News


అన్ని రకాల స్టాక్స్‌లో పెట్టుబడికి అవకాశం

Monday 28th January 2019
personal-finance_main1548650072.png-23843

ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీక్యాప్‌
ఈ పథకం లార్జ్‌క్యాప్‌, మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ ఇలా అన్ని రకాల స్టాక్స్‌లోనూ ఇన్వెస్ట్‌ చేస్తుంది. అందుకు ఇది మల్టీక్యాప్‌ విభాగంలోకి వస్తుంది. దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు నిలకడగా ఉండడాన్ని గమనించొచ్చు. ఐదు, పదేళ్ల కాలంలో చూసుకుంటే బెంచ్‌ మార్క్‌ కంటే అధిక రాబడులను ఇచ్చింది. స్థిరమైన రాబడులు ఆశించే వారు ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీక్యాప్‌ ఫండ్‌ పథకాన్ని దీర్ఘకాలం ఇన్వెస్టింగ్‌ కోసం పరిశీలించొచ్చు.

పనితీరు
ఈ పథకం గడిచిన ఏడాది కాల పనితీరు ప్రామాణిక సూచీ కంటే మెరుగ్గా ఉంది. ఏడాది కాలంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీక్యాప్‌ పథకం నికరంగా నష్టాలనే ఇచ్చింది. మైనస్‌ 4.62శాతంగా ఉన్నాయి. 2018లో మార్కెట్ల పనితీరు నిరాశాజనకంగా ఉన్న విషయం గమనార్హం. కానీ, ఇదే కాలంలో ఈ పథకం పనితీరుకు ప్రామాణికంగా భావించే బీఎస్‌ఈ 500 రాబడులు కూడా మైనస్‌ 7.12 శాతంగా ఉండడం గమనార్హం. మూడేళ్ల కాలంలో అయితే, ఈ పథకంలో రాబడులు 13.27 శాతంగా ఉంటే, బీఎస్‌ఈ 500 రాబడులు 14.42 శాతంగా ఉన్నాయి. ఐదేళ్ల కాలంలో బీఎస్‌ఈ 500 రాబడులు 14.51 శాతం, పదేళ్ల కాలంలో 17.13 శాతంగా ఉండగా, ఈకాలంలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మల్టీక్యాప్‌ 16.51 శాతం, 18.45 శాతం చొప్పున రాబడులు ఇచ్చింది. దీర్ఘకాలంలో బీఎస్‌ఈ 500కు మించి రాబడులను ఇచ్చినట్టు తెలుస్తోంది. అందుకే స్వల్ప కాలం కోసం కాకుండా ఐదేళ్లు, అంతకుమించి ఎక్కువ కాలం కోసం ఈ పథకాన్ని పరిగణనలోకి తీసుకోవచ్చు.

పెట్టుబడుల తీరు
ఈ పథకం తన పెట్టుబడుల్లో దాదాపు 95 శాతం నుంచి 100 శాతం వరకు ఈక్విటీల్లోనే ఇన్వెస్ట్‌ చేస్తుంది. అస్థిరతల సమయాల్లో నగదు నిల్వలు పెంచుకుంటుంది. 2015, 2016 సంవత్సరాల్లో బెంచ్‌ మార్క్‌లను మించి రాబడులను ఇవ్వగా, 2017లో మాత్రం వెనుకబడింది. సాఫ్ట్‌వేర్‌, హెల్త్‌కేర్‌ కంపెనీల్లో ఎక్కువ పెట్టుబడులే ఇందుకు కారణం. ఆ ఏడాదిలో ఈ రెండు రంగాల స్టాక్స్‌ ర్యాలీ చేయలేదు. 2018 జనవరి నుంచి సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పెట్టుబడులను పెంచుకోవడం, ఈ స్టాక్స్‌ ర్యాలీ చేయడంతో ఈ పథకం ఎన్‌ఏవీ రికవరీ అయింది. బ్యాంకులు, ఫైనాన్షియల్‌ రంగ స్టాక్స్‌కు ఈ పథకం ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. వీటిల్లో సుమారు 34 శాతం మేర పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత ఇంధన రంగ స్టాక్స్‌లో సుమారు 19 శాతం మేర పెట్టుబడులు ఉన్నాయి. టెక్నాలజీ, ఎఫ్‌ఎంసీజీ, ఆటోమొబైల్‌ రంగాలకు సమారు 9 శాతం చొప్పున పెట్టుబడులు కేటాయించడాన్ని గమనించొచ్చు. అతుల్‌ పటేల్‌, శంకరన్‌ నరేన్‌ ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నారు. వ్యాపార పరంగా అధిక నాణ్యత, వృద్ధి అవకాశాలున్న స్టాక్స్‌ను ఎంచుకుని ఇన్వెస్ట్‌ చేయడం చేస్తుంటారు. ముఖ్యంగా ఈక్విటీల్లో భారీ రిస్క్‌ వద్దనుకునే వారికి ఈ పథకం అనుకూలంగా ఉంటుంది.



You may be interested

ఈ రెండు షేర్లూ కొనవచ్చు.

Monday 28th January 2019

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌    కొనచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ.2,096 టార్గెట్‌ ధర: రూ.2,500 ఎందుకంటే: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. రుణ వృద్ధి జోరుగా ఉండటం, ఇతర ఆదాయం మెరుగుపడటంతో నికర లాభం 20 శాతం వృద్ధితో రూ.5,590 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 22 శాతం పెరిగి రూ.12,570 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్‌ నిలకడగా

నష్టాల్లోకి జారుకున్న మార్కెట్‌

Monday 28th January 2019

సెన్సెక్స్‌ 220 పాయింట్లు, నిఫ్టీ 70 పాయింట్లు డౌన్‌ సోమవారం పాజిటివ్‌గా ప్రారంభమైన మార్కెట్‌ కొద్ది నిముషాల్లోనే నష్టాల్లోకి జారుకుంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ట్రేడింగ్‌ ప్రారంభంలో 36124 పాయింట్ల గరిష్టస్థాయికి చేరిన తర్వాత అరగంటకే 220 పాయింట్లు నష్టపోయింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10804 పాయింట్ల గరిష్టస్థాయి నుంచి 10710 పాయింట్ల కనిష్టస్థాయికి పతనమయ్యింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఈ సూచీ 70 పాయింట్లు పడిపోయింది. వ్యవసాయ ప్యాకేజీని కేంద్రం ప్రకటిస్తుందన్న వార్తలు, బడ్జెట్లో

Most from this category