్నాయి.
ప్రతికూలాంశాలు:- అధిక స్లిపేజ్‌లు, అంచనాలకు అందుకోని రుణ వృద్ధి, ఈల్డ్‌ పెరుగదుల తదితర అంశాలు బ్యాంక్‌కు ప్రతికూలాంశాలుగా ఉన్నాయి.

View Pdf One (1541842407CUBK_CU_051118.pdf)

You may be interested

ఈ స్టాక్స్‌పై కోటక్‌ బుల్లిష్‌

Saturday 10th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ కోటక్‌ సెక్యూరిటీస్‌ తాజాగా పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం.. స్టాక్‌: అర్వింద్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.319 టార్గెట్‌ ప్రైస్‌: రూ.452 అర్వింద్‌ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో (క్యూ2, జూలై-సెప్టెంబర్‌)లో అంచనాలకు అనుగుణమైన ఫలితాలనే ప్రకటించింది. కన్సాలిడేట్‌ నికర అమ్మకాల్లో వార్షికంగా 11.6 శాతం వృద్ధి నమోదయ్యింది. టెక్స్‌టైల్‌ విభాగంలో 6 శాతం, మెటీరియల్స్‌ విభాగంలో 21 శాతం, బ్రాండెడ్‌ అప్పరెల్‌ విభాగంలో

సెంట్రమ్‌ స్టాక్‌ సిఫార్సులు..

Saturday 10th November 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా పలు స్టాక్స్‌ను సిఫార్సు చేసింది. అవేంటో చూద్దాం.. సన్‌ టీవీ నెట్‌వర్క్‌: కొనొచ్చు సన్‌ టీవీ నెట్‌వర్క్‌ స్టాక్‌పై బై రేటింగ్‌ను కొనసాగిస్తున్నాం. అయితే టార్గెట్‌ ప్రైస్‌ను రూ.1,170 నుంచి రూ.1,060కి (ప్రస్తుత ధర రూ.623) తగ్గిస్తున్నాం. ‍ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో అడ్వర్టైజింగ్‌ రెవెన్యూలో వృద్ధి నిరుత్సాహకరంగా ఉంది. అయితే రెండో అర్ధ భాగంలో వృద్ధి బాగుంటుందని అంచనా వేస్తున్నాం. పండుగ

Most from this category