STOCKS

News


లోన్‌ కావాలా నాయనా!

Saturday 11th May 2019
startups_main1557554451.png-25676

  • 24 బ్యాంక్స్, ఎన్‌బీఎఫ్‌సీలతో మైలోన్‌కేర్‌ ఒప్పందం
  • గతేడాది వెయ్యి కోట్లు; ఈ ఏడాది రూ.2500 కోట్ల పంపిణీ లక్ష్యం
  • 25 లక్షల మంది కస్టమర్లు; తెలుగు రాష్ట్రాల వాటా 10 శాతం
  • ఇప్పటివకే రూ.8 కోట్ల నిధుల సమీకరణ పూర్తి
  • ‘స్టార్టప్‌ డైరీ’తో ఫౌండర్‌ అండ్‌ సీఈఓ గౌరవ్‌ గుప్తా

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రుణం విషయంలో సిబిల్‌ స్కోర్, బ్యాంక్‌ బ్యాలెన్స్, స్టేట్‌మెంట్‌ ప్రతీ ఒక్కటీ కౌంట్‌ అవుతుంది. అందుకే వ్యాపారస్తులు, పెద్దలకు వచ్చినంత సులువుగా సామాన్యులకు, ఎస్‌ఎంఈలకు రుణాలు రావు. దీన్నే వ్యాపార వేదికగా ఎంచుకుంది గుర్గావ్‌కు చెందిన మైలోన్‌కేర్‌.ఇన్‌. దేశంలోని ప్రముఖ బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలతో ఒప్పందం చేసుకొని గృహ, బంగారు, వ్యాపార వంటి అన్ని రకాల రుణాలను అందిస్తుంది. మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ గౌరవ్‌ గుప్తా ‘స్టార్టప్‌ డైరీ’తో పంచుకున్నారు.
వడ్డీ రేట్లు 8.65 శాతం నుంచి...
‘‘ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్, బజాజ్‌ ఫిన్‌సర్వ్, మణప్పురం, టాటా క్యాపిటల్‌ వంటి 24 బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం. వడ్డీ రేట్లు లోన్‌ను బట్టి 8.65 శాతం నుంచి 13.50 శాతం వరకున్నాయి. గృహ, వ్యక్తిగత, బంగారు, ప్రాపర్టీ, వ్యాపారం వంటి అన్ని రకాల రుణాలతో పాటూ ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్స్‌ క్రెడిట్‌ కార్డులను కూడా అందిస్తాం. రూ.5 వేల నుంచి రూ.25 కోట్ల వరకు రుణాలుంటాయి. ప్రస్తుతం 25 లక్షల మంది కస్టమర్లున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 10 శాతం మంది ఉంటారు. 
ఈ ఏడాది రూ. 2500 కోట్ల రుణాల లక్ష్యం..
కస్టమర్లు మైలోన్‌కేర్‌లో లాగిన్‌ అయి కావాల్సిన రుణ విభాగాన్ని ఎంచుకొని వ్యక్తిగత వివరాలు, రుణ అవసరాలను తెలిపితే.. ఆల్గరిథం ద్వారా కస్టమర్లకు 2–3 రకాల బ్యాంక్‌ రుణ అప్షన్లను ఇస్తుంది. వడ్డీ రేటు, కాలపరిమితిని బట్టి కస్టమర్‌ తనకు కావాల్సింది ఎంచుకోవచ్చు. 2018–19 ఆర్ధిక సంవత్సరంలో రూ.1000 కోట్ల రుణాలను అందించాం. ఈ ఏడాది రూ.2500 కోట్ల రుణాలను అందించాలని లక్ష్యించాం. ప్రస్తుతం నెలకు లక్ష ఎంక్వైరీలు వస్తున్నాయి. రుణాన్ని బట్టి 0.5 నుంచి 3 శాతం వరకు కమీషన్, మార్కెటింగ్‌ ఫీజు ఉంటుంది. ప్రతి ఏటా 40 శాతం ఆదాయ వృద్ధిని సాధిస్తున్నాం. ఈ ఏడాది 150 శాతాన్ని లక్ష్యించాం. మా మొత్తం ఆదాయంలో 17 శాతం తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నదే.
ఎంఎఫ్, ట్యాక్స్‌ ప్లానింగ్‌లోకి..
ప్రస్తుతం మా కంపెనీలో 150 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. ఈ ఏడాది ముగింపు నాటికి ఈ సంఖ్యను రెట్టింపు చేస్తాం. సేల్స్, టెక్నాలజీ విభాగంలో ఉద్యోగులను నియమించుకుంటాం. ఇప్పటివరకు రెండు రౌండ్లలో కలిపి రూ.8 కోట్ల నిధులను సమీకరించాం. ఎన్‌క్యుబేట్‌ క్యాపిటల్‌ వెంచర్, ఎస్‌ఏఆర్‌ గ్రూప్‌ ఈ పెట్టుబడులు పెట్టాయి. ‘‘త్వరలోనే డిజిటల్‌ క్రెడిట్‌ కార్డ్‌లు, యాప్‌ ఆధారిత పర్సనల్‌ లోన్ల విభాగంలోకి ఎంట్రీ ఇవ్వనున్నాం. ఆ తర్వాత మ్యూచువల్‌ ఫండ్స్, ట్యాక్స్‌ ప్లానింగ్‌ విభాగాల్లోకి విస్తరిస్తామని’’ గౌరవ్‌ వివరించారు. 



You may be interested

చిక్కుల్లో టాటాస్టీల్‌-థిస్సెంక్రప్‌ విలీనం

Saturday 11th May 2019

ఈసీ ఆమోదం కష్టమేనన్న టాటాస్టీల్‌ ముంబై: టాటా స్టీల్‌ తన యూరోప్‌ కార్యకలాపాలను థిస్సెంక్రప్‌తో విలీనం చేయాలన్న ప్రతిపాదన చిక్కుల్లో పడినట్టు కంపెనీ శుక్రవారం ప్రకటించింది. యూరోపియన్‌ కమిషన్‌ ఆందోళనలను తగ్గించే విధంగా ప్యాకేజీపై మళ్లీ కృషి చేసే పరిస్థితి లేదని పేర్కొంది. నష్టాల్లో ఉన్న కోరస్‌ కార్యకలాపాలను టాటా స్టీల్‌, జర్మనీకి చెందిన థిస్సెంక్రప్‌తో విలీనం చేసి చెరిసగం వాటాలతో జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకు గతేడాది ఒప్పందం చేసుకున్నాయి. ఇందుకు

హైదరాబాద్‌లో జీఎంఆర్‌ బిజినెస్ పార్క్

Saturday 11th May 2019

రూ. 350 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌ ఆరు టవర్ల నిర్మాణం మరో రెండున్నరేళ్లలో అందుబాటులోకి హైదరాబాద్‌: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఉన్న మిగులు స్థలాన్ని ఆదాయ వనరుగా మార్చుకునే క్రమంలో ఏరోడ్రోమ్‌లో 'బిజినెస్ పార్క్‌' ఏర్పాటు చేయడంపై జీఎంఆర్ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (జీహెచ్ఐఏఎల్‌) కసరత్తు చేస్తోంది. దీనిపై సుమారు రూ. 350 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు జీఎ౾ంఆర్‌ స్థల అభివృద్ధి విభాగం సీఈవో అమన్ కపూర్‌ తెలిపారు. ఇందులో దాదాపు పది లక్షల

Most from this category