STOCKS

News


అధిక ధర కావాలంటే?

Saturday 8th December 2018
personal-finance_main1544242696.png-22762

సాక్షి, హైదరాబాద్‌: మనం కొన్న స్థలానికి లేదా ఇంటికి భవిష్యత్తులో మంచి ధర రావాలంటే? అభివృద్ది చెందడానికి ఆస్కారమున్న ప్రాంతాన్ని.. పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు వంటి సౌకర్యాలకు చేరువలో ప్రాపర్టీ ఉండేలా చూసుకోవాలి.
సొంతింటి విషయానికొస్తే మనకేం కావాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉండాలి. చూడటానికి ఇల్లు ఎలా ఉంది? అందులోని సదుపాయాలు, చుట్టుపక్కల ప్రాంతం మౌలిక వసతులు ఉన్నంత మాత్రానే మంచి ఇల్లు అని అనుకోలేం. వీటితో పాటూ మరికొన్ని అంశాల్ని పరిశీలించాల్సి ఉంటుంది.
ఒక ఇంటి అంతిమ విలువ రెండు రకాలుగా ఆధారపడుతుంది. ప్రస్తుతం నివసించడానికి సౌకర్యాలన్నీ ఉన్నాయా? ఒకేవేళ భవిష్యత్తులో అమ్మితే మంచి ధర వస్తుందా? ఈ రెండు అంశాలు ముఖ్యం. ఉదాహరణకు చేరువలో షాపింగ్‌ మాల్‌ లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూల్, ఆసుపత్రి, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేవా అనేవి చూడాలి. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించొచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూల్‌ అవసరముండకపోవచ్చు. కాకపోతే ఇల్లు అమ్మాలనుకున్నప్పుడు మాత్రం ఇదే అంశం కీలకమని గుర్తుంచుకోండి. ప్రజా రవాణా వ్యవస్థ, పోస్టల్‌ సదుపాయాలు వంటివి కూడా ప్రధానమైనవే.
పెరిగేది ఎప్పుడు?
ఇళ్లు, స్థలాల రేట్లు ఒకే విధంగా పెరగవు. మనం స్థలం కొన్న ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే ఫ్లాట్ల రేట్లు పెరుగుతాయని గుర్తుంచుకోండి. వీటితో పాటు నివసించడానికి కావాల్సిన సౌకర్యాలు పెరిగితేనే ఆయా ప్రాంతంలో ఇళ్ల ధరలు రెట్టింపవుతాయి. ఆరంభంలోనే మంచి ప్రాంతాన్ని ఎంచుకుంటే అక్కడ అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంటే గనక.. ఇంటి విలువకు రెండు, మూడేళ్లకే రెక్కలొస్తాయి. అక్కడి అభివృద్ధి చూసి చాలా మంది ఇళ్లను కొనడానికి అవకాశముండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇల్లు కొనే ప్రతి ఒక్కరూ తమ సౌకర్యాల్నే చూసుకోకూడదు. భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కారు లేదా బైక్‌ ఉన్నప్పటికీ ప్రజా రవాణా వ్యవస్థ అవసరమం ఉండకపోవచ్చు. ఈ–మెయిల్స్, కొరియర్ల యుగంలో పోస్టాఫీసు అనవసరం కావచ్చు. కానీ, ఇవే అంశాలు ఇతరులకు ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చేరువలో షాపింగ్‌ మాల్‌ ఉందనుకోండి.. వారాంతంలో బయటికి షికారు వెళ్లడానికి ఆసక్తి చూపకపోవచ్చు. కానీ, భవిష్యత్తులో ఇదే ప్రాంతంలో ఇల్లు కొనేవారికి ఇది కీలకమవుతుంది. 
కీలకమైనవి ఇవే..
► గేటెడ్‌ కమ్యూనిటీలో సరైన సదుపాయాలుంటేనే ఇంటి విలువ రెట్టింపు అవుతుంది.
► షాపింగ్, వినోదం, ఆరోగ్యం, రవాణా సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి.
► భవిష్యత్తులో మంచి ధర రావాలంటే పాఠశాలలు, ఆసుపత్రులుండాలి.
► చుట్టుపక్కల గల మౌలిక సదుపాయాలు మీ ఇంటి ధరపై ప్రభావం చూపుతాయి.You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ నష్టాల ముగింపు..

Saturday 8th December 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో శుక్రవారం రాత్రి నష్టాలతో ముగిసింది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 91 పాయింట్ల నష్టంతో 10,647 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 10,735 పాయింట్లతో పోలిస్తే 88 పాయింట్ల నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల దేశీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి అనూహ్య పరిస్థితులు తలెత్తకపోతే నిఫ్టీ సోమవారం నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. మరోవైపు ఆసియా ప్రధాన

వినసొంపైన సోఫా!

Saturday 8th December 2018

సాక్షి, హైదరాబాద్‌: సోఫాలంటే మనకు తెలిసింది కూర్చోవటానికి, పడుకోవటానికి పనికొచ్చేవే. కానీ, మార్కెట్లో ఆధునికమైన, విలాసవంతమైన సోఫాలు కూడా లభ్యమవుతున్నాయి.ముఖ్యంగా ఇటాలియన్‌ రకాల సోఫాలకు ఆదరణ పెరుగుతోంది.  – ఆధునిక ఫర్నీచర్‌ను నగరవాసులు అక్కున చేర్చుకుంటున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఈ సోఫాల్లో లైట్లు వెలుగుతాయి. స్పీకర్లుంటాయి. దీంతో చక్కని సంగీతాన్ని వినొచ్చు. సెల్‌ఫోన్లను చార్జింగ్‌ కూడా పెట్టుకోవచ్చు. చిన్న బార్‌ కౌంటర్‌ కూడా ఉంటుంది. మీట నొక్కితే చాలు సోఫా

Most from this category