News


మ్యూచువల్‌ ఫండ్స్‌లో కొత్త పెట్టుబడుల హవా

Sunday 13th January 2019
personal-finance_main1547404149.png-23559

దేశీయ మ్యూచువల్‌ ఫండ్స్‌లో కొత్త ఇన్వెస్టర్ల ప్రవేశం, నూతన పెట్టుబడులు ప్రోత్సాహకరంగా సాగుతున్నాయి. డిసెంబర్‌లో కొత్తగా 5.7 లక్షల పెట్టుబడి ఖాతాలు (ఫోలియోలు) ప్రారంభమవడం ఇదే సూచిస్తోంది. సెబీ గణాంకాల ప్రకారం... 2018 డిసెంబర్‌ ఆఖరుకు మొత్తం ఇన్వెస్టర్ల ఫోలియోల సంఖ్య 8.03 కోట్లుగా ఉంది. 

 

గతేడాది నవంబర్‌లో మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు (అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు/ఏఎంసీలు) కొత్తగా 7.05 లక్షల ఫోలియోలను యాడ్‌ చేసుకున్నాయి. అక్టోబర్‌లో 11.5 లక్షల మేర కొత్త ఖాతాలు తెరిచాయి. వీటితో పోలిస్తే డిసెంబర్‌లో తగ్గినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈక్విటీ ఫోలియోలు గతేడాది అక్టోబర్‌లో 10.6 లక్షలుగా ఉంటే, డిసెంబర్‌లో కొత్తగా ప్రారంభమైన ఈక్విటీ ఫోలియోల సంఖ్య సగానికి తగ్గి 4.91 లక్షలుగా ఉంది. పూర్తి ఈక్విటీ, ఈఎల్‌ఎస్‌ఎస్‌, బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ను ఈక్విటీ ఫండ్స్‌గానే పరిగణించడం జరిగింది. ప్రతీ ఇన్వెస్టర్‌ పెట్టుబడికి కేటాయించే సంఖ్యే ఫోలియో నంబర్‌. వీటినే కొత్త ఖాతాలుగా పేర్కొంటారు. అయితే ఒక ఇన్వెస్టర్‌కు వేర్వేరు ఏఎంసీల్లో ఎన్ని ఫోలియోలు అయినా ఉండొచ్చు. ఈక్విటీ ఫండ్స్‌ విభాగంలో కొత్త ఫోలియోల పెరుగుదలను... మార్కెట్లు పడిపోతున్న సమయంలో ఇన్వెస్టర్లు పెట్టుబడి అవకాశాలుగా చూడడం వల్లేనని మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు పేర్కొంటున్నారు. 

 

విభాగాల వారీగా...
ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌ విభాగంలో డిసెంబర్‌ నాటికి ఉన్న మొత్తం ఫోలియోల సంఖ్య 1,13,20,094. డిసెంబర్‌ నెలలో కొత్తగా జత అయినవి 1,02,657. బ్యాలన్స్‌డ్‌ పథకాల్లో ఉన్న ఫోలియోల సంఖ్య 63,91,853. కొత్తగా పెరిగినవి 21,964. ఈటీఎఫ్‌ల్లో మొత్తం ఫోలియోల సంఖ్య 8,59,734. కొత్తగా పెరిగినవి 3,10,044. డెట్‌ ఫండ్స్‌లో ఫోలియోల సంఖ్య 97,45,123. కొత్తగా పెరిగినవి 1,845. లిక్విడ్‌/ మనీ మార్కెట్‌ విభాగంలో ఫోలియోల సంఖ్య 15,57,258. కొత్తగా వచ్చినవి 39,171. ఈటీఎఫ్‌ల్లో 3.75 శాతం, గిల్ట్‌ ఫండ్స్‌లో 3.41 శాతం, లిక్విడ్‌ ఫండ్స్‌లో 2.58 శాతం చొప్పున వృద్ధి నమోదైంది. 



You may be interested

ఆ పెట్టుబడి విషయంలో పొరపాటు జరిగింది: పొరింజు 

Monday 14th January 2019

స్మాల్‌క్యాప్‌ సిగార్‌, ఏస్‌ ఇన్వెస్టర్‌ ఇలా పలు పేర్లతో సుపరిచితుడు... పొరింజు వెలియాత్‌ గురించి ప్రత్యేకంగా వివరించక్కర్లేదు. ఈక్విటీ ఇంటెలిజెన్స్‌ ఇండియా అనే పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సంస్థను నిర్వహిస్తూ మంచి పేరు తెచ్చుకున్న పొరింజు... గతేడాది మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ స్టాక్స్‌ పతనంతో దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొన్నారు. ఆయన నిర్వహణలోని ఆస్తుల విలువకు గట్టిగానే చిల్లుపడింది. తాజాగా తన పెట్టబడుల వ్యవహారంలో ఓ పెద్ద తప్పిదాన్ని ఆయన అంగీకరించారు. లయడ్‌

ఈ కంపెనీల నుంచి త్వరలో భారీ డివిడెండ్‌?

Sunday 13th January 2019

ప్రభుత్వరంగ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు మరింత మొత్తంలో డివిడెండ్‌ను వాటాదారులకు పంపిణీ చేయబోతున్నాయి. ఏడు ప్రభుత్వరంగ సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం డివిడెండ్‌ రూపంలోనే రూ.21,000 కోట్లను ఆశిస్తోందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఈ ఏడు కంపెనీల వద్ద 2018 మార్చి చివరికి నగదు నిల్వలు రూ.54,235 కోట్ల మేర ఉన్నట్టు ఈ సంస్థ తెలిపింది. అదే సమయంలో నికర రుణ భారం కేవలం రూ.2,943 కోట్లుగానే

Most from this category