STOCKS

News


రెరాలో నమోదు కాకపోతే?

Saturday 29th September 2018
personal-finance_main1538202363.png-20708

సాక్షి, హైదరాబాద్‌: 
తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ప్రారంభమైన నెల రోజులైంది. 2017, జనవరి 1 తర్వాత 5 వేల ప్రాజెక్ట్‌లు అనుమతి పొందితే.. రెరాలో నమోదైన ప్రాజెక్ట్‌లు మాత్రం జస్ట్‌ 17. నవంబర్‌ 30వ తేదీలోపు ఆయా ప్రాజెక్ట్‌లు రిజిస్ట్రేషన్‌ చేసుకోకపోతే ప్రాజెక్ట్‌ వ్యయంలో 10 శాతం జరిమానా తప్పదు.
5 వేల ప్రాజెక్ట్‌లు రెరా పరిధిలోకి..
2017 జనవరి 1 తేదీ తర్వాత హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, పంచాయతీలు, డీటీసీపీ, టీఎస్‌ఐఐసీల నుంచి అనుమతి పొందిన ప్రతి ఒక్క నివాస, వాణిజ్య సముదాయాలు రెరాలో నమోదు చేసుకోవాలి. ఆయా విభాగాల నుంచి 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్లుంటే ప్రతి ప్రాజెక్ట్‌ రెరా పరిధిలోకి వస్తుంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. తెలంగాణలో జనవరి 1, 2017 తర్వాత జీహెచ్‌ఎంసీ నుంచి 2,985 ప్రాజెక్ట్‌లు, హెచ్‌ఎండీఏ 840 ప్రాజెక్ట్‌లు, డీటీసీపీ నుంచి 1,122 ప్రాజెక్ట్‌లను అనుమతులు పొందాయి. ఈ ప్రాజెక్ట్‌లన్నీ రెరాలో నమోదు చేసుకోవాల్సిందే.
3 దశల్లో రెరా రిజిస్ట్రేషన్‌..
ఇప్పటివరకు టీఎస్‌ రెరాలో 450 మంది డెవలపర్లు, 17 ప్రాజెక్ట్‌ల వివరాలు మాత్రమే నమోదయ్యాయి. రెరాలో నమోదు ప్రక్రియ మూ దశల్లో ఉంటుంది. తొలి దశలో నిర్మాణ సంస్థ ప్రమోటర్లు, డెవలపర్లు, ఏజెంట్లు నామమాత్రపు రుసుము చెల్లించి రెరాలో రిజిస్టర్‌ చేసుకోవాలి. రెండో దశలో ప్రాజెక్ట్‌ వివరాలను, డాక్యుమెంట్లను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెరా అధికారులు పర్యవేక్షణ, స్క్రూటినీ వంటివి నిర్వహించి.. అన్నీ సవ్యంగా ఉన్నాయని తేలితే చివరి దశలో రెరా నమోదు పత్రాన్ని అందిజేస్తారు.
నమోదు రుసుములు..
ఒకసారి రిజిస్ట్రేషన్‌కు డెవలపర్లకైతే రూ.750, ఏజెంట్లకైతే రూ.500 ఉంటుంది. ప్రాజెక్ట్‌ను రిజిస్ట్రేషన్‌ చేశాక.. ప్రతి మూడు నెలలకొకసారి అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ ధరలివే..
 వెయ్యి చ.మీ. వరకుండే గ్రూప్‌ హౌజింగ్‌కు చ.మీ.కు రూ.5, అంతకంటే ఎక్కువైతే చ.మీ. రూ.10. గరిష్ట మొత్తం రూ.5 లక్షలు.
 రెసిడెన్షియల్‌ కమ్‌ కమర్షియల్‌ ప్రాజెక్ట్‌కు గరిష్ట మొత్తం రూ.7 లక్షలు.
 వెయ్యి చ.మీ. లోపుండే కమర్షియల్‌ ప్రాజెక్ట్‌కు చ.మీ.కు రూ.20, అంతకంటే ఎక్కువైతే చ.మీ.కు రూ.25. గరిష్ట మొత్తం రూ.10 లక్షలు.
 ఓపెన్‌ ప్లాట్లకు చ.మీ.కు రూ.5. గరిష్ట మొత్తం రూ.2 లక్షలు.
నమోదు చేయకుండా విక్రయిస్తే..
రెరాలో నమోదు చేయకుండా ఫ్లాట్, ప్లాట్‌ ఏదైనా సరే అడ్వటైజింగ్‌ చేయడం గానీ విక్రయించడం గానీ చేయకూడదు. కానీ, తెలంగాణలో రెరా అమల్లోకి వచ్చి నెల రోజులు గడిస్తున్నా.. నేటికీ రెరాలో నమోదు చేయకుండా డెవలపర్లు యధేచ్చగా ప్రకటనలు, ఆఫర్లూ ప్రకటిస్తున్నారని.. విక్రయాలూ జరుపుతున్నారని టీఎస్‌ రెరా అధికారి ఒకరు తెలిపారు. రెరాలో రిజిస్ట్రేషన్‌ చేయకుండా విక్రయించిన పక్షంలో ప్రాజెక్ట్‌ వ్యయంలో 10 శాతం జరిమానా, మూడేళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది.
 You may be interested

రెరాతో కార్మికుల కొరత!

Saturday 29th September 2018

 సాక్షి, హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)తో స్థిరాస్తి రంగానికి జరిగే ప్రయోజనం సంగతి కాసేపు పక్కన పెడితే.. కార్మికుల కొరత మాత్రం తీవ్రంగా ఉంది. నిర్మాణంలో నాణ్యత అనేది రెరాలో ప్రధానమైన అంశం. ఇందుకోసం నాణ్యమైన నిర్మాణ సామగ్రితో పాటూ నైపుణ్యమున్న లేబర్స్‌ అవసరమే. కార్మికుల కొరత కారణంగా పెద్ద ప్రాజెక్ట్‌లకు సమస్య అవుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పెరుగుతున్న నిర్మాణ గడువు.. నగరంలో చాలా మంది డెవలపర్లు రెరాలోని ఐదేళ్ల

వైద్యులు... ఇక్కడ విద్యార్థులు!!

Saturday 29th September 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ‘నిరంతర విద్యార్థి’.. ఇది వైద్యులకు పక్కాగా వర్తిస్తుంది. ఎందుకంటే? వైద్య రంగంలో వస్తున్న మార్పులు, అధునాతన శస్త్ర చికిత్స విధానాలు, మెడికల్‌ టెక్నాలజీ, వ్యాధులు, చికిత్స మార్గాలు వంటివి నేర్చుకుంటూ ఉండాలి. మరి డాక్టర్లు వృత్తిని వదిలి.. పుస్తకాలు పట్టుకొని రోజూ శిక్షణ తరగతులకు వెళ్లాలా? అవసరమే లేదంటోంది బెంగళూరుకు చెందిన మెడినిట్‌. జస్ట్‌! వైద్యులు మెడినిట్‌లో నమోదైతే చాలు.. ప్రపంచంలోని ప్రముఖ డాక్టర్లు, వైద్య వర్సిటీలు,

Most from this category