News


విక్రయాల్లో వృద్ధి.. ప్రారంభాల్లో క్షీణత!

Saturday 20th October 2018
personal-finance_main1540011096.png-21313

సాక్షి, హైదరాబాద్‌:
తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) ప్రభావం మొదలైంది. కొత్త గృహాల ప్రారంభాలపై వీటి ప్రభావం ప్రత్యక్షంగా పడుతోంది. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), రెరా.. ప్రతికూలతలతో హైదరాబాద్‌లో కొత్త గృహాలు ప్రారంభాలు తగ్గిపోయాయి. పైగా ఎన్నికల వాతావరణమూ నెలకొనడంతో కొత్త ప్రాజెక్ట్‌ల ప్రారంభాల కంటే.. పాత ప్రాజెక్ట్‌ల నిర్మాణంపైనే డెవలపర్లు దృష్టిసారిస్తున్నారు.
ఈ ఏడాది రెండో త్రైమాసికం (క్యూ2)తో నగరంలో 5,225 కొత్త గృహాలు ప్రారంభం కాగా.. మూడో త్రైమాసికం (క్యూ3) నాటికవి 25 శాతం క్షీణతతో 4,150లకు తగ్గిపోయాయి. ఇక, విక్రయాలను పరిశీలిస్తే.. క్యూ2లో 4,750 గృహాలు అమ్ముడుపోగా.. క్యూ3 నాటికి 2 శాతం వృద్ధితో 4,850లకు పెరిగాయని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ చైర్మన్‌ అనూజ్‌ పూరీ తెలిపారు.
ప్రారంభాల్లో 3 శాతం, అమ్మకాల్లో 9 శాతం వృద్ధి..
దేశంలోని ఏడు ప్రధాన నగరాలైన ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, బెంగళూరు, పుణె, కోల్‌కత్తా, హైదరాబాద్‌లల్లో క్యూ3లో 52,150 కొత్త గృహాలు ప్రారంభమయ్యాయి. క్యూ2లో ఇవి 50,600లుగా ఉన్నాయి. విక్రయాలు క్యూ2లో 61,550 యూనిట్లు కాగా.. క్యూ3 నాటికి 67,175లకు పెరిగాయి. అంటే దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో త్రైమాసికం వ్యవధిలోనే కొత్త గృహాల ప్రారంభాల్లో 3 శాతం, అమ్మకాల్లో 9 శాతం వృద్ధి నమోదైదన్నమాట.
– కొత్త గృహాల్లోనూ 76 శాతం ప్రారంభాలు ముంబై, పుణె, బెంగళూరు, చెన్నైల్లోనే జరిగాయి. రూ.40 లక్షల లోపు ఉన్న గృహాలు 42 శాతం ఉంటే, రూ.40–80 లక్షల లోపు ఉన్న గృహాలు 33 శాతం, లగ్జరీ, అల్ట్రా లగ్జరీ గృహాలు 25 శాతం వరకున్నాయి.
నగరాల వారీగా ప్రారంభాలు చూస్తే..
ఈ ఏడాది క్యూ2లో ఎన్‌సీఆర్‌లో 8,475 యూనిట్లు ప్రారంభమైతే.. క్యూ3 నాటికి 50 శాతం క్షీణతతో 4,200కు తగ్గాయి. ముంబైలో క్యూ2లో 14 వేల గృహాలొస్తే.. క్యూ3 నాటికి 42 శాతం వృద్ధితో 19,850లకు పెరిగాయి. బెంగళూరులో క్యూ2లో 8,775 నుంచి క్యూ3లో 18 శాతం క్షీణతతో 7,175కు తగ్గాయి. పుణెలో క్యూ2లో 7,075 నుంచి క్యూ3లో 11 శాతం వృద్ధితో 7,875 యూనిట్లకు, చెన్నైలో క్యూ2లో 4,200ల నుంచి క్యూ3లో 15 శాతం వృద్ధితో 4,850లకు, కోల్‌కత్తాలో క్యూ2లో 2,550 నుంచి క్యూ3లో 59 శాతం వృద్ధితో 4,050 గృహాలకు పెరిగాయి.
అమ్మకాలను పరిశీలిస్తే..
ఎన్‌సీఆర్‌లో క్యూ2లో 11,150 గృహాలు అమ్ముడుపోగా.. క్యూ3 నాటికి 2 శాతం వృద్ధితో 11,350లకు పెరిగాయి. ముంబైలో 15,750 నుంచి 18,200లకు, బెంగళూరులో 14,800 నుంచి 16,250లకు, పుణెలో 8,375 నుంచి 9,300లకు, చెన్నైలో 2,700 నుంచి 2,925లకు, కోల్‌కత్తాలో 4,025 నుంచి 4,300లకు పెరిగాయి.



You may be interested

జీఎస్‌టీ లేకుండా ఇల్లు కొంటారా?

Saturday 20th October 2018

సాక్షి, హైదరాబాద్‌:  దేశంలో రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) అమల్లోకి వచ్చాక కొత్త ప్రాజెక్ట్‌లను ప్రారంభించడం కంటే పాత నిర్మాణాలను పూర్తి చేయడం మీదే నిర్మాణ సంస్థలు దృష్టిసారిస్తున్నాయి. దీంతో గృహ ప్రవేశానికి రెడీగా ఉన్న గృహాలు పెరిగాయి. కొనుగోలుదారులు లేదా పెట్టుబడిదారులు ఎవరైనా సరే.. నిర్మాణంలో ఉన్న గృహాలు కొనడం బెటరా? లేక రెడీగా ఉన్నవి కొనడం ఉత్తమమా? అంటే కచ్చితంగా గృహ ప్రవేశానికి రెడీగా ఉన్న ప్రాజెక్ట్‌ల్లోనే

డిజిటల్‌ మార్కెటింగ్‌ అడ్డా!

Saturday 20th October 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ప్రస్తుతం విద్యా, వైద్యం, వినోదం ఏ రంగంలోనైనా సరే డిజిటల్‌ మార్కెటింగ్‌ ప్రధానంగా మారింది. కంపెనీ అభివృద్ధి, ఉత్పత్తుల ప్రచారంలో ఇతర మాధ్యమాల మార్కెటింగ్‌ కంటే డిజిటల్‌ మార్కెటింగ్‌ ముందున్నదనేది ఎవరూ కాదనలేని వాస్తవం. అందుకే దీన్ని వ్యాపార వేదికంగా ఎంచుకుంది ‘డిజిటల్‌ అకాడమీ 360’. కేంద్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన ఈ సంస్థ గురించి మరిన్ని వివరాలు సంస్థ ఫౌండర్‌ యోగేష్‌ ‘స్టార్టప్‌ డైరీ’తో

Most from this category