STOCKS

News


ఈ ఏడాది 25 శాతం అధికంగా ఇళ్ల విక్రయాలు

Monday 17th December 2018
personal-finance_main1545035342.png-23000

న్యూఢిల్లీ: దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది 25 శాతం పెరిగి 3.1 లక్షల యూనిట్లుగా ఉండొచ్చని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ ప్రాప్‌ టైగర్‌ తెలిపింది.  నోట్ల రద్దు, రెరా చట్టాల రాకతో గతేడాది ఇళ్లు విక్రయాలపై తీవ్రంగా ప్రభావం పడిన విషయం తెలిసిందే. ‘‘ఇళ్ల విక్రయాల్లో క్షీణతకు బ్రేక్‌ పడిందని, కనిష్ట స్థాయి నుంచి బయటకు వచ్చింది. రెరా చట్టం కింద గడువులోపల నిర్మాణం చేయాల్సిన దృష్ట్యా, ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టులు పూర్తయ్యే రేటు కూడా మెరుగుపడింది. కొత్త ఇళ్ల సరఫరా మాత్రం ఈ ఏడాది తగ్గింది. కేవలం 1.9 లక్షల కొత్త యూనిట్ల నిర్మాణం ప్రారంభమైంది. గతేడాదితో పోలిస్తే 22 శాతం తక్కువ. ముంబై మెట్రోపాలిన్‌ ప్రాంతంలో 2018లో అమ్మకాలు లక్ష యూనిట్లకు పైగా ఉంటాయి. గతేడాది కంటే 34 శాతం ఎక్కువ. పుణె నగంరలోనూ గతేడాదితో పోలిస్తే ఇళ్ల విక్రయాలు 47 శాతం ఎక్కువగా ఉంటాయి. దక్షిణాదిలోని ‍ప్రధాన నగరాల్లోనూ ఇళ్ల అమ్మకాల్లో రికార్డు స్థాయి పెరుగుదల ఉంటుంది’’ అని ప్రాప్‌ టైగర్‌ తెలిపింది. 



You may be interested

ప్రభుత్వరంగ బీమా సంస్థల విలీనానికి ఈవై సూచనలు

Monday 17th December 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని మూడు అన్‌లిస్టెడ్‌ సాధారణ బీమా సంస్థల విలీనంపై సూచనలు చేసేందుకు ఈవై సంస్థ ఎంపికైంది. నేషనల్‌ ఇన్సూరెన్స్‌, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీలను కేంద్రం విలీనం చేయనున్న విషయం తెలిసిందే. ఈ సంస్థల పునర్‌వ్యవస్థీకరణ, ఉద్యోగుల క్రమబద్ధీకరణ, నిర్వరహణపరమైన అంశాలు, నియంత్రణ సంస్థలు, నిబంధనల అమలు విషయాల్లో ఈవై సూచనలు చేయనుంది. 

చర్చల పురోగతి సంకేతాలు..

Monday 17th December 2018

న్యూఢిల్లీ: వాణిజ్య యుద్ధభయాలతో ప్రపంచ మార్కెట్లను బెంబేలెత్తించిన అమెరికా-చైనాల మధ్య చర్చలు ఫలింవచ్చని ఇన్వెస్టర్లలో ఆశాభావం పెరుగుతోంది. వివాదాల పరిష్కారానికి రెండు దేశాల మధ్య కుదిరిన 90 రోజుల సయోధ్య ఒప్పందంపై చర్చలు పురోగమిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు చెబుతున్నారు. చైనా టెలికం దిగ్గజం హువావే సీఎఫ్‌వో మింగ్‌ కెనడాలో అరెస్టయినప్పటికీ .. రెండు పక్షాల నుంచి పరస్పరం రెచ్చగొట్టుకునే ప్రకటనలేమీ లేకపోవడం ఇందుకు నిదర్శనమని వారు అభిప్రాయపడ్డారు. ఈ

Most from this category