STOCKS

News


ఇన్వెస్ట్‌మెంట్‌కు ముందు ఇవి చెక్‌ చేసుకోండి..

Saturday 1st September 2018
personal-finance_main1535804129.png-19886

దురాశకు పోకుండా జాగ్రత్త వహిస్తే మార్కెట్లో సిరుల పంట ఖాయమని నిపుణులు భరోసా ఇస్తున్నారు. ఈక్విటీల్లో కాలు మోపేముందు కొన్ని అంశాలు చెక్‌ చేసుకోవాలని, అప్పుడే నష్టపోకుండా లాభాల్లో పయనిస్తామని సూచిస్తున్నారు.
నిధులున్నాయా?: నగదునిల్వలు, ఫ్రీ క్యాష్‌ ప్రవాహం లేని కంపెనీలు ఎంత మంచివైనా వాటి జోలికి పోకుండా ఉత్తమం. ఫ్రీక్యాష్‌ ప్రవాహం ఉన్న కంపెనీలే కొత్త పెట్టుబడులు పెట్టి వ్యాపార విస్తరణ చేపడతాయి. 
పూర్తిగా తెలుసుకోండి: ఎంపిక చేసుకున్న కంపెనీ చేస్తున్న వ్యాపారంపై సరైన అవగాహన లేకుండా ఆ కంపెనీ స్టాకులను కొనుగోలు చేయడం మంచిది కాదు.
టెక్నికల్స్‌ తప్పనిసరి: కొంతమంది కంపెనీ వ్యాపారం గురించి అధ్యయనం చేసి మరీ పెట్టుబడి పెడతారు. అయినా నష్టాలు తప్పవు. అందువల్ల కంపెనీ చేసే వ్యాపారం గురించి అధ్యయనం చేసినా, సరైన టెక్నికల్‌ అధ్యయనం చేయకుండా కంపెనీ షేరు కొనగూడదు. 
పెన్నీ స్టాకులు దెబ్బతీస్తాయ్‌: మల్టీబాగర్లుగా మారతాయని చాలామంది పెన్నీస్టాకులపై కన్నేస్తారు. కానీ బుల్‌మార్కెటో‍్ల పెన్నీస్టాకులు వద్దని నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా నమ్మకంలేని ప్రమోటర్లున్న కంపెనీల స్టాకులను కూడా దూరంగా ఉంచడం మంచిది.
లాభాలు పూర్తిగా రానివ్వండి: నాణ్యమైన షేరును ఎంచుకొన్నప్పటికీ కొందరు స్వల్పలాభం రాగానే అమ్మేస్తారు. కంపెనీ పునాదులు బలంగా ఉన్న షేర్లను తొందరపడి అమ్మకుండా అట్టిపెట్టుకోవడం మంచిదని నిపుణుల సూచన. ఇవి దీర్ఘకాలంలో మంచి రాబడులు ఇస్తాయి. 
స్టాప్‌లాస్‌ తప్పనిసరి: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మార్కెట్‌ మాయాజాలంలో ఒక్కోసారి అంచనాలన్నీ తలకిందులవుతుంటాయి. అందుకని ఏ షేరుకైనా స్టాప్‌లాస్‌ తప్పనిసరిగా మెయిన్‌టెయిన్‌చేయాలి. పరిస్థితులు ప్రతికూలించిన సమయంలో స్టాప్‌లాస్‌ ట్రిగ్గర్‌ కాగానే అమ్మేయడం చాలా అవసరం. 

 You may be interested

ఇంకో దఫా రేట్ల పెంపు?!

Saturday 1st September 2018

ఎస్‌బీఐ నివేదిక ఫారెక్స్‌ మార్కెట్లో ఆర్‌బీఐ జోక్యం తప్పని పరిస్థితులు ప్రస్తుతం నెలకొన్నాయి. రూపాయి నానాటికీ క్షీణిస్తూపోతోంది. రూపాయిని ఆదుకునేందుకు ఆర్‌బీఐ రంగంలోకి దిగాల్సిన అగత్యం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రూపీని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఆర్‌బీఐ మరో విడత వడ్డీరేట్లను పెంచవచ్చని ఎస్‌బీఐ అంచనా వేసింది. దీనివల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ది రేటు 7.5 శాతం లోపునకు పరిమితం కావచ్చని అభిప్రాయపడింది. అనుకున్నదానికన్నా ముందే ఆర్‌బీఐ మరోమారు రేట్లను

పన్నెండు వేలకు చేరితే పారాహుషార్‌!

Saturday 1st September 2018

అప్రమత్తంగా ఉండాలంటున్న అనలిస్టులు స్టాక్‌మార్కెట్లకు సెప్టెంబర్‌ పెద్దగా కలిసిరాదని గతంలో తేలిందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఈ నెల్లో ప్రాఫిట్‌ బుకింగ్‌ నమోదవుతుందన్నారు. అందువల్ల షార్ట్‌టర్మ్‌ ట్రేడర్లు నిఫ్టీ 12వేల పాయింట్లకు చేరితే చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. 12వేల పాయింట్ల వద్ద కొత్త పొజిషన్ల జోలికి దాదాపు పోకపోవడం మంచిదని సలహా ఇచ్చారు. నిఫ్టీ 10550 పాయింట్ల స్థాయి నుంచి ప్రస్తుతం 11700 స్థాయిలకు ర్యాలీ జరిపింది. ఈ ర్యాలీకి

Most from this category