STOCKS

News


టీ–రెరా గడువు పొడిగింపు

Saturday 8th December 2018
personal-finance_main1544241874.png-22759

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా)లో ప్రాజెక్ట్‌లు, డెవలపర్లు, ఏజెంట్ల నమోదు గడువును పొడిగించారు. రూ.లక్ష జరిమానాతో ఈనెల 15 వరకూ రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చని టీ–రెరా అధికారి ఒకరు తెలిపారు. 15 వరకు కూడా నమోదు చేసుకోని పక్షంలో జరిమానాను మరింత పెంచుతామని.. ఆ తర్వాత ఏకంగా ప్రాపర్టీలను సీజ్‌ చేస్తామని చెప్పారు. వాస్తవానికి టీ–రెరాలో రిజిస్ట్రేషన్‌ గడువు నవంబర్‌ 30తో ముగిసింది. డిసెంబర్‌ 1 నుంచి 7 వరకు రూ.50 వేల జరిమానాతో రిజిస్ట్రేషన్‌కు అవకాశమిచ్చారు.
2017, జనవరి 1 నుంచి ఆగస్టు 31 మధ్య కాలంలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, యూడీఏ, టీఎస్‌ఐఐసీ, మున్సిపాలిటీ, పంచాయతీల నుంచి అనుమతి పొందిన ప్రాజెక్ట్‌లు టీ–రెరాలో పరిధిలోకి వస్తాయి. 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్ల కంటే ఎక్కువుండే ప్రతి ప్రాజెక్ట్‌ టీ–రెరాలో నమోదు చేసుకోవాల్సిందే. ఆగస్టు 31 తర్వాత అనుమతి తీసుకున్న ప్రాజెక్ట్‌లు మాత్రం జరిమానా లేకుండానే టీ–రెరాలో నమోదు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
– ప్రభుత్వ గణాంకాల ప్రకారం గతేడాది జనవరి 1 తర్వాత ఆయా విభాగాల నుంచి సుమారు 5 వేల ప్రాజెక్ట్‌లను అనుమతి పొందాయి. కానీ, ఇప్పటివరకు టీ–రెరాలో 2,500 మంది ప్రమోటర్లు, ఏజెంట్లు, సుమారు 1,200 ప్రాజెక్ట్‌లను నమోదయ్యాయి.



You may be interested

చిన్న ఫ్లాట్లకే ఆదరణ

Saturday 8th December 2018

సాక్షి, హైదరాబాద్‌: రెరా, జీఎస్‌టీ, ఎన్నికల వాతావరణం.. ఇవేవీ కావు ఫ్లాట్ల అమ్మకాలు జరగట్లేదని చెప్పడానికి! సరైన ప్రాంతంలో చిన్న సైజు ఫ్లాట్లను కడితే ప్రతికూల పరిస్థితుల్లోనూ విక్రయాలు జరుగుతాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. కొనుగోలుదారుల ఆర్థిక సామర్థ్యాన్ని అంచనా వేసి, చిన్న ఫ్లాట్లను కడితే.. గిరాకీకి ఢోకా ఉండదు. హైదరాబాద్‌ స్థిరాస్తి రంగం ఎక్కువగా ఆధారపడేది ఐటీ ఉద్యోగుల మీదనే. కానీ, నగరంలోని ఐటీ కంపెనీల్లో పనిచేసే 70 శాతం

ఇంగ్లీష్‌, మ్యాథ్స్‌.. చాలా ఈజీ!

Saturday 8th December 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: విద్యా రంగంలో స్టార్టప్స్‌ అంటే? స్కూల్‌ సిలబస్‌ను స్మార్ట్‌ఫోన్లలోకి తీసుకొచ్చినవి.. ఆన్‌లైన్‌లో ఫీజులు, పాఠశాల నిర్వహణ చేసేవి.. లంచ్‌ బాక్స్‌లు అందించేవి..., స్కూల్‌ బిల్డింగ్స్‌ నిర్మాణం కోసం రుణాలిచ్చేవి... ఇలా చాలా ఉన్నాయి. కానీ, దేశంలో తొలిసారిగా వ్యక్తిగత విద్యార్థుల అభ్యసన ప్రక్రియలను అందుబాటులోకి తెచ్చింది మాత్రం హైదరాబాద్‌కు చెందిన ‘360 లెర్నింగే!’. అందులోనూ ఇంగ్లీష్, గణితం వంటి కీలక సబ్జెక్ట్స్‌ వర్క్‌షీట్స్‌ను కూడా అభివృద్ధి

Most from this category