STOCKS

News


పెట్టుబడుల్లో బ్యాలెన్స్‌...

Monday 4th February 2019
Markets_main1549266059.png-24006

  • పెట్టుబడుల్లో బ్యాలన్స్‌...
  • ఎస్‌బీఐ ఈక్విటీ హైబ్రిడ్‌ ఫండ్‌

మార్కెట్ అస్థిరతల్లో పెట్టుబడులకు తక్కువ రిస్క్‌ను ఆశించే వారు, దీర్ఘకాలంలో సంప్రదాయ ఎఫ్‌డీలు,  పోస్టాఫీసు పథకాల కంటే కాస్త అధిక​రాబడులు కోరుకునే వారు పరిశీలించాల్సిన పథకాల్లో ఎస్‌బీఐ హైబ్రిడ్‌ ఈక్విటీ కూడా ఒకటి. గతంలో ఇది ఎస్‌బీఐ మ్యాగ్నం ఫండ్‌ పేరుతో నడిచింది. గతేడాదే సెబీ ఆదేశాల మేరకు పథకం పేరు మారింది. ఈ పథకం ఈక్విటీ, డెట్‌ రెండింటిలోనూ ఇన్వెస్ట్‌ చేస్తుంది. కానీ, డెట్‌ సాధనాలకు మించి రాబడులను ఇవ్వగలదు. కనీసం 65 శాతాన్ని ఈక్విటీల్లో ఇన్వె‍స్ట్‌ చేస్తుంది. మిగిలిన మొత్తాన్ని ఫిక్స్‌డ్‌ ఇన్‌కమ్‌ సెక్యూరిటీల్లో పెడుతుంది. బుల్‌ మార్కెట్లో, బేర్‌ మార్కెట్లోనూ పనితీరు పరంగా ఈ పథకానికి మంచి ట్రాక్‌ రికార్డు ఉంది.

రాబడులు
ఈ పథకం రాబడులు గడచిన ఏడాది కాలంలో మైనస్‌ 2 శాతంగా ఉన్నాయి. కానీ, మూడేళ్ల కాలంలో చూసుకుంటే సగటున ఏటా 10.46 శాతం, ఐదేళ్ల కాలంలో వార్షికంగా 15.39 శాతం, పదేళ్ల కాలంలో 16.19 శాతం చొప్పున రాబడులు ఇచ్చింది. 1995 డిసెంబర్‌ 31న ఈ పథకం ప్రారంభం కాగా, అప్పటి నుంచి చూసుకుంటే వార్షిక రాబడులు 15.84 శాతంగా ఉన్నాయి. కనుక దీర్ఘకాలంలో ఓ బ్యాలన్స్‌డ్‌ ఫండ్‌లో ఈ స్థాయి రాబడులు మెరుగైనవేనని చెప్పుకోవాలి. రిస్క్‌ ఎక్కువగా తీసుకోలేని వారికి ఈ తరహా బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ అనుకూలం.

పెట్టుబడుల విధానం
పెట్టుబడుల కేటాయింపును ఈ పథకం మేనేజర్లు తెలివిగా చేస్తుంటారు. ఆటుపోట్ల సమయాల్లో ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ను తగ్గించుకుని నగదు నిల్వలు పెంచుకుంటారు. 2011 మార్కెట్‌ కరెక్షన్‌లో, 2015 ఒడిదుడుకుల సమయాల్లో ఈక్విటీలకు ఎక్స్‌పోజర్‌ తగ్గించుకోవడం వల్ల ఈ పథకంలో నష్టాలు పరిమితం అయ్యాయి. 2014 బాండ్‌ మార్కెట్‌ ర్యాలీ ప్రయోజనాలను సైతం పొందింది. 2018 మార్కెట్ల అస్థిరతల్లోనూ ఈక్విటీలో అధిక పెట్టుబడులను కాస్త తగ్గించుకుంది. ఈ విధమైన వ్యూహాలతో నష్టాలను పరిమితం చేయడం, లాభాలను ఒడిసిపట్టడం ఈ ఫండ్‌ మేనేజర్లు చేసే పని. ప్రస్తుతానికి ఈక్విటీల్లో 71.95 శాతం, డెట్‌లో 25.76 శాతం, నగదు నిల్వలు రూ.2.29 శాతం కలిగి ఉంది. ఈ పథకం ఈక్విటీ పోర్ట్‌ఫోలియోలో 58 స్టాక్స్‌ ఉన్నాయి. మూడు రంగాల కంపెనీల్లోనే 44 శాతం వరకు ఇన్వెస్ట్‌ చేసింది. బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కు 27 శాతం వరకు కేటాయింపులు చేసింది. ఆ తర్వాత సేవల రంగానికి 9 శాతం వరకు కేటాయింపులు ఉన్నాయి. ఎనర్జీ, టెక్నాలజీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్‌ రంగాలకు సుమారు ఐదు శాతం చొప్పున కేటాయింపులు ఉన్నాయి. ఈ పథకంలో కనీసం రూ.1,000 మొత్తంతో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. ప్రతీ నెలా సిప్‌ రూపంలో అయితే రూ.500 నుంచి కూడా ఇన్వెస్ట్‌ చేసుకునే అవకాశం ఉంది.You may be interested

జీవితకాల గరిష్టానికి టైటాన్‌

Monday 4th February 2019

బ్రాండెడ్‌ బంగారు ఆభరణాలను విక్రయించే టైటాన్‌ కంపెనీ షేర్‌ ధర సోమవారం జీవితాల గరిష్టాన్ని చేరింది. తృతీయ త్రైమాసికం(క్యూ 3)లో కంపెనీ ఆర్జించిన ఫలితాలు మార్కెట్‌ ఆశించిన స్థాయిలో నమోదు కావడం, షేరుకు ప్రముఖ బ్రేకరేజ్‌ సంస్థలు రేటింగ్‌ పెంచడటం తదితర అంశాలు షేరు ర్యాలీ చేయడానికి దోహదపడ్డాయి. నేడు టైటాన్‌ షేరు బీఎస్‌ఈలో రూ.1024.00ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో ఇన్వెస్టర్లు షేరు కొనుగోళ్ల మొగ్గుచూపడంతో షేరు 6శాతం ర్యాలీ

సొంతింటికి దారి ఇదీ..!

Monday 4th February 2019

- బడ్జెట్‌లో రియల్టీకి పలు ప్రయోజనాలు... - ఆదాయపన్ను పరంగానూ పెద్ద ఉపశమనం - సొంతింటికి ప్లాన్‌ చేసుకునేందుకు అనుకూలతలు - రుణం తీసుకోవాలంటే చూడాల్సినవి కొన్ని ఉన్నాయ్‌ - డౌన్‌ పేమెంట్‌, రుణ కాల ‍వ్యవధి, ఈఎంఐ కీలకం - పిల్లల ఉన్నత విద్య, అత్యవసరాలూ పరిగణనలోకి... ఇంటి కొనుగోలును ఆకర్షణీయం చేసే పలు నిర్ణయాలను మోదీ సర్కారు ఇటీవలి బడ్జెట్లో ప్రకటించింది. అందుబాటు గృహాలపై బిల్డర్లకు పన్ను రాయితీలను 2019-20 వరకు పొడిగించింది. అమ్ముడుపోకుండా ఉన్న

Most from this category