STOCKS

News


పెద్ద పట్టణాల్లో ఇళ్లకు డిమాండ్‌

Monday 15th October 2018
personal-finance_main1539581205.png-21150

న్యూఢిల్లీ: దేశంలోని ఏడు పెద్ద పట్టణాల్లో ఇళ్లకు డిమాండ్‌ నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌)లో అమ్మకాలు 15 శాతం పెరిగాయి. డీమోనిటైజేషన్‌, జీఎస్టీ, రెరా తాలూకూ ప్రభావాల నుంచి ప్రాపర్టీ మార్కెట్‌ కోలుకుంటున్నట్టు అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ తెలిపింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, పుణె నగరాల్లో కలిపి చూస్తే నివాస గృహాల విక్రయాలు ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌ కాలంలో 15 శాతం వృద్ధితో 67,175 యూనిట్లుగా ఉన్నాయి. కానీ, విడిగా చూస్తే మాత్రం చెన్నై, హైదరాబాద్‌ మార్కెట్లలో అమ్మకాల్లో క్షీణత నమోదైంది. ఇక ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్‌ కాలంలో ఈ ఏడు పట్టణాల్లో విక్రయాలు 8 శాతం పెరిగి 1,78,400 యూనిట్లుగా ఉన్నట్టు అనరాక్‌ తెలిపింది. 
పట్టణాల వారీగా...
జూలై-సెప్టెంబర్‌ మధ్య చెన్నైలో ఇళ్ల విక్రయాలు 27 శాతం తగ్గిపోగా, హైదరాబాద్‌ మార్కెట్లో 2 శాతం క్షీణత నెలకొంది. చెన్నైలో 2,935 నివాస గృహాలు అమ్ముడుపోతే, హైదరాబాద్‌ మార్కెట్లో విక్రయాలు 4,850 యూనిట్లుగా ఉ‍న్నాయి. దేశరాజధాని ప్రాంతంలో 6 శాతం పెరిగి 11,350 యూనిట్లుగా నమోదయ్యాయి. ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతంలో విక్రయాలు ఏకంగా 23 శాతం పెరిగి 18,200 యూనిట్లకు చేరాయి. పుణెలో 20 శాతం, కోల్‌కతాలో 25 శాతం చొప్పున వృద్ధి చెందాయి. ఇక ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్‌ మధ్య చూస్తే... హైదరాబాద్‌ మార్కెట్లో విక్రయాలు 12 శాతం పెరిగాయి. 13,650 ఇళ్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతాలోనూ ఇదే స్థాయి వృద్ధి నమోదైంది. బెంగళూరు మార్కెట్లో 30 శాతం అధికంగా 42,700 ఇళ్లు అమ్ముడయ్యాయి. కానీ, ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్‌ కాలంలోనూ ఇళ్ల అమ్మకాలు పడిపోయిన ఏకైక మార్కెట్‌ చెన్నై. ఇక్కడ కేవలం 8,050 యూనిట్లే విక్రయమయ్యాయి. గతేడాది ఇక్కడ 11,075 ఇళ్లు అమ్ముడుపోవడం గమనార్హం. 
 



You may be interested

టెలికంకు మరో మూడు త్రైమాసికాలు నష్ట కాలమే: సీవోఏఐ

Monday 15th October 2018

న్యూఢిల్లీ: టెలికం రంగానికి మరో మూడు త్రైమాసికాల పాటు నష్టాలు తప్పవని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (సీవోఏఐ) తెలిపింది. అధిక లెవీలు, నిలకడలేని టారిఫ్‌లు నష్టం కలిగిస్తున్నట్టు పేర్కొంది. ‘‘ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రకారం చూస్తే... కనీసం మరో మూడు క్వార్టర్లలో నష్టాలు ఉండనున్నాయి. ఎందుకంటే, ఈ పరిశ్రమ దీర్ఘకాల ఆరోగ్యం దృష్ట్యా ప్రస్తుత టారిఫ్‌లు దీర్ఘకాలం పాటు కొనసాగించడం సాధ్యం కాదన్నది నా అభిప్రాయం’’అని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌

యాంఫీ చైర్మన్‌గా నిమేష్ షా

Monday 15th October 2018

న్యూఢిల్లీ: అసోసియేష‌న్ ఆఫ్ మ్యూచువ‌ల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ) నూతన చైర్మన్‌గా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ ఎండీ, సీఈవో నిమేష్ షా ఎంపికయ్యారు. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ ఎ.బాలసుబ్రమణ్యన్‌ స్థానంలో ఈయన్ని నియమించినట్లు యాంఫీ ప్రకటించింది. 2007 నుంచి మ్యూచువ‌ల్ ఫండ్స్ పరిశ్రమలో షా సేవలందిస్తున్నట్లు పేర్కొంది. ఇక వైస్‌ చైర్మన్‌గా ఎల్‌ అండ్‌ టీ మ్యూచువల్‌ ఫండ్‌ సీఈఓ కైలాష్ కులకర్ణి

Most from this category