STOCKS

News


బడా బ్యాంకులపై మోర్గాన్‌ స్టాన్లీ మక్కువ

Monday 22nd October 2018
Markets_main1540200971.png-21364

బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో చోటు చేసుకుంటున్న ప్రస్తుత సంక్షోభ సమయంలో పెద్ద ప్రైవేట్‌ బ్యాంకులను నమ్ముకోవడం ఉత్తమం అని అంతర్జాతీయ బ్రోకరేజ్‌ సంస్థ మోర్గాన్‌స్టాన్లీ అభిప్రాయపడింది. వడ్డీరేట్ల పెరుగుదల, ఎన్‌బీఎఫ్‌సీ రంగంలో సునామీ.. విత్త సంస్థలను ఇక్కట్లు పెడుతున్నాయి. వడ్డీరేట్ల పెరిగే తరుణంలో బలమైన లిక్విడిటీ ఉన్న బ్యాంకులే బాగుంటాయని మోర్గాన్‌ స్టాన్లీ పేర్కొంది. రేట్ల పెరుగుదల తరుణంలోనే ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌, డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ తదితర ఎన్‌బీఎఫ్‌సీలు సమస్యల సుడిగుండంలో చిక్కుకోవడం వల్ల బడా బ్యాంకులవైపు మొగ్గు చూపడం త్వరితమవుతుందని తెలిపింది. వడ్డీవ్యయాల పెరుగుదల బ్యాంకుల మార్జిన్లను కుంగదీస్తుందని, ఆస్తుల నాణ్యతను దెబ్బతీస్తుందని తెలిపింది. పీఎస్‌యూ బ్యాంకుల వద్ద లిక్విడిటీ ఎక్కువగానే ఉన్నా... వాటి మూలధనం తక్కువ కావడం వల్ల పెద్దగా రుణాలు ఇవ్వలేమని అంచనా వేసింది. ఈ నేపథ్యంలో పెద్దపెద్ద ప్రైవేట్‌ బ్యాంకులే గెలుపుగుర్రాలవుతాయని అభిప్రాయపడింది. 
ప్రైవేట్‌ బ్యాంకుల్లో మరింత లిక్విడిటీ
ప్రస్తుత సంక్షుభిత సమయంలో బడా ప్రైవేట్‌ బ్యాంకుల్లోకే ఎక్కువ లిక్విడిటీ ప్రవాహం ఉంటుందని మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. ఎల్‌సీఆర్‌పై ఆర్‌బీఐ నిర్ణయం లిక్విడిటీ మరింత పెరిగేందుకు తోడ్పడుతుందని తెలిపింది. పీఎస్‌యూలకు మరింత మూలధన సాయం అందితే చురుగ్గా మారతాయని అభిప్రాయం వ్యక్తం చేసింది. రేట్ల పెరుగుదల తరుణంలో ఎన్‌బీఎఫ్‌సీలతో పాటు చిన్నా చితకా బ్యాంకులు బాగా ఇబ్బందులు పడతాయని అంచనా వేసింది. పెద్ద ప్రైవేట్‌ బ్యాంకుల పీపీఓపీ వచ్చే రెండేళ్లలో 24 శాతం చక్రీయ వార్షిక వృద్ధి సాధిస్తుందని తెలిపింది. గతంలో ఈ వృద్ధి21 శాతంగా ఉండొచ్చని మోర్గాన్‌స్టాన్లీ తెలిపింది. గతంలో ప్రైవేట్‌ బ్యాంకుల పీపీఓపీ 32 శాతం ఉండేది, తాజాగా 29 శాతానికి దిగివచ్చింది. ఇది మరింత క్షీణిస్తుందని బ్రోకరేజ్‌ సంస్థ గతంలో అంచనా వేసినా, తాజాగా క్షీణత స్థాయిలను తగ్గించింది.

- వచ్చే మూడేళ్లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌తో పాటు ఎస్‌బీఐల లోన్‌గ్రోత్‌ బాగుంటదని అంచనా వేసింది. ఈ బ్యాంకులకు ఓవర్‌ వెయిట్‌ రేటింగ్‌ ఇచ్చామని తెలిపింది.

- వీటి టార్గెట్‌ ధరలు వరుసగా 2550, 460, 800, 350 రూపాయలని తెలిపింది.

- ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ రేటింగ్‌ను ఈక్వల్‌ వెయిట్‌కు, టార్గెట్‌ను రూ. 595కు తగ్గిస్తున్నట్లు తెలిపింది.

- ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌ రేటింగ్‌లను అండర్‌వెయిట్‌కు తగ్గించామని తెలిపింది. 



You may be interested

ఇంకో రౌండ్‌ కరెక‌్షన్‌ ఉంది.. తొందరొద్దు..

Monday 22nd October 2018

ఇండియన్‌ ఈక్విటీ మార్కెట్‌లో మరో విడత కరెక‌్షన్‌ మిగిలే ఉందని ఎడిల్‌వీజ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినయ్‌ ఖట్టర్‌ తెలిపారు. అందువల్ల ఇన్వెస్టర్లు తొందపడొద్దని సూచించారు. మరికొంత కాలం వేచిచూడడమే ఉత్తమమని తెలిపారు. ఇటీవలి మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోలను రీబ్యాలెన్స్‌ చూసుకోవాలని పేర్కొన్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు వెల్లడించారు.  విదేశీ ఇన్వెస్టర్లు చాలా వరకు ఇండియన్ ఈక్విటీ మార్కెట్‌ విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 9 శాతం క్రాష్‌

Monday 22nd October 2018

విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఒత్తిడికి ప్రైవేటు రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ సోమవారం 9 శాతం పతనమై 15 నెలల కనిష్టస్థాయి రూ. 1,535 వద్దకు పడిపోయింది. అక్టోబర్‌ 15న ఆర్థిక ఫలితాలు ఈ బ్యాంక్‌ ఫలితాలు వెల్లడికాగా, ఈ షేరు క్షీణించడం వరుసగా ఇది ఐదవరోజు. ఈ షేరు పతనానికి ప్రత్యేక కారణాలేవీ తెలియరాలేదని, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాల ఫలితంగానే క్షీణించినట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒక దశలో 25,400

Most from this category