టెకీ నిర్మాణాలొచ్చేశాయ్!
By Sakshi

సాక్షి, హైదరాబాద్: పునాది, శ్లాబ్, గోడలు, రంగులు, అలంకరణ సామగ్రి.. సంప్రదాయ పద్ధతిలో ఇంటి నిర్మాణమంటే ఇదే! కానీ, నిర్మాణ రంగంలో టెక్నాలజీ ఎంట్రీ అయ్యాక.. పునాదుల నుంచి నిర్మాణ పూర్తయ్యే వరకూ ప్రతి దశలోనూ సాంకేతికత చేరింది. వేగం, నాణ్యతతో పాటూ నిర్మాణ వ్యర్థాల విడుదల, వ్యయం, కార్మికుల వినియోగం తగ్గింపే టెక్నాలజీ వినియోగం ప్రధాన ఎజెండా.
ప్రస్తుతం దేశీయ రియల్టీ రంగంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతుంది. వినూత్న డిజైన్స్, నిర్మాణ సామగ్రి ఎంపికలో స్థిరత్వం, ఖచ్చితత్వం, ఆన్లైన్ మార్కెటింగ్, నిర్మాణ వ్యర్థాల విడుదల, కార్మికుల వినియోగం, నిర్మాణ వ్యయం తగ్గుదల.. వంటి వాటి కోసం ఆధునిక సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. రియల్టీ మార్కెట్లో త్రీడీ ప్రింటింగ్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడ్లింగ్ (బీఐఎం), వర్చువల్/ ఆగ్యుమేటెడ్ రియాలిటీ (వీఆర్), డ్రోన్స్, రోబో టెక్నాలజీలు వంటివి కీలకంగా మారాయి.
త్రీడీతో 45 రోజుల్లో రెండస్తుల భవనం..
ప్రస్తుతం దేశీయ రియల్టీ పరిశ్రమలో త్రీడీ ప్రింటింగ్ పునాదుల దశలోనే ఉందని.. దశాబ్ధ కాలంలో ఇది భవనం స్థాయికి విస్తరిస్తుందని నిపుణులు చెబుతున్నారు. త్రీడీ టెక్నాలజీతో నిర్మాణ వ్యర్థాల విడుదల, కార్మికుల వినియోగం, నిర్మాణ వ్యయం తగ్గుతుంది. పెద్ద నిర్మాణ యంత్రాలను ఏర్పాటు చేసే వీలులేని ప్రాంతాల్లో త్రీడీ ప్రింటింగ్ ద్వారా సులువుగా నిర్మాణాలను చేపట్టవచ్చు. గోడలు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్ వ్యవస్థ వంటి వాటిల్లోనూ త్రీడీ ప్రింటింగ్‌ను వినియోగించుకునే వీలుంటుంది. అయితే ప్రస్తుతం త్రీడీ ప్రింటింగ్ యంత్రాలు చిన్న భవనాలకు మాత్రమే పరిమితమయ్యాయి. బహుళ అంతస్తులు, పెద్ద పెద్ద కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ నిర్మాణ త్రీడీ యంత్రాల అవసరముంది. నివాస, వాణిజ్య, రిటైల్ విభాగంలో త్రీడీ ప్రింటింగ్ విస్తరించే అవకాశముంది.
45 రోజుల్లో రెండతస్తుల భవనం..
త్రీడీ టెక్నాలజీ వినియోగం కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. నిర్మాణ రంగ త్రీడీ ప్రింటింగ్ యంత్రాల ధర సుమారు 2 లక్షల డాలర్లు. అంటే మన కరెన్సీలో రూ.14.73 కోట్లు. ప్రస్తుతం త్రీడీ ప్రింటింగ్ యంత్రాల నిర్మాణ సామర్థ్యం 33 అడుగులు (10 మీటర్లు) ఎత్తు, గంటకు 250 కిలోల కంటే తక్కువ. ఇటీవలే బీజింగ్‌లో జస్ట్ 45 రోజుల్లోనే రెండతస్తుల భవనాన్ని త్రీడీ ప్రింటింగ్‌తో నిర్మించారు.
ఎన్ఎంఆర్సీ నిర్మాణం బీఐఎంతోనే..
త్రీడీ మోకప్స్, నిర్మాణ నమూనా డిజైన్ల అభివృద్ధి కోసం బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడ్లింగ్ (బీఐఎం) టెక్నాలజీని వినియోగిస్తుంటారు. కొన్ని నిర్మాణ సంస్థలు బీఎంఐ మీద కార్మికులకు అవగాహన కల్పించేందుకు శిక్షణ శిబిరాలను, నిపుణుల నియమించుకుంటున్నాయి. నాగ్‌పూర్ మెట్రో రైల్ కార్పొరేషన్ (ఎన్ఎంఆర్సీ) ప్రాజెక్ట్‌లో ప్రతి దశలోనూ 5డీ బీఐఎం టెక్నాలజీ వినియోగించారు. అమృత్‌సర్‌లో రాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్‌లో 4 కి.మీ. దూరాన్ని వర్చువల్ డిజైన్‌తో నిర్మించారు.
ప్రమాదాల నివారణకు వీఆర్..
నిర్మాణ ప్రమాదాలను, కార్మికుల భద్రత కోసం వర్చువల్/ఆగ్యుమేటెడ్ రియాలిటీని వినియోగిస్తారు. ఈ టెక్నాలజీతో ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించవచ్చు.
వీఆర్/ఏఆర్ టెక్ యాప్స్‌లను బీఐఎం సాఫ్ట్వేర్ అనుసంధానం చేయడం ద్వారా
నిర్మాణం పూర్తి కాకముందే కాంట్రాక్టర్లు, డెవలపర్లు వర్చువల్ రియలిటీ ద్వారా వాస్తవ నిర్మాణాన్ని చూడవచ్చు. దీంతో పాటూ నిర్మాణ దశలోనూ డిజైన్ల మార్పు చేసుకునే వీలుంటుంది. దీంతో సమయం, వ్యయం రెండూ ఆదా అవుతాయి.
డ్రోన్స్‌తో పర్యవేక్షణ..
ప్రాజెక్ట్ సైట్లను పర్యవేక్షణ, నిర్వహణ చేయడం కోసం డ్రోన్స్ వినియోగిస్తుంటారు. డ్రోన్స్ టెక్నాలజీ ఖరీదైనప్పటికీ ప్రజాదరణ పొందిన టెక్నాలజీ. డ్రోన్స్ సహాయంతో సైట్ మ్యాప్‌లను 2 డీ, త్రీడీ ఇమేజ్‌లను అభివృద్ధి చేయవచ్చు కూడా. ఆధునిక డ్రోన్స్‌తో సైట్ కొలతల్లో సమన్వయంతో పాటూ ఖచ్చితత్వం ఉంటుంది.
రోబోలే కార్మికులు..
నిర్మాణ రంగంలో ఎక్కువ మంది కార్మికులు, వ్యయం అవసరముంటుంది. నిర్మాణ కార్మికుల వ్యయం, శ్రమ తగ్గించేందుకు రోబోలను వినియోగిస్తుంటారు. దీంతో పాటూ నాణ్యత, ప్రమాణాలు కూడా పెరుగుతాయి. ఇప్పటికే రియల్టీ పరిశ్రమలో ‘ఎస్ఏఎం’ అని పిలిచే బ్రిక్– లేయింగ్ రోబోట్స్లను వినియోగిస్తున్నారు. వేగంగా, నాణ్యమైన ఇటుకలను అందించడం కోసం దీన్ని వినియోగిస్తున్నారు. వాణిజ్య సముదాయాల నిర్మాణంలో దీన్ని వినియోగిస్తుంటారు. కార్మికులతో పోలిస్తే ఐదు రెట్లు వేగంగా పనిచేస్తుంది.
టెక్నాలజీతో కార్మిక శక్తి వృద్ధి
నిర్మాణ రంగంలో పునాదుల నుంచి భవనం తుది వరకూ అన్ని దశల్లోనూ కార్మికుల స్థానంలో టెక్నాలజీని భర్తీ చేయడం అంత సులువైన విషయం కాదు. సాంకేతికత వినియోగంతో కార్మిక శక్తిని రెట్టింపు చేయడం, సులభతరం చేయడం తేలికవుతుంది. నివాసయోగ్యమైన భవనాలను ఎల్లప్పుడూ భౌతికంగా కార్మిక శక్తి నిర్మాణాలే ఉండాలని కోరుకుంటారు.
– అనూజ్ పూరీ, చైర్మన్, అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్.
You may be interested
పెట్టుబడికి ముందే?
Saturday 6th October 2018సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తుండటంతో ప్రవాసులు రియల్టీ వైపు మళ్లుతున్నారు. నివాస సముదాయాల్లో కంటే వాణిజ్య, రిటైల్ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఓ కన్సల్టెన్సీ సర్వేలో తేలింది. మరి, ఇలాంటి సమయంలో వాణిజ్య సముదాయల్లో పెట్టుబడులు పెట్టేముందు ఎలాంటి అంశాలను గమనించాలనే విషయంపై నిపుణులు సూచనలివిగో.. ♦ నివాస సముదాయాల్లో పెట్టుబడులు 2–4 శాతం అద్దె గిట్టుబాటైతే.. వాణì జ్య సముదాయాల్లో మాత్రం ఇది 8–11
10 నుంచి అమెజాన్ ‘గ్రేట్ ఇండియా ఫెస్టివల్’
Saturday 6th October 2018న్యూఢిల్లీ: దసరా సందర్భంగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్... ‘గ్రేట్ ఇండియా ఫెస్టివల్’ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించింది. ఈనెల 10 నుంచి 15 వరకు జరిగే సేల్‌లో 4 లక్షల మంది అమ్మకందారులు తమ ఉత్పత్తులను అందించనున్నారని వెల్లడించింది. ప్రైమ్ మెంబర్లకు అధిక ప్రాధాన్యత ఇస్తూ... వీరికి ప్రత్యేకంగా 9న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది. ప్రైమ్ సభ్యులు కానివారికి మాత్రం 10వ తేదీన సేల్ ఆరంభమవుతుంది.