STOCKS

News


సాక్షి బిజినెస్‌ క్విజ్‌ - 17- ఆర్థిక సంస్కరణల పితామహుడి 97వ జన్మదిన వార్షికోత్సవం

Sunday 1st July 2018
sakshi-specials_main1530449310.png-17900

1. ఆటోమేటెడ్ కంప్యూటర్డ్, స్క్రీన్ ఆధారిత ఎలక్ట్రానిక్ ట్రేడింగ్ సిస్ట్‌మ్‌తో ఏ స్టాక్ ఎక్స్చేంజ్‌ని పీవీ నరసింహారావు ప్రభుత్వం ప్రారంభించింది?
ఎ) బాంబే స్టాక్ ఎక్స్చేంజ్
బి) నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్
సి) ఢిల్లీ స్టాక్ ఎక్స్చేంజ్
డి) పైవన్నీ

2. 1992లో స్థాపించిన ఎన్ఎస్ఈ తొలిగా ఏ చట్టం కింద ఉద్ఘటించారు?
ఎ) ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) యాక్ట్, 1952
బి) సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) యాక్ట్, 1956
సి) కంపెనీస్ యాక్ట్, 1956
డి) సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా యాక్ట్, 1992

3. పీవీ హయాంలో భారత్‌, ఇజ్రాయెల్ దేశాల మధ్య తొలిసారిగా 1992లో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం జరిగిన తర్వాత 200 మిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరిగింది. ఇది 2018 నాటికి ఎంతకు పెరిగింది?
ఎ) 8500 మిలియన్‌ డాలర్లు
బి) 50 బిలియన్‌ డాలర్లు
సి) 850 మిలియన్‌ డాలర్లు
డి) 5 బిలియన్‌ డాలర్లు

4. పీవీ నరసింహారావు సాధించిన విజయాలను, ప్రాముఖ్యత గుర్తిస్తూ.. ఆయన మైనపు విగ్రహాన్ని మేడమ్ తుస్సాడ్స్, లండన్లో ఆవిష్కరించారు. అయితే పీవీ కోర్టు కేసులు, అరోపణలు ఎదుర్కోవడంతో ఆయన విగ్రహం తీసివేసి ఎవరి విగ్రహాన్ని ఉంచారు? 
ఎ) అటల్ బిహారి వాజ్‌పేయి
బి) అమితాబ్ బచ్చన్ 
సి) మన్మోహన్ సింగ్
డి) రాజీవ్ గాంధీ

5. పీవీ పాలనలో 1995లో సార్క్ దేశాలతో ఏ ఒప్పందం జరిగింది? 
ఎ) ఎస్ఏపీటీఏ 
బి) ఎస్ఏఎఫ్‌టీఏ 
సి) మెకాంగ్ గంగ కోపరేషన్
డి) నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ 

6. భారత్‌కు మద్దతుగా అమెరికా కంపెనీలచే ఏ లాబీయింగ్ గ్రూపును ఏర్పాటు చేయడంలో పీవీ నరసింహారావు కీలక పాత్ర పోషించారు?
ఎ) ఇండియన్ ఇంటరెస్ట్ గ్రూప్ 
బి) అమెరికన్ బిజినెస్ అసోసియేషన్
సి) అమెరికన్ ఆంధ్రా బిజినెస్ ఫోరం 
డి) ది ఇండో అమెరికన్ ట్రేడ్ ఫోరం

7. ఏ అమెరికన్ వ్యాపార సంస్థలు పీవీ ప్రభుత్వ ఆర్ధిక సంస్కరణలను హర్షిస్తూ భారతదేశంతో వ్యాపారం కోసం లాబీయింగ్ గ్రూపులో పాల్గొన్నాయి?
ఎ) జీఈ, ఐబీఎం 
బి) ఫోర్డ్, ఏటీ&టీ 
సి) కోకా కోలా 
డి) పైవన్నీ 

8. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా పారిశ్రామిక రంగానికి చెందిన వ్యక్తికి, 'భారతరత్న' పురస్కారం పీవీ  నరసింహారావు ప్రభుత్వ హయాంలో లభించింది. ఎవరా పారిశ్రామికవేత్త?
ఎ) సి కె. బిర్లా 
బి) జంషెడ్జి టాటా
సి) జె ఆర్ డి. టాటా
డి) సుందరం అయ్యర్ 

9. తన ప్రభుత్వ ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్‌కు ముందు, పీవీ నరసింహారావు ఏ వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చారు? పీవీ మొదటి ఎంపిక ఎవరు?
ఎ) ప్రణబ్ ముఖర్జీ 
బి) చిదంబరం 
సి) ఎస్ బి చవాన్ 
డి) ఐజి పటేల్

10. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంకి, ప్రధానమంత్రిగా పీవీకి ముందు సోనియా గాంధీ మొట్టమొదటి ఎంపిక ఎవరు? ఏ వ్యక్తి తిరస్కరించగా సోనియా పీవీని సంప్రదించారు?
ఎ) శంకర్ దయాళ్ శర్మ
బి) మాధవ రావు సింధియా
సి) చంద్రశేఖర్
డి) అరుణ అసఫ్ అలీ

11. పీవీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టడానికి మూడు నెలల ముందు 1990-91 ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య లోటు,  కరెంట్ అకౌంట్ లోటు ఎంత?
ఎ) రూ. 17900 కోట్లు, రూ.9350 కోట్లు.
బి) రూ. 17350 కోట్లు, రూ.16900 కోట్లు.
సి) రూ. 2500 కోట్లు, రూ.1550 కోట్లు.
డి) రూ. 16,900 కోట్లు, రూ. 17,350 కోట్లు.

12. ఆటంకావాదులను, తీవ్రవాదం అరికట్టడానికి పివీ నరసింహారావు దిగువనీయబడిన ఏ చట్టం తీసుకొచ్చారు?
ఎ) పి ఓ టి ఎ (పోటా)
బి) స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (ఎస్ ఐ టి)
సి) ఆర్ ఎ దబ్యూ (రా)
డి) టి ఎ డి ఎ (టాడా)

13. 1985లో రాజీవ్ గాంధీ అప్పటి కేంద్ర ఏ మంత్రిత్వశాఖను రద్దు చేసి కొత్తగా ఏర్పరిచిన శాఖకు పీవీని తొలి మంత్రిని చేశారు?
ఎ) విద్యాశాఖని రద్దు చేసి మానవ వనరుల అభివృద్ధిశాఖకి
బి) పోస్టల్ శాఖని రద్దు చేసి టెలికం శాఖకి
సి) సరిహద్దుల శాఖని రద్దు చేసి విదేశీ మంత్రిత్వ శాఖకి
డి) పైవేవీయు కావు

14. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పీవీ కొత్త విద్యా విధానంలో భాగమే?
ఎ) జవహర్ నవొదయ సమితి స్కూళ్ల స్థాపన 
బి) ఢిల్లీ పబ్లిక్ స్కూళ్ల స్థాపన 
సి) కేంద్రీయ విద్యాలయాల స్థాపన 
డి) సైనిక స్కూళ్ల స్థాపన 

15. పీవీ ఉమ్మడి అంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా చేసి 1971-73లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కడ గురుకుల స్కూల్ ప్రారంభించారు?
ఎ) తెలంగాణలో సంస్థాన్ నారాయణపూర్‌లో
బి) గుంటూరు దగ్గర తాడికొండలో
సి) రాయలసీమలో అనంతపూరం వద్ద
డి) పైవన్నీ

16. పీవీ ఉమ్మడి అంద్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దిగువ ఏ చట్టాన్ని చేసి సోసైటీ ప్రారంభించారు?
ఎ) ఆంధ్రా గురుకుల్ సొసైటీ
బి) ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ సోసైటీ
సి) ఆంధ్రా ఎడ్యుకేషన్ సొసైటీ
డి) ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫర్ గర్ల్ చైల్డ్ సొసైటీ


సమాధానాలు: 1బి  2సి  3డి  4బి 5బి 6ఎ  7డి  8సి 9డి 10ఎ 11డి 12డి 13ఎ  14ఎ 15డి 16బి

సునీల్ ధవళ
సీఈఓ,ద థర్డ్ అంపైర్ మీడియా
ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్

 సాక్షి బిజినెస్‌ క్విజ్‌ - 16 

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్ 15

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 14

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 13

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 12

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 11

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 10

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 9

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 8

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 7

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 6

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 5

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 4

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 3

♦ సాక్షి బిజినెస్‌ క్విజ్‌ 2You may be interested

ఇవి కొనొచ్చు

Sunday 1st July 2018

కెపాసిట్స్‌ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ : కొనొచ్చు, టార్గెట్‌ ధర : 397,  ప్రస్తుత ధర : 270, బ్రోకరేజి సంస్థ : ఎడల్‌వీస్‌ ఈపీసీ స్టాక్స్‌లో తలెత్తిన ఇబ్బందిని సమర్థంగా తట్టుకున్న కెపాసిట్స్‌ ఇన్‌ఫ్రా ఫండమెంటల్స్‌ మరింత పటిష్టమయ్యే సంకేతాలు అందుతున్నాయి. ఇది ప్రభుత్వరంగాల్లోకి అడుగుపెట్టడమే కాదు పాత ఖాతాదారుల నుంచి కూడా మళ్లీ ఆర్డర్లు సంపాదిస్తోంది. ఆర్డర్లు ఏకంగా ఐదురెట్లు పెరగడంతో కంపెనీకి ఎదురులేదని చెప్పవచ్చు. రాబడికి అద్భుత అవకాశాలు, పటిష్ట

ఈ రెండు మిడ్‌క్యాప్స్‌ను మిస్‌ కావొద్దు...

Sunday 1st July 2018

మార్కెట్‌ క్షీణిస్తున్నా కొన్ని మిడ్‌క్యాప్స్‌ షేర్లను కొనవచ్చని ఏంజెల్‌ బ్రోకింగ్‌ ఫండ్‌ మేనేజర్‌ మయూరేశ్‌ జోషి అంటున్నారు. ఒక జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను చర్చించారు.  హెచ్‌డీఎఫ్‌సీ మినహా మిగతా బ్యాంకు షేర్లకు దూరం ఉండటమే మంచిదంటారా ? ఈ రంగాన్ని రిటైల్‌ ప్రైవేటు బ్యాంకులు, కార్పొరేట్‌ ఫైనాన్స్‌ బ్యాంకులు, పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులుగా విభజిస్తే వీటిలో పీఎస్‌యూ బ్యాంకుల పనితీరు బాగాలేదని అర్థమవుతుంది. మొండిబకాయిలు, రుణాల జారీ,

Most from this category