STOCKS

News


పెట్టుబడికి ముందే?

Saturday 6th October 2018
personal-finance_main1538803355.png-20918

సాక్షి, హైదరాబాద్‌: రోజురోజుకూ డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ క్షీణిస్తుండటంతో ప్రవాసులు రియల్టీ వైపు మళ్లుతున్నారు. నివాస సముదాయాల్లో కంటే వాణిజ్య, రిటైల్‌ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారని ఓ కన్సల్టెన్సీ సర్వేలో తేలింది. మరి, ఇలాంటి సమయంలో వాణిజ్య సముదాయల్లో పెట్టుబడులు పెట్టేముందు ఎలాంటి అంశాలను గమనించాలనే విషయంపై నిపుణులు సూచనలివిగో..
♦ నివాస సముదాయాల్లో పెట్టుబడులు 2–4 శాతం అద్దె గిట్టుబాటైతే.. వాణì జ్య సముదాయాల్లో మాత్రం ఇది 8–11 శాతం వరకుంటుంది. అందుకే ప్రవాసులు, హెచ్‌ఎన్‌ఐలు, పెట్టుబడిదారులు ఎవరైనా సరే వాణిజ్య విభాగంలో ఇన్వెస్ట్‌మెంట్‌కు ఆసక్తి చూపిస్తుంటారు. 
♦ వాణిజ్య సముదాయల్లో స్థలం కొన్న తర్వాత దాన్ని అమ్ముకోగానే మెరుగైన ఆదాయం గిట్టుబాటవుతుంది. ఇదొక్కటే కాదు ప్రతినెలా ఆశించిన స్థాయిలో అద్దె కూడా లభిస్తుంది. కాకపోతే అన్ని విధాల అభివృద్ధికి ఆస్కామున్న చోట నిర్మితమయ్యే వాణిజ్య కట్టడాల్లో స్థలం తీసుకోవాలి. కాకపోతే పెట్టుబడి పెట్టే ముందు ప్రతి అంశాల్ని క్షుణ ్నంగా పరిశీలించాకే తుది నిర్ణయానికి రావాలి.
♦ వాణిజ్య భవనాల్లో స్థలం తీసుకోవడం మెరుగైన నిర్ణయం అయినప్పటికీ ఇందులో పెట్టుబడి పెట్టడం ఆషామాషీ వ్యవహారం కాదు. అధ్యయనం, ముందుచూపు, ప్రణాళిక.. ఈ మూడు ఉంటేనే వీటిలో మదుపు చేయాలి. ఒక ప్రాంతంలో కట్టే వాణిజ్య సముదాయంలో స్థలం కొనడానికి వెళ్లే ముందు ఆయా స్థలానికి గిరాకీ ఉంటుందా లేదా అనే విషయాన్ని పక్కాగా అంచనా వేయాలి. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మీరు కొనే భవనానికి ప్రజలు వచ్చే అవకాశముందా అనే విషయాన్ని బేరీజు వేయాలి.
♦ భవనాన్ని నిర్మించే డెవలపర్‌ గత చరిత్రను గమనించాలి. ఆయా సముదాయానికి ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో ఉందా? భవన నిర్వహణ సక్రమంగా ఉంటుందా లేదా అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలి. ఇలాంటి భవనాల్లో నిర్వహణ మెరుగ్గా ఉంటేనే గిరాకీ ఉంటుంది.
♦ మీరు వాణిజ్య స్థలం కొనాలనుకున్న ప్రాంతం భవిష్యత్తులో అభివద్ధి చెందడానికి అవకాశముందా? ఉద్యోగావకాశాలు పెరగానికి ఆస్కాముందా? ఆయా ప్రాంతంలో జనాభా పెరుగుతుందా వంటి అంశాల్ని గమనించాలి.
♦ మీరు కొనాలని భావించే స్థలం వాణిజ్య సముదాయంలో ఎక్కడుంది? సందర్శకులకు నేరుగా కనిపిస్తుందా? స్థలం ముందు భాగాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దారా? ఇలాంటి విషయాల్ని కూడా తప్పకుండా చూడాలి.
♦ వాణిజ్య సముదాయంలో స్థలం కొనాలన్న నిర్ణయానికి వచ్చేముందు.. నెలసరి నిర్వహణ సొమ్ము ఎంత? ఆస్తి పన్ను, భవనం భీమా వంటివి కనుక్కోవాలి. ఖాళీ లేకుండా ఉండేలా చేసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మనం కోరుకున్న రాబడి గిట్టుబాటవుతుంది.
 You may be interested

ఈ రెండు స్టాక్స్‌పై సెంట్రమ్‌ బుల్లిష్‌

Saturday 6th October 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ సెంట్రమ్‌ తాజాగా రెండు స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. అవేంటో ఒకసారి చూద్దాం..  స్టాక్‌: ఐసీఐసీఐ బ్యాంక్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.307 టార్గెట్‌ ప్రైస్‌: రూ.360 అప్‌సైడ్‌: 14 శాతం సెం‍ట్రమ్‌.. ఐసీఐసీఐ బ్యాంక్‌పై పాజిటివ్‌గా ఉంది. చందా కొచర్‌ తక్షణ నిష్క్రమణ, ఐదేళ్ల కాలానికి గానూ బ్యాంక్‌ ప్రస్తుత సీవోవో సందీప్‌ బక్షిని కొత్త ఎండీ, సీఈవోగా ప్రమోట్‌ చేయడం వంటి అంశాల వల్ల నాయకత్వ అంశంపై తలెత్తిన

టెకీ నిర్మాణాలొచ్చేశాయ్‌!

Saturday 6th October 2018

 సాక్షి, హైదరాబాద్‌: పునాది, శ్లాబ్, గోడలు, రంగులు, అలంకరణ సామగ్రి.. సంప్రదాయ పద్ధతిలో ఇంటి నిర్మాణమంటే ఇదే! కానీ, నిర్మాణ రంగంలో టెక్నాలజీ ఎంట్రీ అయ్యాక.. పునాదుల నుంచి నిర్మాణ పూర్తయ్యే వరకూ ప్రతి దశలోనూ సాంకేతికత చేరింది. వేగం, నాణ్యతతో పాటూ నిర్మాణ వ్యర్థాల విడుదల, వ్యయం, కార్మికుల వినియోగం తగ్గింపే టెక్నాలజీ వినియోగం ప్రధాన ఎజెండా. ప్రస్తుతం దేశీయ రియల్టీ రంగంలో టెక్నాలజీ వినియోగం పెరుగుతుంది. వినూత్న డిజైన్స్, నిర్మాణ

Most from this category