STOCKS

News


కలిసివచ్చిన కరెక‌్షన్‌!

Saturday 15th September 2018
Markets_main1537009184.png-20293

మార్కెట్లో చెత్తంతా పోయింది
సంజీవ్‌ భాసిన్‌
మార్కెట్లో వచ్చిన కరెక‌్షన్‌తో చాలా చెత్త కొట్టుకుపోయిందని ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు సంజీవ్‌ భాసిన్‌ అభిప్రాయపడ్డారు. తాజా పతనంతో సూచీల్లో ఆషామాషీ ఆటగాళ్లు మాయమై, నిజమైన పెట్టుబడిదారులే మిగులుతారని చెప్పారు. వచ్చే వారం వర్ధమాన మార్కెట్లన్నీ బలమైన రీబౌండ్‌ చూపే అవకాశాలున్నాయన్నారు. డాలర్‌ దిగిరావచ్చని అంచనా వేశారు. అక్టోబర్‌లో అమెరికా సూచీలు మరో కొత్త గరిష్ఠం నమోదు చేయవచ్చని అభిప్రాయపడ్డారు. దేశీయ సూచీలు సైతం అక్టోబర్‌లో బలమైన ర్యాలీ చూడవచ్చన్నారు. ప్రస్తుతం రూపీ 72 స్థాయికి చేరడం, చమురు 80 డాలర్లకు చేరడం చూస్తే పరిస్థితి బాగున్నట్లు కనిపించదని, కానీ ఇది తాత్కాలికమని చెప్పారు. రూపీ ఎట్టి పరిస్థితుల్లో 73ను దాటకపోవచ్చని అంచనా వేశారు. చమురు ధరలు సైతం ఇంతకు మించి పెరగకపోవచ్చన్నారు. ఇకమీదట చిన్న, మధ్యతరహా స్టాకుల్లో సైతం స్పీడు కనిపించవచ్చని చెప్పారు. ఈ వారం సూచీల్లో కొంత ఒడిదుడుకులు కనిపిస్తాయని చెప్పారు. సూచీలు ప్రస్తుతం ఫెడ్‌ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు. 25 బీపీఎస్‌ పెరుగుదలను సూచీలు ప్రైస్‌ఇన్‌ చేసుకున్నాయని, ఇంతకు మించి పెంచితే పరిణామాలు నెగిటివ్‌గా ఉంటాయని చెప్పారు. ఫెడ్‌ నిర్ణయాన్ని బట్టి ఇతర దేశాల్లో రేట్లు ప్రభావితం అవుతాయన్నారు. భారత్‌లో ఇప్పట్లో రేట్ల పెంపు ఉండకపోవచ్చని అంచనా వేశారు. సెప్టెంబర్‌ త్రైమాసికం నుంచి ఎర్నింగ్స్‌లో మంచి మెరుగుదల ఉంటుందని సంజీవ్‌ చెప్పారు. 



You may be interested

10శాతం కరెక‌్షన్‌ వుండొచ్చు

Saturday 15th September 2018

ముంబై:-  మార్కెట్లో10శాతం వరకూ కరెక‌్షన్‌ ఉండొచ్చని ఎడెల్వీజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటజిస్ట్‌ సాహిల్‌ కపూర్‌ అభిప్రాయపడుతున్నారు. మార్కెట్‌ స్థితిగతులు, భారీగా క్షీణిస్తున్న రూపాయి పతన ప్రభావం మన మార్కెట్‌పై ఎంతవరకు ఉండవచ్చన్న అంశాలపై ఆయన తన అభిప్రాయాలను ఒక ఆంగ్లచానల్‌లో వ్యక్తం చేశారు. అలాగే ఇటీవల వ్యవస్థలో నెలకొన్న స్థూల ఆర్థిక సవాళ్లను ఇన్వెస్టర్లు వ్యూహాత్మకంగా ఎలా ఎదుర్కోవాలో వివరించారు. ఇంటర్వ్యూ వివరాలు... ప్రశ్న:- రూపాయి పతనం మార్కెట్‌ వర్గాలకే కాకుండా, ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారింది. ఈ ప్రస్తుత

షార్ట్‌కవరింగ్‌తో కాస్త రిలీఫ్‌!?

Saturday 15th September 2018

ఈ వారంపై నిపుణుల అంచనా వచ్చే వారం సూచీలు పాజిటివ్‌ జోన్‌లోనే కదలాడే అవకాశాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎకానమీపై అత్యున్నత స్థాయి సమావేశం జరిగే వేళ నిఫ్టీ 11250 పాయింట్ల వద్ద నుంచి బౌన్స్‌ చూపింది. తాజా ర్యాలీ షార్ట్‌కవరింగ్‌ కారణంగా ఏర్పడిందని చెప్పవచ్చు. తాజా అప్‌మూవ్‌లో ఇంకా బలం మిగిలిఉందని, సోమవారం తర్వాత ఈ అప్‌మూవ్‌ కదలికలు ఎక్కడవరకు ఉండవచ్చో అంచనా వేయగలమని నిపుణులు చెప్పారు. మార్కెట్‌ అంచనాలకు అనుగుణంగా

Most from this category