STOCKS

News


బంగారంపై బుల్లిష్‌!

Saturday 11th May 2019
personal-finance_main1557575011.png-25689

అగ్రరాజ్యాల మధ్య వాణిజ్యయుద్ధం సమసేలా కనిపించడం లేదు. దీంతో మదుపరులు క్రమంగా రిస్కు ఎక్కువున్న అసెట్స్‌ నుంచి రిస్కు తక్కువుండే బంగారం లాంటి ఆస్తుల వైపు మరలుతున్నారు. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో రికవరీ ఆరంభమైంది. మరోవైపు యూఎస్‌ వాణిజ్యలోటు మార్చిలో స్వల్పంగా పెరిగింది. యూఎస్‌ దిగుమతుల్లో 1.1 శాతం పెరుగుదల ట్రేడ్‌లోటుకు కారణమయింది. ఇంకోవైపు యూరోపియన్‌ కమీషన్‌ తన వృద్ధి అంచనాలను తగ్గించింది. జర్మనీ ప్రగతి అంచనాలను కూడా ఈయూ కట్‌ చేసింది. ట్రేడ్‌ ఉద్రిక్తతలు పెరగడం భవిష్యత్‌ను మరింత భయానకంగా మారుస్తున్నాయని హెచ్చరించింది. ఈ పరిస్థితులన్నీ బంగారానికి అనుకూలంగా మారుతున్నాయి. ప్రపంచ బంగారం సమాఖ్య గణాంకాల ప్రకారం అంతర్జాతీయంగా గోల్డ్‌ ఈటీఎఫ్‌లు స్వల్పంగా తగ్గాయి. గతేడాది గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి నిధుల ప్రవాహం బాగా తగ్గింది. దీంతో బంగారం ధర పతనం చూసింది. ఇప్పుడు ఈ ఈటీఎఫ్‌లు క్రమంగా రికవరీ చెందే సంకేతాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా కేంద్రబ్యాంకులు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నాయి. 2019 తొలి త్రైమాసికంలో కేంద్రబ్యాంకుల బంగారం కొనుగోలు 68 శాతం పెరిగినట్లు ప్రపంచ బంగారం సమాఖ్య తెలిపింది. మందగమన భయాలతోనే బ్యాంకులు బంగారం రిజర్వులు పెంచుకుంటున్నాయి. దీంతో త్వరలో బంగారం ధర దూసుకుపోయే ఛాన్సులు ఎక్కువయ్యాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయంలో గోల్డ్‌లో లాంగ్స్‌ పరిశీలించవచ్చని సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గతేడాది ఇదే సమయంతో పోలిస్తే బంగారానికి డిమాండ్‌ 7 శాతం పెరిగింది. జువెలరీలో డిమాండ్‌ 1 శాతం పెరిగింది. ట్రేడ్‌ చర్చల ఫలితాలను బట్టి ఇకపై బంగారం ధరలో కదలికలుంటాయి. 

కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు ఇలా ఉన్నాయి..



You may be interested

సంపద సృష్టికి ముఖ్యమైనవి ఏవి?

Monday 13th May 2019

గత ఏడాదిన్నరగా మార్కెట్లలో అస్థిరతలు పెరిగిపోయాయి. ముఖ్యంగా గత ఆరు నెలల్లో ఇవి మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లకు దూరంగా ఉండాలా లేక కొనసాగాలా అనే సందేహం చాలా మందిలో నెలకొందనడంలో సందేహం లేదు. స్వల్ప కాలంలో మంచి రాబడులు వచ్చినప్పటికీ దీర్ఘకాలం కోసం వేచి చూడాలా? లాభాలను మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి బ్యాంకు ఎఫ్‌డీలకు ఎందుకు మార్చుకోకూడదు? అన్న ప్రశ్నలకు... తక్కువ లాభాలు గడించినప్పుడు లేదా మార్కెట్లు

కోలుకున్న యూఎస్‌ మార్కెట్!

Saturday 11th May 2019

ట్రంప్‌ ట్రేడ్‌ దెబ్బకు కకావికలమైన అమెరికా స్టాక్‌ మార్కెట్‌ శుక్రవారం కాస్త కోలుకుంది. నాలుగు రోజుల వరుస నష్టాలకు చెక్‌ చెప్పి లాభాల్లో ముగిసింది. చైనాతో వాణిజ్య చర్చలు నిర్మాణాత్మకంగా జరుగుతున్నాయని యూఎస్‌ ట్రెజరీ సెక్రటరీ స్టీవెన్‌ మ్యుచిన్‌, అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడం మార్కెట్లకు ఊరటనిచ్చింది. దీంతో ఒకదశలో 1.5 శాతం మేర పతనమైన సూచీలు క్రమంగా కోలుకొన్నాయి. అయితే తాజా చర్చల అనంతరం కొత్త చర్చలకు ఎలాంటి

Most from this category