STOCKS

News


పోటీ పరీక్షలకు... ఇంట్లోనే పాఠాలు

Friday 8th June 2018
startups_main1528475424.png-17218

  •  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఆన్‌లైన్‌ శిక్షణ
  •  నియోస్టెన్సిల్‌లో 300 కోర్సులు; 60 మంది ప్రొఫెసర్లు
  •  హైదరాబాద్, జైపూర్‌లో ప్రాంతీయ కేంద్రాలు కూడా..
  •  ఈ ఏడాది రూ.33 కోట్ల నిధుల సమీకరణ పూర్తి
  •  ‘స్టార్టప్‌ డైరీ’తో నియోస్టెన్సిల్‌ కో–ఫౌండర్‌ కుష్‌ బీజల్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐఏఎస్, ఐఈఎస్‌ వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను కొట్టాలంటే... కఠోరమైన సాధన, శిక్షణ, విశ్లేషణా నైపుణ్యం... ఇలా చాలా అస్త్రాలతో సన్నద్ధమవ్వాలి. ఇందుకోసం మెట్రో నగరాల్లోని టాప్‌ కోచింగ్‌ సెంటర్లకు పరుగులు పెట్టాలి. అలా అని అందరూ తమ పిల్లాన్ని శిక్షణ కేంద్రాలకు పంపించలేరు. ఆర్థిక సమస్యలు ఒక కారణమైతే.. దూరం, భద్రత వంటివి మరో కారణం! అలాకాక తమ పిల్లాడు ఇంట్లోనే దేశంలోని ఐఐటీ, ఐఐఎం వంటి టాప్‌ కాలేజీల్లోని ప్రొఫెసర్ల పాఠాలు ప్రత్యక్షంగా వినే వీలుంటే? ఇంకేముంది.. ఎంచక్కా ఇంట్లో నుంచే పోటీ పరీక్షలకు సిద్ధకావచ్చు కదా!! ఇదే ఆలోచన ఇద్దరు అన్నదమ్ముల్ని స్టార్టప్‌ వైపు అడుగులేయించింది. ఆ స్టార్టప్‌ పేరే... నియోస్టెన్సిల్‌. పూర్తి వివరాలు సంస్థ కో–ఫౌండర్‌ కుశ్‌ బీజల్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.
‘‘మాది రాజస్థాన్‌లోని మారుమూల గ్రామం. మా పేరెంట్స్‌ ఆర్ధికంగా కాస్త ఉన్నవారు కావటంతో కోల్‌కతాలోని టాప్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ ఇప్పించారు. నాకు ఐఐటీ అహ్మదాబాద్‌లో, మా తమ్ముడు లవ్‌ బీజల్‌కు ఐఐఎం ఢిల్లీలో సీటొచ్చింది. మా పేరెంట్స్‌లా అంతా తమ పిల్లల్ని మెట్రో నగరాల్లోని ట్రైయినింగ్‌ ఇనిస్టిట్యూట్స్‌కు పంపించలేరని.. ఫీజులు భరించలేరని మేం అర్థం చేసుకున్నాక... దీనికి పరిష్కారం వెదికే క్రమంలో 2014లో రూ.15 లక్షల పెట్టుబడితో గుర్గావ్‌ కేంద్రంగా నియోస్టెన్సిల్‌ను ఆరంభించాం.
300 కోర్సులు; 60 మంది టీచర్లు..
సివిల్స్‌, ఐఈఎస్, ఎస్‌ఎస్‌ఎసీ, బ్యాంకింగ్, రైల్వే వంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు... ఏపీ, తెలంగాణ సహా 10 రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ నియోస్టెన్సిల్‌లో ఉంది. ప్రస్తుతం 300 కోర్సులున్నాయి. శిక్షణ కోసం సివిల్‌ సర్వీస్‌ శిక్షణ సంస్థలు, రిటైర్డ్‌ ఐఐటీ, ఐఐఎంలు, టాప్‌ కాలేజీల ప్రొఫెసర్లతో ఒప్పందం చేసుకున్నాం. ప్రస్తుతం మా ఫ్లాట్‌ఫాంలో 60 మంది టీచర్లున్నారు. ఒకే సబ్జెక్ట్‌లో నలుగురైదుగురు టీచర్లుంటారు. అభ్యర్థి తనకు నచ్చిన ప్రొఫెసర్‌ను ఎంచుకోవచ్చు. ఎంపిక చేసిన సమయం, తేదీ ప్రకారం ప్రత్యక్ష పాఠాలుంటాయి. ఆ సమయానికి అభ్యర్థి లైవ్‌లో పాఠం వినలేకుంటే దాన్ని రికార్డ్‌ చేసుకోవచ్చు. దీంతో వీలున్నప్పుడల్లా వినే వీలుంటుంది. ఆన్‌లైన్‌ ప్రత్యక్ష పాఠాలతో పాటు టెస్ట్‌ సిరీస్, కౌన్సిలింగ్, బృంద చర్చలు, స్టడీ మెటీరియల్‌ వంటివి కూడా అందిస్తాం.
నియోస్టెన్సిల్‌, టీచర్లకు 50:50..
కోర్సును బట్టి ధరలు రూ.3 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఉన్నాయి. అభ్యర్థులు చెల్లించే ఫీజులో 50 శాతం టీచర్లకు మిగిలింది కంపెనీకి. ఇప్పటిదాకా నియోస్టెన్సిల్‌లో 3 లక్షల మంది యూజర్లున్నారు. వీరిలో 6 వేల మంది పెయిడ్‌ యూజర్లు. ప్రస్తుతం ఏడాదికి 3 వేల మంది అభ్యర్థులు మా సేవలను వినియోగించుకుంటున్నారు. వచ్చే ఏడాది నాటికి ఈ సంఖ్యను 7 వేలకు చేర్చాలని లక్ష్యించాం. గతేడాది రూ.6 కోట్ల టర్నోవర్‌ను చేరుకున్నాం. ఈ ఏడాది రూ.15 కోట్ల టర్నోవర్‌ను లక్ష్యించాం. ఈ ఏడాది ముగిసేలోగా టీచర్ల సంఖ్యను 150కి, కోర్సులను సంఖ్యను వెయ్యికి చేర్చాలని లక్ష్యించాం.
హైదరాబాద్‌లో ప్రాంతీయ కేంద్రం..
ఆన్‌లైన్‌ పాఠాలతో పాటు ఆఫ్‌లైన్‌లో హైదరాబాద్, జైపూర్‌లో ప్రాంతీయ కేంద్రాలున్నాయి. వీటిల్లో టీవీ, కంప్యూటర్, ఇంటర్నెట్‌ అందుబాటులో ఉంటుంది. స్థానికంగా ఉండే అభ్యర్థులు ఆయా కేంద్రాల్లో మా సేవలను వినియోగించుకోవచ్చు. త్వరలోనే దేశంలో మరో 20 ప్రాంతీయ కేంద్రాలను ప్రారంభించనున్నాం. ఐఐటీ, ఐఐఎం ఎంట్రన్స్‌ కోర్సులను కూడా ప్రారంభిస్తాం. రెండేళ్లలో విదేశీ కోర్సులు, ఉద్యోగాలపై కూడా లైవ్‌ పాఠాలు ప్రారంభిస్తాం.
33 కోట్ల నిధుల సమీకరణ..
ప్రస్తుతం మా సంస్థలో 50 మంది ఉద్యోగులున్నారు. డిసెంబర్‌ నాటికి ఈ సంఖ్యను 80కి చేరుస్తాం. ఇటీవలే టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా, ఎం అండ్‌ ఎస్‌ పార్టనర్స్, ప్యారగాన్‌ ట్రస్ట్, జబాంగ్, యూనికామర్స్‌ ఫౌండర్ల నుంచి రూ.6 కోట్ల నిధులను సమీకరించాం. అనలిటకల్‌ ఆధారిత టెస్ట్‌ ప్రాక్టీస్‌ పోర్టల్‌ టెస్ట్‌కేఫ్‌నూ కొనుగోలు చేశాం. ఈ ఏడాది ముగిసేనాటికి ఉత్తరాది రాష్ట్రానికి చెందిన మరో ఎడ్యుటెక్‌ స్టార్టప్‌ను కొనుగోలు చేయనున్నాం. అలాగే రూ.33 కోట్ల నిధుల సమీకరిస్తాం. ఈక్విటీ సంస్థలతో చర్చలు కూడా జరుగుతున్నాయి’’ అని కుశ్‌ వివరించారు.
 



You may be interested

మేలో తగ్గిన ఫండ్స్‌ ఆస్తులు

Friday 8th June 2018

 న్యూఢిల్లీ: మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆస్తులు గత నెలలో రూ.66,000 కోట్ల మేర తగ్గిపోయాయి. ఇన్‌కమ్‌, లిక్విడ్‌ స్కీమ్‌ల్లో ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా మ్యూచువల్‌ ఫండ్‌ నిర్వహణ ఆస్తులు మే నెలలో ఈ మేరకు తగ్గిపోయాయి. అసోసియేషన్‌​ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (యాంఫీ) వెల్లడించిన వివరాల ప్రకారం..,  ♦ ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.23.25 లక్షల కోట్లుగా ఉన్న ఫండ్స్‌ ఆస్తులు మే నెలలో రూ.22.6 లక్షల కోట్లకు తగ్గిపోయాయి.  ♦

డు ఐటీ టాలెంట్‌ వెంచర్స్‌

Friday 8th June 2018

 హైదరాబాద్‌: ప్రముఖ స్టార్టప్‌ మెంటార్స్‌ దర్శనా భల్లా, రాధాకపూర్‌ ఖన్నా కలిసి దేశంలోనే తొలిసారిగా ‘డు ఐటీ టాలెంట్‌ వెంచర్స్‌’ పేరిట నైపుణ్య నిర్వహణ సంస్థను ప్రారంభించారు. ఇది క్రీడ, వినోదం, సంగీతం, పాకశాస్త్రం వంటి రంగాల్లో ఔత్సాహికుల్లో నైపుణ్యాన్ని అభివృద్ధి చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇప్పటికే ఆయా రంగాల్లోని సుమారు 50 మంది నిపుణులు, ప్రముఖులతో ఒప్పందం చేసుకున్నామని పేర్కొంది. వినోద రంగం నుంచి ఫర్హాన్‌ అక్తర్, జాన్‌

Most from this category