STOCKS

News


టీ–రెరాలో నమోదైన తొలి ప్రాజెక్ట్‌.. రాజక్షేత్ర!

Saturday 8th September 2018
personal-finance_main1536381861.png-20089

సాక్షి, హైదరాబాద్‌:
ఎట్టకేలకు తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) వెబ్‌సైట్‌ ప్రారంభమైంది. టీ–రెరాలో నమోదైన తొలి ప్రాజెక్ట్‌గా రాజక్షేత్ర నిలిచింది. ఏ వ్యాపారంలోనైనా కస్టమరే రాజు. అలాంటి రాజులకు రాజసంలా నిలిచే రాజక్షేత్ర.. రెరాలో మొదటి ప్రాజెక్ట్‌గా నమోదవ్వటం ఆనందంగా ఉందన్నారు రాజక్షేత్రను నిర్మిస్తున్న గిరిధారి హోమ్స్‌ ఎండీ ఇంద్రసేనా రెడ్డి. కిస్మత్‌పూర్‌లో నిర్మిస్తున్న ఆర్ట్‌ ప్రాజెక్ట్‌ను కూడా త్వరలోనే రెరాలో నమోదు చేయనున్నామని చెప్పారు.
2017, జనవరి 1 తర్వాత జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, టీఎస్‌ఐఐసీ పరిధిలో అనుమతి పొందిన ప్రతి ప్రాజెక్ట్‌ రెరాలో నమోదు చేసుకోవాలి. 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్లు ప్రతి నివాస, వాణిజ్య సముదాయాలు రెరాలో నమోదు తప్పనిసరి. గతేడాది జనవరి 1 తర్వాత ఆయా ప్రభుత్వ విభాగాల నుంచి సుమారు 5 వేల ప్రాజెక్ట్‌లు అనుమతి పొందాయని.. 90 రోజుల్లోగా ఇవన్నీ రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని తెలంగాణ రెరా సెక్రటరీ కే విద్యాధర్‌ రావు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ఇప్పటివరకు టీ–రెరాలో 57 ప్రాజెక్ట్‌లు డేటాను ఎంట్రీ చేశాయని, 173 మంది ప్రమోటర్లు, ఏజెంట్లు నమోదయ్యారని ఆయన పేర్కొన్నారు.
రెరాకు ముందు.. తర్వాత..
స్థిరాస్తి రంగాన్ని రెరాకు ముందు, తర్వాత అని విభజించే రోజులొచ్చాయి. గతంలో మార్కెట్‌ బాగున్నప్పుడు బుకింగ్‌ సొమ్ము చెల్లించేసి మళ్లీ కనబడని కస్టమర్లు తీరా మార్కెట్‌ ప్రతికూలంగా మారగానే నానా హంగామా చేసినవారు బోలెడు మంది. కానీ, రెరాలో ఈ పప్పులేమీ ఉడకవు. నిజం చెప్పాలంటే బుకింగ్‌ సొమ్ము పట్టుకొచ్చే ప్రతి కస్టమర్‌కూ ఫ్లాట్లను విక్రయించరు కూడా. ముందుగా 10 శాతం బుకింగ్‌ సొమ్ముతో రిజిస్టర్డ్‌ అగ్రిమెంట్‌ చేసుకున్నాక.. నిర్మాణం పూర్తయి ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ (ఓసీ) వచ్చాకే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలవుతుంది. అర్ధంతరంగా నిర్ణయాన్ని వాయిదా వేసే కస్టమర్లతో ప్రాజెక్ట్‌ మీద ప్రభావం పడేది. కానీ, రెరాలో మోసపూరిత మధ్యవర్తులు, దళారులకు తావుండదన్నమాట. కస్టమర్ల చరిత్ర, పూర్వాపరాలు, ఆర్ధిక క్రమశిక్షణ వంటివి పరిశీలించాక నిజమైన గృహ కొనుగోలుదారులతో మాత్రమే క్రయవిక్రయాలు జరుపుతారు. కొనుగోలుదారులే కాదు రియల్టీలో పెట్టబడిదారులూ అంతే! మార్కెట్‌ బాగున్నప్పుడు అందరూ రియల్టీలో ఇన్వెస్ట్‌ చేస్తుంటారు. కాస్త నెమ్మదించగానే వైదొలుగుతారు. దీంతో స్థానిక మార్కెట్‌పై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ, రెరాలో ప్రణాళిక ఉన్న డెవలపరే కాదు నిజమైన కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు మాత్రమే అవకాశముంటుందని గిరిధారి హోమ్స్‌ ఎండీ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు.
రెరాలో కస్టమరే బాహుబలి..
రెరాలో కేవలం ప్రాజెక్ట్‌లు, డెవలపర్లు, ఏజెంట్లు మాత్రమే కాదండోయ్‌.. కొనుగోలుదారులూ నమోదు చేసుకునే వీలుంది. దీంతో ఫ్లాట్‌ కొనేముందు ఎలాంటి అంశాలను పరిశీలించాలని తెలిపే చెక్‌ లిస్ట్, మార్గదర్శకాలను అందుకోవచ్చు. కొనుగోలుకు ముందే ప్రాజెక్ట్, డెవలపర్ల పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలిసిపోతాయి. దీంతో తోకజాడించే బిల్డర్లు నిలబడలేరు. రెరా రాకముందు గడువులోగా కొనుగోలుదారులు గృహ ప్రవేశం చేయడమనేది సవాలే. కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ఒక ప్రాజెక్ట్‌ నుంచి మరొక ప్రాజెక్ట్‌కు మళ్లించడంతో గడువలోగా పూర్తికాకపోవటం, మధ్యలోనే నిర్మాణం ఆగిపోవటం, అసలు మొదలు కాకపోవటం వంటివి జరిగేవి. కానీ, రెరాలో గడువులోగా నిర్మాణం పూర్తి చేయట అనేది ప్రధాన నిబంధన. పారదర్శక లావాదేవీలతో పాటూ నిధులు మళ్లింపులకు ఆస్కారమే లేదు. ఏ ప్రాజెక్ట్‌లో వసూలు చేసే సొమ్మును అదే ప్రాజెక్ట్‌ నిర్మాణానికి వినియోగించాలి కాబట్టి గడువులోగా నిర్మాణం పూర్తవుతుంది. ఆర్ధిక క్రమ శిక్షణ కారణంగా డెవలపర్‌కు, కస్టమర్‌కు ఇద్దరికీ ప్రశాంతత.
రెరాలో సక్సెస్‌ అయ్యేది ఎవరంటే..
రెరాలో సక్సెస్‌ అయ్యేది ఎవరంటే.. నిర్మాణంలో వేగం, నాణ్యత, వినూత్న పాటించే డెవలపర్లే! గడువు, నాణ్యత విషయంలో డెవలపర్లు, చెల్లింపుల్లో కస్టమర్లు బాధ్యతగా వ్యవహరిస్తారు. దీంతో విలువలతో కూడిన పరిశ్రమ తయారవుతుందని.. మార్కెట్, మార్జిన్స్‌ అంతంత మాత్రంగా ఉన్న తెలంగాణ రియల్టీకి రెరాతో కొత్త బూస్ట్‌ రావటం ఖాయమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. నాణ్యమైన ఉత్పత్తుల వాడకం, వారంటీ, ఐదేళ్ల నిర్వహణ బాధ్యత వంటి కారణంగా ధరలు కూడా పెరుగుతాయని.. సుమారు 10–15 శాతం వృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. గతంలో రాజకీయ, ఆర్ధిక కారణాలతో సంస్థ ఇబ్బందులు పడితే ఆ ప్రభావం కస్టమర్ల మీద పడేది. కానీ, రెరా వచ్చాక ప్రతికూల పరిస్థితుల్లోనూ సంస్థలు, కస్టమర్లు ఇద్దరూ నిలబడగలుగుతారు. ఎందుకంటే రెరాతో కస్టమర్‌కు, డెవలపర్‌కు ఇద్దరికీ రక్షణ ఉంటుంది కాబట్టి. సింపుల్‌గా చెప్పాలంటే రెరాతో రియల్టీ పరిశ్రమ పునాది బలంగా ఉంటుంది.
–––––––––––––––
బండ్లగూడలో రాజక్షేత్ర..
టీఎస్‌ పోలీస్‌ అకాడమీ (అప్పా జంక్షన్‌) బండ్లగూడ సమీపంలోని కిస్మత్‌పూర్‌లో 1.8 ఎకరాల్లో రాజక్షేత్ర పేరిట నివాస సముదాయాన్ని నిర్మిస్తోంది గిరిధారి హోమ్స్‌. సబ్లిమినల్‌ ఆర్కిటెక్చర్‌తో ప్రాజెక్ట్‌కు తీర్చిదిద్దడం దీని ప్రత్యేకత. రాజక్షేత్ర ప్రాజెక్ట్‌ హోటల్‌ను తలపించే ఎలివేషన్‌ ఉంటుంది. 30 నెలల్లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. 118 ఫ్లాట్లుంటాయి. 1,200 చ.అ. నుంచి 1,800 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలున్నాయి. 7 వేల చ.అ.ల్లో క్లబ్‌హౌజ్‌తో పాటూ గ్రాండ్‌ ప్రివ్యూ థియేటర్, స్విమ్మింగ్‌ పూల్, ఏసీ జిమ్‌ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి.
– సబ్లిమినల్‌ ఆర్కిటెక్చర్‌ అంటే.. ప్రాజెక్ట్‌ కామన్‌ ఏరియా, ఓపెన్‌ స్పేస్, క్లబ్‌హౌజ్‌ వంటి ప్రాంతాల్లో స్ఫూర్తిదాయక వ్యక్తులు, మహనీయుల చిత్ర పటాలు, జీవిత చరిత్రలను ఏర్పాటు చేస్తారు. గోడల మీద గుర్రం, ఏనుగు, రథం వంటి బొమ్మలు (మ్యూరల్‌ ఆర్డ్‌)లను చిత్రీకరిస్తారు. దీంతో నివాసితులకు ప్యాలెస్‌ తరహా అనుభూతి కలుగుతుంది. రోజూ మనం తిరిగే పరిసరాలు, మాట్లాడే వ్యక్తులు ఉన్నతంగా ఉంటే మనలోనూ ఉన్నతమైన భావాలు, ఆలోచనలు కలుగుతాయని అందుకే రాజక్షేత్రను సబ్లిమినల్‌ ఆర్కిటెక్చర్‌తో నిర్మిస్తున్నామని కంపెనీ ఎండీ ఇంద్రసేనా రెడ్డి తెలిపారు. ఒక్కముక్కలో చెప్పాలంటే.. సబ్లిమినల్‌ ఆర్కిటెక్చర్‌ నిర్మాణాలు ఉన్నత స్థానానికి చేరుకోవాలనే కోరికను, ప్రోత్సాహాన్ని, ప్రేరణను కలిగిస్తాయి. 



You may be interested

టెక్‌ బడి.. ‘బిజ్‌ ఏక్టివ్‌’

Saturday 8th September 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఏఐ, బ్లాక్‌ చెయిన్‌ వంటి కొత్త టెక్నాలజీ కోర్సులు నేర్చుకోవాలంటే సిటీకి రావాలా? ట్రెయినింగ్‌ సెంటర్లో చేరాలా? ఇవన్నీ వద్దంటోంది స్టార్టప్‌ కంపెనీ ‘బిజ్‌ ఏక్టివ్‌’. ఒకటీ రెండూ కాదు ఏకంగా 87 రకాల టెక్నాలజీ కోర్సులు తమ సైట్‌ ద్వారానే నేర్చుకోవచ్చని చెబుతోంది ఈ సంస్థ. ‘వరంగల్‌’ కేంద్రంగా సేవలందిస్తున్న బిజ్‌ ఏక్టివ్‌లో బెంగళూరు, ముంబై, చెన్నై, కోల్‌కతా వంటి నగరాల నుంచి కూడా

జేఎల్‌ఆర్‌ అమ్మకాలు 5 శాతం డౌన్‌

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) అంతర్జాతీయ అమ్మకాలు గత నెలలో 5 శాతం తగ్గాయి. గత నెలలో జేఎల్‌ఆర్‌ వాహన విక్రయాలు 5 శాతం క్షీణించి  36,629కు తగ్గాయని జేఎల్‌ఆర్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ ఫెలిక్స్‌ వెల్లడించారు. జాగ్వార్‌ బ్రాండ్‌ అమ్మకాలు 8 శాతం వృద్ధితో 11,802కు పెరగ్గా, ల్యాండ్‌ రోవర్‌ బ్రాండ్‌ విక్రయాలు 10 శాతం పతనమై 24,827కు చేరాయని వివరించారు. కీలకమైన మార్కెట్లలో

Most from this category