STOCKS

News


శ్రీశైలం రహదారిలో బూమ్‌ ఖాయమని పదిహేనేళ్ల క్రితమే ఊహించాం!

Saturday 13th October 2018
personal-finance_main1539411055.png-21125

సాక్షి, హైదరాబాద్‌:

నివాస సముదాయం, ఓపెన్‌ ప్లాట్‌! ఏదైనా సరే ప్రాజెక్ట్‌ ప్రారంభించాలంటే? ఏ నిర్మాణ సంస్థ అయినా సరే చూసేది.. కాస్తా కూస్తో అభివృద్ధి చెందాలి. మౌలిక వసతుల ఏర్పాట్లతో అమ్మకాలకు ఇబ్బంది ఉండదని భావిస్తేనే!
కానీ, రాళ్లు రప్పలతో కూడిన నిర్మానుష్య ప్రాంతాన్ని 3,600 ఎకరాల భారీ ప్రాజెక్ట్‌కు ఎంపిక చేసింది ఫార్చ్యూన్‌ బటర్‌ఫ్లై సిటి. అదీ పదిహేనేళ్ల క్రితం శ్రీశైలం రహదారిలోని కడ్తాల్‌లో. కారణం.. భవిష్యత్తు అభివృద్ధిని ముందుగానే ఊహించాం కాబట్టి అంటున్నారు ఫార్చ్యూన్‌ బటర్‌ఫ్లై సిటీ సీఎండీ బీ శేషగిరి రావు. హైదరాబాద్‌ చుట్టూ ఉన్న జాతీయ రహదారుల్లో అత్యంత డిమాండ్, అభివృద్ధి అవకాశాలున్న ప్రాంతంగా శ్రీశైలం రహదారి నిలవటమే ఇందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ఫార్మా సిటీ రాకతో భవిష్యత్తులో రెట్టింపు వృద్ధి ఖాయమని చెబుతున్నారు. 
– దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయంలోనే ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో ఐటీ క్లస్టర్‌ ఏర్పాటు ప్రతిపాదించారు. 700 ఎకరాల్లో సుమారు 30 వేల మంది ఉద్యోగ అవకాశాలు కల్పించే భారీ ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు చేశారు. దీంతో ఈ ప్రాంతంలో ఫార్చ్యూన్‌ బటర్‌ఫ్లై సిటీకి శ్రీకారం చుట్టాం. కానీ, తర్వాత ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు, ప్రభుత్వం మారడం వంటి వాటితో ఈ ప్రాంతంలో ఐటీ క్లస్టర్‌ బదులు ఫార్మా సిటీ ఖరారయింది. 19 వేల ఎకరాల్లో రానున్న ముచ్చర్ల ఫార్మా సిటీ మా ప్రాజెక్ట్‌కు 5 కి.మీ. దూరంలో ఉంటుంది. ప్రాజెక్ట్‌ను ప్రారంభించిన కొత్తలో రూ.1,500లుగా ఉన్న గజం ధర ఇప్పుడు రూ.6 వేలను దాటింది. ఇది చాలదూ ప్రాజెక్ట్‌ ప్రాంత అభివృద్ధి గురించి చెప్పడానికి!
డిసెంబర్‌ నాటికి బటర్‌ఫ్లై సిటీ పూర్తి..
కడ్తాల్, దాసర్లపల్లి గ్రామాల్లో 3,600 ఎకరాల్లో ఫార్చ్యూన్‌ బటర్‌ సిటీ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. ఇందులో 150 ఎకరాల్లో 500 ప్రీమియం విల్లాలుంటాయి. మిగిలిన వాటిల్లో ఓపెన్‌ ప్లాట్లుంటాయి. ఇప్పటికే 2,500 ఎకరాల్లో అభివృద్ధి పూర్తయింది. ఈ డిసెంబర్‌ నాటికి ప్రాజెక్ట్‌ మొత్తం తుది దశకు చేరుతుంది. ఇందులో 200 గజాలు, 500 గజాల్లో ప్లాట్లున్నాయి. ధర గజానికి రూ.3,500 నుంచి రూ.7,500 వరకున్నాయి.
స్కూల్, ఆసుపత్రి కూడా ఇందులోనే..
ఈ ప్రాజెక్ట్‌లో 5 ఎకరాల్లో సీబీఎస్‌ఈ స్కూల్‌ కూడా ఉంది. సుమారు 1,500 మంది విద్యార్థులుంటారు. +2 వరకు విద్య ఉంటుంది. వచ్చే డిసెంబర్‌ నాటికి 5 ఎకరాల్లో కార్పొరేట్‌ ఆసుపత్రిని కూడా ప్రారంభవుతుంది. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్స్, షాపింగ్‌ మాల్, స్పోర్ట్స్‌ అకాడమీలను కూడా నిర్మిస్తాం. 30 వేల చ.అ.ల్లో క్లబ్‌ హౌస్, చిల్డ్రన్స్‌ పార్క్స్‌ ఉన్నాయి. 40 ఫీట్ల రోడ్లు, భూగర్భంలోనే డ్రైనేజీ, విద్యుత్, మురుగు నీటి వ్యవస్థలుంటాయి. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుంటాయి. ఐటీ ఉద్యోగులు, స్థానిక వ్యాపారస్తులు, మధ్య స్థాయి కుటుంబీకులు మా కస్టమర్లుగా ఉన్నారు. గత నెలలో 300 ప్లాట్లు విక్రయించాం. దసరా నాటికి 500లకు చేరుకోవాలని లక్ష్యించాం.
ఆరోగ్యం, సందప రెండూ ఒకే చోట..
కొనుగోలుదారులకు ఆరోగ్యం, సంపద లక్ష్యించే ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నాం. మానవ జన్మ ఎత్తిన ఎవరైనా సరే కోరుకునేది సంతోషం.  అది ఆరోగ్యం, సంపద ద్వారా సిద్ధిస్తుంది. మొదటి విషయానికొస్తే.. ఆరోగ్యం! అంటే చుట్టూ ఉండే పర్యావరణం బాగుండాలి. అందుకే ఈ ప్రాజెక్ట్‌లో పార్క్‌లు, అవెన్యూ ప్లాంటేషన్, ల్యాండ్‌ స్కేపింగ్‌ వంటివి ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం ప్రాజెక్ట్‌లోని నివాసితులు కాలుష్య రహిత ప్రాంతంలో రణగొణ ధ్వనులకు దూరంగా పచ్చని ప్రకృతిలో ఆరోగ్యంగా ఉంటారు. ఇక, రెండోది.. సంపద! మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉంటే ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. దీంతో మంచి పనులు చేస్తుంటారు. దీంతో సంపద వృద్ధి చేరుతుంది. ఇదీ క్లుప్లంగా ఫార్చ్యూన్‌ బటర్‌ఫ్లై సిటీ లక్ష్యం.
======================
ఫార్మా సిటీ చుట్టూ అభివృద్ధి ఖాయం..
ఐటీ తర్వాత అధిక శాతం మందికి ఉపాధి కల్పించేది ఫార్మా రంగమే. తెలంగాణ ప్రభుత్వం ముచ్చర్లలో 19 వేల ఎకరాల్లో ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే శ్రీశైలం ర హదారిలో ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్‌ పార్క్‌లున్నాయి. కొత్తగా ఫార్మా సిటీ రాకతో శ్రీశైలం రహదారి రూపురేఖలు మారిపోవటం ఖాయం. ఐడీఏ బొల్లారం, పాశమైలారం తదితర ప్రాంతాల్లోని ఫార్మా పరిశ్రమలతో అభివృద్ధి మియాపూర్, మదీనాగూడ, చందానగర్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి వరకూ విస్తరించింది. గతంలో బేగంపేట్‌లో విమానాశ్రయం ఉన్నప్పుడూ అంతే రియల్‌ వృద్ధి సనత్‌నగర్, బోయిన్‌పల్లి ప్రాంతాలను దాటేసింది. ఇప్పుడు ఫార్మా సిటీతోనూ సేమ్‌ సీన్‌ అభివృద్ధి రెట్టింపు అవుతుంది. పైగా శంషాబాద్‌ విమానాశ్రయం శ్రీశైలం రహదారికి చేరువలో ఉండటం కలిసొచ్చే అంశం. అంతేకాకుండా ఫార్మాసిటీని అనుసంధానిస్తూ రీజినల్‌ రింగ్‌ రోడ్డు కూడా రానుంది. ఎయిర్‌పోర్ట్‌కు విస్తరించనున్న మెట్రో రైల్‌ను భవిష్యత్తులో ఫార్మా సిటీకి అనుసంధానిస్తారు కూడా.
– శ్రీశైలం రహదారిలో మన్‌సాన్‌పల్లి జంక్షన్, నాగారం, కందుకూరు, కడ్తాల్, ఆమన్‌గల్, తలకొండపల్లి, కల్వకుర్తి ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతోంది. ఆయా ప్రాంతంలో ధర గజానికి రూ.5 వేల నుంచి 8 వేల వరకున్నాయి. విల్లాల ధరలు రూ.కోటి పైమాటే. 2 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ల ధరలు రూ.30 లక్షల నుంచి ఉన్నాయి. ప్రధాన నగరంలో లేదా ఐటీ కేంద్రాలకు చేరువలో 2 బీహెచ్‌కే ఫ్లాట్‌కు వెచ్చించే వ్యయంతో శ్రీశైలం రహదారిలో ఏకంగా విల్లానే సొంతం చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 You may be interested

పండగ వేళ గృహ శోభ!

Saturday 13th October 2018

సాక్షి, హైదరాబాద్‌:  పండగ సీజన్‌ వస్తే చాలు కొత్త బట్టలు, బైక్, కారు ఎలాగో కొత్త ఇల్లు కొనుక్కోవాలనుకోవటం సహజం. అందుకే డెవలపర్లు కూడా కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ఆఫర్లు, రాయితీలను ప్రకటిస్తుంటారు.  2 నెలల్లో 30,400 గృహాలు.. సాధారణ సమయాల్లో కంటే పండగ సీజన్లలోనే కొత్త నివాస సముదాయాలు, ఓపెన్‌ ప్లాట్‌ వెంచర్లు ఎక్కువగా ప్రారంభమవుతుంటాయి కూడా. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అంటే హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఎన్‌సీఆర్, కోల్‌కతా, చెన్నై

రుణం ఇవ్వొచ్చు.. తీసుకోవచ్చు!

Saturday 13th October 2018

సాక్షి, హైదరాబాద్‌: ‘‘శ్రీనివాస్‌ ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగి. నెలాఖర్లో వాళ్ల అమ్మాయి మొదటి పుట్టిన రోజొచ్చింది. పార్టీ ఏర్పాట్లకు చేతిలో డబ్బు లేదు. తెలిసిన వాళ్లని అప్పు అడగటానికి మనసొప్పలేదు. పోనీ, బ్యాంక్‌ లోన్‌ కోసం వెళదామా అంటే... అదో పెద్ద ప్రక్రియ. సిబిల్‌ స్కోరు... వగైరాలు చూసి మంజూరు చేయటానికి బోలెడంత సమయం పట్టేస్తుంది. మరేం చేయాలి?’’ ‘‘వెంకటేశ్‌ ఓ ప్రభుత్వ ఉద్యోగి. కొంత కాలం నుంచి పొదుపు

Most from this category