సాక్షి బిజినెస్ క్విజ్ - 18 - జీఎస్టీ
By Sakshi

1. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ)ని ప్రపంచంలోనే మొట్టమొదట ఏ దేశం అమలుచేసింది? 2. ఏ పన్ను జీఎస్టీ అమలు తర్వాత రద్దయ్యింది? 3. డ్యూయల్ జీఎస్టీ మోడల్ ఏ ప్రపంచ దేశాల్లో అమలులో ఉంది? 4. భారత్‌లో విధిస్తున్న జీఎస్టీ పన్ను రేటు ఏ ఏ శ్లాబ్‌ల్లో (శాతం) ఉంది? 5. భారత్‌లో జీఎస్టీ అమలైనప్పు వేటిని దీని పరిధిలోకి తీసుకురాలేదు? 6. జీఎస్టీ ఏ తరహా పన్ను? 7. క్రింది వాటితో ఏ దేశంలో జీఎస్టీ ఇంకా అమలు కాలేదు? 8. ఏ రాష్ట్రాలు జీఎస్టీ చట్టం ప్రకారం ప్రత్యేక స్టేటస్ పొందాయి? 9. జీఎస్టీకి సంబంధించిన అంశాలు, రేట్లు, శ్లాబ్, రిటర్ల్న్, రూల్స్ ఇతర వ్యవహారాలను ఎవరు నిర్దేశిస్తారు? 10. జీఎస్టీకి బీజం 1999లో ఆటల్ బిహారి వాజపేయి వేశారు. జీఎస్టీ కమిటీ స్థాపించి ఏ వ్యక్తిని ఆ కమిటీకి అధ్యక్షుడుగా వాజపేయి నియమించారు? 11. జీఎస్టీ బిల్లు కోసం ఏ రాజ్యాంగ సవరణ చట్టం చేసేరు? 12. జీఎస్టీ గురించి క్రింది వాటిలో ఏది సరైనది? సమాధానాలు: 1డి 2డి 3డి 4సి 5డి 6బి 7బి 8డి 9డి 10బి 11సి 12డి సునీల్ ధవళ
ఎ) ఆస్ట్రేలియా
బి) బ్రెజిల్
సి) కెనడా
డి) ఫ్రాన్స్
ఎ) సర్వీస్ టాక్స్
బి) సేల్స్ టాక్స్, వ్యాట్
సి) ఎక్సైజ్
డి) పైవన్నీ
ఎ) ఇండియా
బి) బ్రెజిల్
సి) కెనడా
డి) పైవన్నీ
ఎ) 5, 7, 10, 15, 18
బి) 5, 8, 12, 15, 20
సి) 0, 5, 12, 18, 28
డి) 0, 2, 5, 10, 18
ఎ) పెట్రోల్, డీజిల్
బి) మద్యం, వంట గ్యాస్
సి) విమాన ఇంధనం
డి) పైవన్నీ
ఎ) ప్రత్యక్ష పన్ను
బి) పరోక్ష పన్ను
సి) ప్రత్యక్ష , పరోక్ష పన్ను
డి) పైన పేర్కొన్నవేవీ కావు
ఎ) థాయిలాండ్
బి) అమెరికా సంయుక్త రాష్ట్రాలు
సి) సింగపూర్
డి) పైవన్నియు
ఎ) అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర
బి) జమ్మూ కాశ్మీర్
సి) అస్సాం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్
డి) పైవన్నీ
ఎ) కేంద్ర ఆర్థిక శాఖ
బి) కేంద్ర ఆర్థికమంత్రి, ప్రధానమంత్రి
సి) ఎ & బి
డి) జీఎస్టీ కౌన్సిల్
ఎ) ఎం.ఎం. మణి, కేరళ ఆర్థికమంత్రి
బి) ఆసీమ్ దాసుగుప్తా, పశ్చిమ బెంగాల్ ఆర్థికమంత్రి
సి) మాంటెక్ సింగ్ అహ్లువాలియా
డి) విజయ్ కేల్కర్
ఎ) 101 రాజ్యాంగ సవరణ యాక్ట్ 2016
బి) 122 రాజ్యాంగ సవరణ బిల్లు
సి) ఎ&బి
డి) బీజేపీ సర్కార్‌కు పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి సవరణ అవసరం లేదు
ఎ) చివరి పాయింట్‌పై పన్ను అనగా వస్తు, సేవల అమ్మకం సమయంలోనే విధించడం
బి) దేశంలో విధించిన అన్ని పరోక్ష పన్నులను తొలగించి దేశంమంతటా ఒకే పరోక్ష పన్ను ప్రవేశపెట్టినది
సి) జీఎస్టీకి భారతదేశంలో విధించిన అన్ని ప్రత్యక్ష పన్నులతో సంబంధం లేదు కావున ప్రత్యక్ష పన్నులు యథావిథిగా కొనసాగుతున్నాయి
డి) పైవన్నీ
సీఈఓ,ద థర్డ్ అంపైర్ మీడియా
ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్
You may be interested
రైతుల ఆదాయం, వృద్ధికి బలం
Sunday 8th July 2018న్యూఢిల్లీ: ఖరీప్ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్పీ) పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల ఆదాయం, వృద్ధికి పెరిగేందుకు తోడ్పడుతుందని అసోచామ్ అభిప్రాయపడింది. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో 14 ఖరీఫ్ పంటలకు 50 శాతం మేర మద్దతు ధరల్ని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం గత వారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వరి మద్దతు ధరను క్వింటాలుకు రూ.200 పెంచగా, ఒక్క దీనివల్లే ప్రభుత్వ ఖజానాపై రూ.15,000
అమెరికా మార్కెట్లకు ఉద్యోగ గణాంకాల జోష్..!
Saturday 7th July 2018రెండు వారాల గరిష్టం వద్ద ముగిసిన సూచీలు ముంబై:- జూన్ నెలలో ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదు కావడంతో శుక్రవారం రాత్రి అమెరికా మార్కెట్లు రెండు వారాల గరిష్టస్థాయిలో ముగిసాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా విధించిన 25శాతం టారీఫ్‌లు శుక్రవారం నుంచి అమల్లోకి రానుండంతో అందరి దృష్టి అమెరికా మార్కెట్లపై పడింది. అనూహ్యంగా జూన్ ఉద్యోగ గణాంకాలు అంచాలకు మించి నమోదుకావడంతో అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. దీంతో వాణిజ్యయుద్ధ