STOCKS

News


పన్ను రిటర్నుల్లో ఈ ఆదాయాన్ని విస్మరించొద్దు

Wednesday 11th July 2018
personal-finance_main1531247454.png-18194

ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారిలో చాలా మంది తమకు వచ్చే కొన్ని ఆదాయాలను రిటర్నుల్లో వెల్లడించరు. బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీ, బాండ్లు, పలు పోస్టాఫీసు పథకాలపై వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ‘ఇన్‌కమ్‌ ఫ్రమ్‌ అదర్‌ సోర్సెస్‌’ అనే సెక్షన్‌లో ఈ ఆదాయాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. కానీ రిటర్నులు దాఖలు చేసే వారిలో 80 శాతం మంది ఈ ఆదాయాన్ని చూపించకపోవడం వాస్తవ పరిస్థితిని తెలియజేస్తోంది. కనుక ఏ ఆదాయాన్ని చూపించాలి, పన్ను ఏ మేరకు అనేది ఇక్కడ తెలుసుకోవచ్చు... 

 

వేటిని వెల్లడించాలి..?

  • సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలో డిపాజిట్లపై సెక్షన్‌ 80టీటీఏ కింద రూ.10,000 వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను ఉండదు. ఆదాయం అంతకుమించి ఉంటే ఆ మేరకు రిటర్నుల్లో చూపించి శ్లాబ్‌ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 
  • ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లు, బాండ్లు, నేషనల్‌ సేవింగ్‌ సర్టిఫికెట్‌, కిసాన్‌ వికాస్‌ పత్ర, ఎన్‌సీడీల ద్వారా వచ్చే ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. పన్ను చెల్లింపుదారుడు తన వార్షికాదాయానికి ఈ ఆదాయాన్ని కూడా కలిపి చూపించాలి. ఏ శ్లాబులోకి ఆదాయం వస్తే ఆ మేరకు పన్ను చెల్లించాలి. పీపీఎఫ్‌పై పన్ను లేదు.
  • బీమా పాలసీల వార్షికీ ప్రీమియానికి కవరేజీ 10 రెట్లు ఉంటే, సెక్షన్‌ 10డీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
  • స్టాక్స్‌, ఈక్విటీ ఫండ్స్‌ ద్వారా వచ్చే స్వల్పకాలిక లాభాలపై (ఏడాది లోపు పెట్టుబడులపై) 15 శాతం పన్ను చెల్లించాలి.
  • స్టాక్స్‌, ఈక్విటీ ఫండ్స్‌పై దీర్ఘకాలిక లాభాలు (ఏడాది దాటిన పెట్టుబడులు) రూ.లక్ష వరకు పన్ను లేదు. అంతకు మించితే రూ.లక్షకు పైన లాభాలపైనే 10 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది.
  • డివిడెండ్‌ రూపంలో వచ్చే ఆదాయం వార్షికంగా రూ.10 లక్షల వరకు సెక్షన్‌ 10(34) కింద పన్ను లేదు. ఆపై ఉంటే మాత్రం ఆదాయానికి కలిపి రిటర్నుల్లో చూపించాలి. 
  • భౌతిక బంగారం, ప్రాపర్టీ, హైబ్రిడ్‌ ఫండ్స్‌, డెట్‌ పథకాలు, బంగారం ఫండ్స్‌పై స్వల్ప కాలిక లాభాలు ఉంటే ఆ మొత్తాన్ని వార్షికాదాయానికి కలిపి చూపించాలి. ఇవే పథకాలపై దీర్ఘకాలిక లాభాలు ఉంటే ఇండెక్సేషన్‌ను మినహాయించి మిగిలిన లాభంపై 20 శాతం పన్ను చెల్లించాలి.



You may be interested

ఫ్లాట్‌గా ప్రారంభమైన సెన్సెక్స్‌

Wednesday 11th July 2018

26,919 వద్ద బ్యాంక్‌ నిఫ్టీ ఒక శాతం లాభంతో ఐటీ 1.40 శాతం నష్టాల్లో నిఫ్టీ మెటల్‌ ముంబై: దేశీయ స్టాక్‌ సూచీలు బుధవారం ఉదయం నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 13 పాయింట్లు నష్టపోయి 36,226 వద్ద ప్రారంభం కాగా, నిఫ్టీ 9 పాయిం‍ట్లు నష్టపోయి 10,938 వద్ద ప్రారంభమయ్యింది. ట్రేడింగ్‌ ప్రారంభంలో నష్టాలతోనే మొదలైనప్పటికీ.. క్రమంగా పుంజుకున్న సూచీలు 9 గంటల 40 నిమిషాల సమయానికి స్వల్ప లాభాలను నమోదుచేశాయి. ఈ సమయానికి

టాటా  మోటార్స్‌ మళ్లీ వెలిగిపోతుంది: అగర్వాల్‌

Tuesday 10th July 2018

టాటా మోటార్స్‌ స్టాక్‌ ఈ ఏడాది 40 శాతం తగ్గిపోయింది. టాటా గ్రూపులో భాగమైన ఈ బ్లూచిప్‌ కంపెనీ ఇలా పడిపోవడంతో చాలా మందికి భవిష్యత్తుపై సందేహాలు తలెత్తాయి. ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి వారిలో ఉంది. అయితే, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సహ వ్యవస్థాపకుడు రామ్‌దియో అగర్వాల్‌ మాత్రం టాటా మోటార్స్‌ పతనం కేవలం ధరల పరంగా జరిగిందేనని, దాని అంతర్గత విలువ తగ్గిపోవడం వల్ల

Most from this category