News


స్టాక్‌ మార్కెట్‌తో రాఖీ బంధన్‌కు పోలికేంటి?

Sunday 26th August 2018
sakshi-specials_main1535273039.png-19649

నిశితంగా పరిశీలిస్తే స్టాక్‌ మార్కెట్‌ సైతం రాఖీ పండుగలో ఉండే సెంటిమెంట్లనే ఫాలో అవుతుంది. దగ్గరగా చూస్తే స్టాక్‌ మార్కెట్లకు, రక్షా బంధన్‌కు చాలా పోలికలు కనిపిస్తాయి. నమ్మడం లేదా.. ఓకే.. వివరంగా చూద్దాం..
బంధం: సహోదర ప్రేమ రాఖీ పండుగలో కీలకాంశం. అన్నా చెల్లి అనుబంధం, ఇది తరతరాలకు సంబంధం.. లాంటి పాటలు రక్షాబంధన్‌లో సహోదరుల మధ్య బంధాన్ని గుర్తు చేసేవే! అదే స్టాక్‌మార్కెట్లో కూడా ఒక గాఢమైన బంధం ఉంటుంది. స్టాక్స్‌కు ఇన్వెస్టర్లకు మధ్య ఉండే బంధం చాలా ధృడమైనది. రాఖీ కట్టడం ద్వారా అన్న సుఖంగా ఉండాలని చెల్లి ఆశించినట్లే బలమైన స్టాకుల్లో పెట్టుబడుల ద్వారా లాభాలు పొందాలని ఇన్వెస్టర్‌ ఆశిస్తాడు.
శ్రద్ధ తీసుకోవడం: రాఖీ పండుగ అంటేనే తోడబుట్టినదాని సుఖ సంతోషాల పట్ల శ్రద్ధ వహించడం. స్టాక్‌మార్కెట్లో ఇన్వెస్టర్‌ తన పెట్టుబడులపై ఇదే తరహా శ్రద్ధ చూపుతాడు.
పర్యవేక్షణ: రాఖీ కట్టిన సహోదరి యోగక్షేమాలు ఎల్లప్పుడూ చూసుకుంటూఉంటానని సోదరుడు మాట ఇస్తాడు. బాధలు వస్తే తీర్చే యత్నం చేస్తాడు. అదేవిధంగా మార్కెట్లో ఇన్వెస్ట్‌ చేసిన ప్రతి మదుపుదారూ తన పోర్టుఫోలియోను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా పర్యవేక్షించుకుంటూ ఉంటాడు. నష్టం కలిగించే స్టాకులను వదిలించుకోవడం ద్వారా పెట్టుబడిని కాపాడుకుంటాడు.
రక్షణ: రక్షా బంధన్‌లోనే రక్షణ ఉంది. అదేవిధంగా రాబోయే ఆర్థిక సంక్షోభాలనుంచి కాపాడుకునేందుకు ఇన్వెస్టర్‌ స్టాక్‌మార్కెట్లో పెట్టుబడులు పెడతాడు. 



You may be interested

ఇండియాబుల్స్‌ కమర్షియల్‌ బాండ్లపై 9 శాతం వడ్డీ

Monday 27th August 2018

ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు చెందిన సబ్సిడరీ ఇండియాబుల్స్‌ కమర్షియల్‌ క్రెడిట్‌ మొదటిసారి రూ.2,000 కోట్ల సమీకరణకు బాండ్‌ మార్కెట్‌లోకి అడుగు పెడుతోంది. బాండ్ల జారీ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించాలన్నది కంపెనీ ప్రణాళిక. మూడు, ఐదు, పదేళ్ల కాల వ్యవధితో ఉండే ఈ బాండ్లపై 8.80-9.10 శాతం వరకు రాబడులను కంపెనీ ఆఫర్‌ చేయనుందని, త్వరలోనే ఈ ఇష్యూ ప్రజల ముందుకు రానుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు

ఈఎంఐ డిఫాల్టయితే ఇంతే సంగతులు

Saturday 25th August 2018

క్రెడిట్‌ స్కోర్‌పై భారీ నెగిటివ్‌ ప్రభావం లోన్‌, క్రెడిట్‌ తీసుకున్న కస్టమర్లు తప్పనిసరిగా తమ నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్లను క్రమం తప్పక చెల్లించాలని క్లియర్‌స్కోర్‌ సీఈఓ జస్టిన్‌ బాసిన్‌ సూచించారు. నెలవారీ పేమెంట్స్‌(ఈఎంఐ) మిస్‌ చేస్తే క్రెడిట్‌ స్కోర్‌పై భారీగా నెగిటివ్‌ ప్రభావం ఉంటుందన్నారు. క్రెడిట్‌ యుటిలైజేషన్‌ నిష్పత్తిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలని ఆయన సూచించారు. వేతనం పెరగకపోయినా, ఒకదాని వెంట మరో లోన్‌ తీసుకుంటూ పోతున్నా, క్రెడిట్‌ కార్డు లిమిట్‌లో ఎక్కువ భాగాన్ని

Most from this category