STOCKS

News


50 వేల చ.మీ. ప్రాజెక్ట్‌కు ఈసీ అక్కర్లేదు!

Saturday 17th November 2018
personal-finance_main1542433863.png-22136

 సాక్షి, హైదరాబాద్‌: దేశీయ నిర్మాణ రంగానికి కాసింత ఉపశమనం లభించింది. 20 వేల చ.మీ. నుంచి 50 వేల చ.మీ. బిల్టప్‌ ఏరియాలో నిర్మించే నివాస ప్రాజెక్ట్‌లకు ఎన్విరాన్‌మెంటల్‌æ క్లియరెన్స్‌ (ఈసీ) స్థానిక మున్సిపల్‌ శాఖలోనే తీసుకునే వీలుంది. 20 వేల చ.మీ. నుంచి 1.50 లక్షల చ.మీ. బిల్టప్‌ ఏరియాలో నిర్మించే పారిశ్రామిక షెడ్లు, ఆసుపత్రులు, హోటల్స్‌ వంటి వాణిజ్య ప్రాజెక్ట్‌లకైతే (కేటగిరీ–బీ) కూడా స్థానికంగానే తీసుకునేలా కేంద్రం నిబంధనలను సడలించింది.
దేశంలో త్వరితగతిన నిర్మాణ అనుమతులను మంజూరు చేసేందుకు, పర్యావరణహితమైన ప్రాజెక్ట్‌లకు ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ తెలిపింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో (యూటీ)ల్లోని భవన నిర్మాణ నిబంధనల్లోనే ఇంటిగ్రేట్‌ చేస్తారు. దీంతో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, మున్సిపాలిటీలు, పంచాయతీలు, డీటీసీపీ పరిధిలోనే పర్యావరణ అనుమతులు మంజూరవుతాయి. ఆయా ప్రాజెక్ట్‌లల్లో సహజ మురుగు నీటి వ్యవస్థ, నీటి సంరక్షణ, రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్, పునరుతాదక విద్యుత్, వ్యర్థాల నిర్వహణ వంటివి నిర్వహించాల్సి ఉంటుంది.
గడువులోగా పూర్తవుతాయ్‌..
స్థానికంగానే ఈసీ అనుమతులు మంజూరు చేస్తే ప్రాజెక్ట్‌లు గడువులోగా పూర్తవ్యటమే కాకుండా వడ్డీల భారం తగ్గుతుందని కాన్ఫడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో అందుబాటు గృహాల ప్రాజెక్ట్‌లను చేసేందుకు డెవలపర్లు ముందుకొచ్చే అవకాశముంటుందని క్రెడాయ్‌ జాతీయ అధ్యక్షుడు జక్సే షా తెలిపారు.



You may be interested

పొందికగా సొంతిల్లు

Saturday 17th November 2018

సాక్షి, హైదరాబాద్‌: మెట్రో నగరాల్లో విశాలమైన విస్తీర్ణాల్లోని ఇల్లు కొనాలంటే మధ్య తరగతివాసులకు కష్టమే. చిన్న ఫ్లాట్లనూ కొనుగోలు చేసినా సరే.. కాస్త పొందికగా ఇంటీరియర్‌ను అమర్చుకుంటే చాలు! ఇల్లు విశాలంగా కనిపిస్తుంది.  ఇల్లు విశాలంగా కనిపించాలంటే ఇంట్లో అమర్చే ఫర్నీచర్‌ పొందికగా ఉండాలి. అలాగే ఆ ఫర్నీచర్‌ తక్కువ స్థలాన్ని ఆక్రమిస్తూ వేర్వేరు అవసరాలకు ఉపయోగపడేలా ఉండాలి. ఇలాంటి స్పేస్‌ సేవింగ్‌ ఫర్నీచర్‌ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. రబ్బర్‌

40 మంది డెవలపర్లకు టీ–రెరా నోటీసులు

Saturday 17th November 2018

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) కొరడా ఝళిపించింది. టీ–రెరాలో నమోదు చేయకుండా ప్రాజెక్ట్‌ను అడ్వటయిజింగ్‌ చేసిన 40 మంది డెవలపర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 20 తేదీలోపు వివరణ ఇవ్వాలని లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని టీ–రెరా సెక్రటరీ కే విద్యాధర్‌ రావు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. నోటీసులు జారీ చేసిన 40 మంది డెవలపర్లలో ప్రముఖ నిర్మాణ సంస్థల ప్రమోటర్లు కూడా

Most from this category