STOCKS

News


అర్ధరాత్రి మతి పోగొట్టే గిఫ్ట్‌!

Saturday 4th August 2018
startups_main1533366700.png-18946

  •  ‘ది6’లో 10 విభాగాలు.. 38 రకాల సర్‌ప్రైజ్‌లు
  •  నెలకు 100 ఆర్డర్లు; 80 శాతం కస్టమర్లు మహిళలే
  •  3 నెలల్లో ముంబై, పుణె, ఢిల్లీలకు విస్తరణ
  •  ‘స్టార్టప్‌ డైరీ’తో ది6 ఫౌండర్‌ శక్తివేల్‌ 

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: బర్త్‌ డేకు విష్‌ చేయాలన్నా, ప్రేమను వ్యక్తపరచాలన్నా.. సందర్భమేదైనా సర్‌ప్రైజ్‌ ఉంటేనే థ్రిల్‌. దీంతో ఆనందం, ఆశ్యర్యం రెండూ రెట్టింపవుతాయి. కేక్, బెలూన్స్‌ వంటివి అర్ధరాత్రి ఇంటికి తీసుకెళ్లి ఇచ్చి ఆశ్చర్యపర్చడమే కాదండోయ్‌... రోడ్డు మీద వెళ్తుంటే సడెన్‌గా ఓ డ్యాన్సర్ల బృందం మన చుట్టూ ఫ్లాష్‌మాబ్‌ చేయడం, మనల్ని కిడ్నాప్‌ చేసి ప్రైవేట్‌ జెట్‌లో తీసుకెళ్లి లవ్‌ ప్రపోజ్‌ చేయడం... ఇలా ఒకటి రెండు కాదు బోలెడన్ని సర్‌ప్రైజ్‌లున్నాయంటున్నారు శక్తివేల్‌ పన్నీర్‌సెల్వం. ది6.ఇన్‌ పేరిట హైదరాబాద్‌లోనూ వందలాది మందిని ఆశ్చర్యపరుస్తున్న (సర్‌ప్రైజ్‌) చేస్తున్న తమిళనాడుకు చెందిన ఈ స్టార్టప్‌ గురించి మరిన్ని వివరాలు ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు. 
మాది కోయంబత్తూరులోని ఓ మధ్యతరగతి కుటుంబం. అక్కడే మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తయ్యాక పలు కంపెనీల్లో పనిచేశా. కేబుల్‌ టీవీ ఆపరేటర్‌గా నెలకు రూ.300ల జీతంతో ప్రారంభించి బెంగళూరులోని ఓ ప్రముఖ ఎంఎన్‌సీ కంపెనీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ స్థాయికి చేరా. ఉద్యోగరీత్యా విదేశాల్లో తిరగడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్టార్టప్స్‌ ప్రారంభించడం, సక్సెస్‌ సాధించడం దగ్గరుండి చూశా. దీంతో మనమూ సొంతంగా కంపెనీ పెట్టాలని నిర్ణయించుకొని ఇండియాకు తిరిగొచ్చేశా. మరో స్నేహితుడు రాధాకృష్ణన్‌తో స్టార్టప్స్‌ గురించి చర్చించా. ఇద్దరం కలిసి 64 రకాల వ్యాపార ఐడియాలను జాబితాగా రూపొందించాం. ఇందులో టీ షాపు, పెట్రోల్‌ పంపు, గ్రీనరీ వంటి చాలా ఐడియాలున్నాయి. చివరికి మూలధన పెట్టుబడి తక్కువగా ఉండే సర్‌ప్రైజ్‌ గిఫ్టింగ్‌ వద్ద ఆగింది. పెట్టుబడి కూడా తక్కువే కాబట్టి దీనికే ఓకే అనుకొని 2009 నవంబర్‌లో రూ.50 వేల పెట్టుబడితో కోయంబత్తూర్‌ కేంద్రంగా ది6.ఇన్‌ను ప్రారంభించాం. వ్యక్తిగత సర్‌ప్రైజ్‌లను అందించడం ది6 ప్రత్యేకత.
10 విభాగాలు; 38 రకాల సర్‌ప్రైజ్‌లు
అర్ధరాత్రి కేక్, బొకేలు, బెలూన్స్, గిఫ్ట్స్‌ వంటివి డెలివరీ చేయడమే కాకుండా వ్యక్తిగత సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం ది6 ప్రత్యేకత. లవ్‌ ప్రపోజల్‌ సీన్స్, ప్రైవేట్‌ జెట్‌లో ప్రపోజల్, ఫ్లాష్‌ మాబ్, బాక్స్‌ ఆఫ్‌ బెలూన్స్, మెసేజ్‌ బాటిల్‌ వంటి 10 విభాగాల్లో 38 రకాల సర్‌ప్రైజ్‌లున్నాయి. ధరలు రూ.3 వేల నుంచి రూ.3.5 లక్షల వరకున్నాయి. బాక్స్‌లో బెలూన్స్‌ ధర రూ.3 వేలు, రూ.3.5 లక్షల సర్‌ప్రైజ్‌ ఏంటంటే.. 7 నిమిషాల పాటు ప్రపోజల్‌ సీన్‌ ఉంటుంది. దీన్ని రెమో సినిమాలో వినియోగించుకున్నారు కూడా.
3 నెలల్లో ముంబై, ఢిల్లీలో..
ప్రస్తుతం కోయంబత్తూరు, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కేరళ, తమిళనాడు ప్రాంతాల్లో మా సేవలు అందుబాటులో ఉన్నాయి. స్థానికంగా రెస్టారెంట్లు, మాల్స్, కాపీ షాప్స్, సింగర్స్, డ్యాన్సర్లు, ఆర్టిస్టులతో ఒప్పందం చేసుకున్నాం. 3 నెలల్లో ముంబై, ఢిల్లీ, పుణె, అహ్మదాబాద్‌ నగరాలకు విస్తరించనున్నాం. వచ్చే ఏడాది నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలన్నది లక్ష్యం. చెన్నై, బెంగళూరులో ఓ ప్రైవేట్‌ జెట్‌ ఆపరేటర్‌తో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతానికి జెట్‌ సర్‌ప్రైజ్‌లు కేవలం ఆ రెండు నగరాల్లోనే ఉంది. నెల రోజుల్లో హైదరాబాద్‌కూ విస్తరించనున్నాం.
రూ.50 లక్షల ఆదాయం..
గతేడాది 5 వేల సర్‌ప్రైజ్‌లను అందించాం. ఈ ఏడాది ఇప్పటివరకు వెయ్యి వరకు అందించాం. ప్రస్తుతం నెలకు 100 ఆర్డర్లు వస్తున్నాయి. హైదరాబాద్‌ నుంచి 20 వరకుంటాయి. హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ), ఐటీ ఉద్యోగులే ఎక్కువ కస్టమర్లున్నారు. మా మొత్తం కస్టమర్లలో 80 శాతం మహిళలే. గతేడాది రూ.50 లక్షల ఆదాయాన్ని ఆర్జించాం. ఈ ఏడాది 20 శాతం వృద్ధిని లక్ష్యించాం. మా మొత్తం ఆదాయంలో 15 శాతం వాటా హైదరాబాద్‌ నుంచి ఉంటుంది. 
 
 



You may be interested

100 కోట్ల రైడ్స్‌ను పూర్తి చేసిన ఉబెర్‌

Saturday 4th August 2018

హైదరాబాద్‌: ట్యాక్సీ సేవల కంపెనీ ఉబెర్‌ ఇండియా దక్షిణాసియాలో మరో మైలురాయిని అధిగమించింది. ఐదేళ్ల క్రితం బెంగళూరులో తొలి ట్రిప్‌తో ప్రారంభమైన ఉబెర్‌ సేవలు ఇదే బెంగళూరలో 100 కోట్ల రైడ్స్‌కు చేరుకుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 10 బిలియన్‌ రైడ్స్‌ లక్ష్యంగా కృషి చేస్తున్నట్టు ఉబెర్‌ ఇండియా దక్షిణాసియా ప్రెసిడెంట్‌ ప్రదీప్‌ పరమేశ్వరన్‌ తెలిపారు.  

నిధుల సమీకరణ సిద్ధమైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు

Saturday 4th August 2018

ముంబై:- ప్రైవేట్‌ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు నిధుల సమీకరణకు సిద్ధమైంది. దేశీయ, అమెరికా మార్కెట్ల నుంచి రూ.15,151 కోట్ల నిధుల సమీకరణకు ప్రణాళికలను రచించింది. మన దేశీయ మార్కెట్లో క్యూఐపీ పద్ధతిలోనూ, అమెరికా మార్కెట్లో ఏడీఆర్‌ (అమెరిక‌న్ డిపాజిట‌రీ రిసిప్ట్స్) జారీ చేయ‌డం ద్వారా రూ.15,151 కోట్లు సమీకరించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దేశీయ మార్కెట్లో క్యూఐపీ పద్ధతిలో భాగంగా ‘‘ప్రతి షేరు ధర రూ.2,160 చొప్పున 1.28 కోట్ల

Most from this category