STOCKS

News


ఇంటి ఎంపికలో గృహిణిదే ఆధిపత్యం

Saturday 22nd December 2018
personal-finance_main1545451849.png-23164

సాక్షి, హైదరాబాద్‌: సొంతింటి ఎంపికలో మగవాళ్ల కంటే మహిళలదే పై చేయి. సొంతిల్లు కొనుగోలు నిర్ణయం నుంచి ప్రాంతం, బడ్జెట్‌ ఎంపిక వరకూ అన్నింట్లోనూ గృహిణి నిర్ణయాధికారమే ఆధిపత్యంగా ఉందని జేఎస్‌డబ్ల్యూ సిమెంట్‌ కన్జ్యూమర్‌ రీసెర్చ్‌ సర్వే తెలిపింది. గృహ నిర్మాణానికి సంబంధించి కొనుగోలుదారులు అభిప్రాయం, ఎంపికలపై సర్వే నిర్వహించింది. 
 జాయింట్‌ ఫ్యామిలీ బదులు సొంతంగా ఉండేందుకే మహిళలు ఆసక్తి చూపిస్తున్నారని ఈ సర్వే తెలిపింది. సొంతింటి ఎంపిక విషయంలో మగవాళ్లు స్నేహితులు లేదా బంధుమిత్రుల నిర్ణయాలనే పాటిస్తున్నారు. ఏ ప్రాంతంలో ఇల్లు కొనాలి? నిర్మాణ తీరుతెన్నుల గురించి భార్య కంటే ఎక్కువగా ఫ్రెండ్స్‌ సలహాలే పాటిస్తారని సర్వే తెలిపింది. 
 స్టీల్, సిమెంట్, కాంక్రీట్, బ్రిక్స్, ఎలక్ట్రిక్‌ వైర్లు, శానిటేషన్‌ ఉత్పత్తులు వంటి గృహ నిర్మాణ సామగ్రి నాణ్యత, ఎంపికలపై కొనుగోలుదారులకు పూర్తి స్థాయి అవగాహన లేదని.. అందుకే నిర్మాణంలో నాణ్యతాలోపం స్పష్టంగా కనిపిస్తుందని సర్వే వెల్లడించింది.
 



You may be interested

సోమవారం నిఫ్టీ ఓపెనింగ్‌ ఎలా ఉండొచ్చు?

Saturday 22nd December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి నష్టాల్లో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 5 పాయింట్ల నష్టంతో 10,755 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,767 పాయింట్లతో పోలిస్తే 12 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ సోమవారం ఫ్లాట్‌గా లేదా నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు

నివాస భవనాలకూ ఈసీబీసీ

Saturday 22nd December 2018

సాక్షి, హైదరాబాద్‌: నివాస భవనాలకు ఎనర్జీ కన్సర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఈసీబీసీ) నిబంధన అమల్లోకి వచ్చింది. గృహ విభాగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది జూన్‌లో వాణిజ్య భవనాలకు ఈసీబీసీ కోడ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నివాస విభాగంలో ఈసీబీసీ కోడ్‌తో 2030 నాటికి 125 బిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ శక్తి ఆదా అవుతుందని కేంద్రం

Most from this category