STOCKS

News


ఉద్యోగుల రవాణాకు ఈ–వాహనాలు

Saturday 1st June 2019
startups_main1559365174.png-26034

  • నెల రోజుల్లో హైదరాబాద్‌లో రూట్‌మ్యాటిక్‌ సేవలు షురూ
  • తొలుత 10.. సెప్టెంబర్‌ కల్లా 600 వాహనాలు అందుబాటులోకి
  • ప్రస్తుతం 12 నగరాల్లో సేవలు; రోజుకు 1.50 లక్షల మంది ప్రయాణం
  • ఈ ఏడాది ముగింపులోగా రూ.175 నిధుల సమీకరణ
  • ‘స్టార్టప్‌ డైరీ’తో కో–ఫౌండర్‌ సురాజిత్‌ దాస్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో:
ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఉద్యోగులకు రవాణా సేవలందిస్తున్న రూట్‌మ్యాటిక్‌ హైదరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తొలుత 10 వాహనాలతో నెల రోజుల్లో సేవలను ప్రారంభించనుంది. ఇప్పటికే సాంకేతికత, మార్కెటింగ్‌ నిపుణులు నియామకం పూర్తయింది. మైండ్‌ ట్రీతో ఒప్పందం చేసుకున్నామని, మరొక నాలుగైదు కంపెనీలతో చర్చలు చివరి దశలో ఉన్నాయని,  సెప్టెంబర్‌ నాటికి 600ల వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ కో–ఫౌండర్‌ అండ్‌ సీఈఓ సురాజిత్‌ దాస్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే..

ఐఎస్‌బీ పూర్వ విద్యార్థులు సురాజిత్‌ దాస్, శ్రీరామ్‌ కన్నన్‌లు బెంగళూరు కేంద్రంగా 2013 డిసెంబర్‌లో రూట్‌మ్యాటిక్‌ను ప్రారంభించారు. రూట్‌మ్యాటిక్‌ రెండు రకాల సేవలందిస్తుంది. 1. ఉద్యోగుల రవాణా కోసం వాహన సర్వీసులు, 2. ట్రాన్స్‌పోర్ట్‌ ఆటోమేషన్‌ సాఫ్ట్‌వేర్‌ సర్వీస్‌లు. మొదటి సర్వీస్‌లో కంపెనీలకు జీపీఎస్‌ ఆధారిత పాయింట్‌ టు పాయింట్‌ సేవలుంటాయి. అంటే వాహనాన్ని బట్టి కాకుండా అందులో ప్రయాణించే ఉద్యోగుల దూరాన్ని బట్టి చార్జీలుంటాయన్నమాట. దీంతో కంపెనీలకు వ్యయ భారం తగ్గుతుంది. ఒక్క ఉద్యోగికి నెలకు రూ.4,500–6,000 మధ్య ఉంటాయి. ఇక, రెండో విభాగంలో కంపెనీలకు ట్రాన్స్‌పోర్ట్‌ నిర్వహణ, టెక్నాలజీ సేవలందిస్తుంది. వీటి చార్జీలు ఒక్క ఉద్యోగికి నెలకు రూ.4,000–7,000 మధ్య ఉంటాయి.
60కి పైగా కంపెనీలు కస్టమర్లు...
ప్రస్తుతం ఎన్‌సీఆర్, ముంబై, హైదరాబాద్, పుణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, మధురై వంటి 12 నగరాల్లో సేవలందిస్తుంది. సిస్కో, బార్క్‌లెస్, ఇన్ఫోసిస్, అమెజాన్‌ వంటి 60కి పైగా కార్పొరేట్‌ కంపెనీలు కస్టమర్లుగా ఉన్నాయి. ప్రస్తుతం మాకు 700లకు పైగా వాహనాలు, 1.50 లక్షల మంది కస్టమర్లున్నారు. నెలకు 10 లక్షల కి.మీ. ట్రాన్స్‌పోర్టేషన్‌ జరుగుతుంది. ఈ ఏడాది ముగింపు నాటికి 4 వేల వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలన్నది మా లక్ష్యం. ఏటేటా రెట్టింపు అదాయాన్ని నమోదు చేస్తున్నాం. 
రూ.175 కోట్ల నిధుల సమీకరణ...
ప్రస్తుతం మా కంపెనీలో 200 మంది ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపు లోగా మరొక 100 మందిని నియమించుకుంటాం. ‘‘ఇప్పటివరకు 31 కోట్ల నిధులను సమీకరించాం. బ్లూమ్‌ వెంచర్స్, దుబాయ్‌కు చెందిన వ్యామ్‌ క్యాపిటల్, కెఫే కాఫీ డే మాజీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నరేష్‌ మల్హోత్ర ఈ పెట్టుబడులు పెట్టారు. ఈ ఏడాది ముగింపు లోగా రూ.175 కోట్లు (25 మిలియన్‌ డాలర్లు) నిధులను సమీకరించనున్నాం. పలువురు ఇన్వెస్టర్లతో చర్చలు జరుగుతున్నాయని’’ సురాజిత్‌ వివరించారు. 



You may be interested

డేటా భద్రతకు ‘గూగుల్‌’ నూతన ఫీచర్లు

Saturday 1st June 2019

న్యూఢిల్లీ: యూజర్ల సమాచార గోప్యత వ్యవస్థను మరింత బలోపేతం చేయడంపై దృష్టిసారించినట్లు గూగుల్‌ ప్రకటించింది. ఇందుకోసం అధునాతన ఫీచర్ల పెంపు విషయంలో అత్యుత్తమ ప్రైవసీ సెట్టింగులను ఏకంగా రెట్టింపు చేసినట్లు వివరించింది. ఈ అంశంపై సంస్థ చీఫ్‌ ప్రైవసీ ఆఫీసర్‌ కీత్ ఎన్‌రైట్ మాట్లాడుతూ.. ‘డేటా వినియోగంపై యూజర్లకు మాత్రమే పూర్తి అధికారం ఉండేలా ఫీచర్లను పెంపొందించాం. భద్రత పెంపు కోసం భారీ మొత్తంలో పెట్టుబడిపెట్టాం’ అని వివరించారు. గోప్యత

డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ లాభంలో భారీ వృద్ధి

Saturday 1st June 2019

2018-19లో రూ.44.59 కోట్లుగా నమోదు ఒక్కో షేరుకు రూ.3 డివిడెండ్‌ పాతపోస్టాఫీసు (విశాఖ): డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) టర్నోవర్‌ 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ.698.51 కోట్లకు చేరుకుందని ఆ  సంస్థ శుక్రవారం ప్రకటించింది. 2017–18 సంవత్సరంలో సంస్థ టర్నోవర్‌ రూ.612.12 కోట్లుగా ఉండడం గమనార్హం. 2017–18 ఆర్ధిక సంవత్సరంలో డీసీఐకి రూ.17.14 కోట్ల నికర లాభం రాగా, అది 2018-19 ఆర్ధిక సంవత్సరంలో రూ.44.59 కోట్లకు వృద్ధి చెందింది. వాటాదారులకు

Most from this category