STOCKS

News


దీర్ఘకాలం ఇన్వెస్ట్‌ చేయదలిస్తే...

Monday 14th January 2019
personal-finance_main1547450671.png-23569

దీర్ఘకాలం ఇన్వెస్ట్‌ చేయదలిస్తే...
ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఈక్విటీ
దీర్ఘకాలంలో స్థిరమైన పనితీరు చూపించిన పథకాల్లో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఈక్విటీ ఒకటి. మోస్తరు రిస్క్‌కు సిద్ధపడే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. 20 ఏళ్ల నుంచి ఈ పథకం పెట్టుబడులకు అందుబాటులో ఉన్నది. వార్షికంగా చూస్తే ఈ పథకం తన ప్రయాణాన్ని ప్రారంభించిన దగ్గర్నుంచి ప్రతీ ఏటా సగటున 23.9 శాతం చొప్పున ఇప్పటి వరకు రాబడులను అందించింది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోను చూస్తే... ఎన్నో స్టాక్స్‌ మధ్య పెట్టుబడులు విస్తరించి ఉంటాయి. మల్టీక్యాప్‌ విధానంలో పనిచేస్తుంది. అయినప్పటికీ ఈ పథకంలో అధిక శాతం పెట్టుబడులు లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేసి ఉన్నాయి. ఇది ఒక విధంగా పెట్టుబడుల పరంగా రిస్క్‌ తగ్గిస్తుంది. కనీసం ఐదేళ్ల కంటే ఎక్కువ కాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకునే వారు ఈ పథకాన్ని తప్పకుండా పరిశీలించొచ్చు.

రాబడులు
మూడేళ్లు, ఐదేళ్ల కాలంలో ఈ పథకం పనితీరు పరంగా బెంచ్‌ మార్క్‌ నిఫ్టీ 200ను అధిగమించింది. ఏడాది కాలంలో మాత్రం నిఫ్టీ 200 కంటే వెనుకబడింది. గత ఐదేళ్ల కాలంలో కాంపౌండెడ్‌గా వార్షికంగా 24.1 శాతం రిటర్నులు ఇచ్చింది. ఫ్రాంక్లిన్‌ ఇండియా ఈక్విటీ, డీఎస్‌పీ ఈక్విటీ, హెచ్‌డీఎఫ్‌సీ ఈక్విటీ ఫండ్స్‌ కంటే పనితీరు పరంగా ముందుంది. వార్షిక రాబడులను చూస్తే... ఏడాది కాలంలో మైనస్‌ 6 శాతం, మూడేళ్లలో 14.81 శాతం, ఐదేళ్లలో 19 శాతం, పదేళ్లలో 18.50 శాతం చొప్పున ఇచ్చింది. గత ఏడాది కాలంలో ఈక్విటీ మార్కెట్లలో ఎక్కువ స్టాక్స్‌ నష్టాల్లోనే ఉన్న విషయం తెలిసిందే. దీంతో ఈ పథకం పనితీరు ప్రతికూలంగా ఉంది. ఏడాది కాలంలో నిఫ్టీ 200 రాబడులు మైనస్‌ 2 శాతం, మూడేళ్లలో 13.88 శాతం, ఐదేళ్లలో 14.50 శాతం, పదేళ్లలో 18.50 శాతం చొప్పున ఉన్నాయి. ఒక్క ఏడాది కాలం మినహాయిస్తే దీర్ఘకాలంలో ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఈక్విటీ ఫండ్‌ తన పనితీరును నిరూపించుకుంది.

పెట్టుబడుల విధానం
మోస్తరు రిస్క్‌కే పరిమితం అవుతుంది. 70 స్టాక్స్‌పైనే పోర్ట్‌ఫోలియోలో ఉండేలా చూస్తుంది. మార్కెట్లలో అస్థిరతలు పెరిగిన సమయాల్లో నగదు నిల్వలు పెంచుకోవడం, డెట్‌ సాధనాల్లోకి పెట్టుబడులు మళ్లించడం చేస్తుంది. అటువంటి సమయాల్లో ఈ రెండింటిలో పెట్టుబడుల శాతం 5-11 శాతం మధ్య ఉంటుంది. పెట్టుబడుల పరంగా బ్యాంకులు, ఫైనాన్షియల్‌ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. అందుకే గత ఏడాది కాలంలో ఈ పథకం పనితీరు ప్రతికూలంగా ఉండేందుకు కారణం. కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ రంగానికీ అధిక ప్రాముఖ్యం ఇచ్చింది. సాఫ్ట్‌వేర్‌ స్టాక్స్‌ తక్కువ ధరలకు లభిస్తుండడంతో వాటిల్లో ఎక్స్‌పోజర్‌ పెంచుకుంది. లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌లో 67 శాతం వరకు పెట్టుబడులు ఉండగా, మిడ్‌క్యాప్‌లో 27 శాతం వరకు, స్మాల్‌క్యాప్‌లో 4 శాతం వరకు పెట్టుబడులు ప్రస్తుతం ఉన్నాయి.You may be interested

ద్రవ్యోల్బణం, క్యూ3 ఫలితాలతో దిశా నిర్దేశం..

Monday 14th January 2019

సోమవారం వెల్లడికానున్న డ‌బ్ల్యూపీఐ, సీపీఐ శుక్రవారం విదేశీ మారక నిల్వల సమాచారం వెల్లడి ఈ వారంలోనే ఆర్‌ఐఎల్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఫలితాలు ముంబై: ఐటీ దిగ్గజం టీసీఎస్‌తో ఈ ఏడాది క్యూ3 (అక్టోబర్‌–డిసెంబర్‌) ఫలితాల సీజన్‌ ప్రారంభమైంది. అయితే, ఇప్పటివరకు వెల్లడైన కంపెనీల గణాంకాలు .. సూచీలకు నూతన ఉత్సాహాన్ని ఇవ్వలేకపోయాయి. కానీ, అంతక్రితం రెండు వారాలు నష్టాల్లో ముగిసిన ప్రధాన సూచీలు.. ఫలితాల నేపథ్యంలో గతవారం పాజిటివ్‌ ముగింపును నమోదుచేశాయి. ఇక

తగ్గనున్న ఎల్‌ఐసీ ఆధిపత్యం

Monday 14th January 2019

మార్కెట్‌ వాటా 70 శాతం లోపునకు న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ మార్కెట్‌ వాటా 70 శాతం లోపునకు పడిపోయింది. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఎల్‌ఐసీ వాటా అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఉన్న 71.81 శాతం నుంచి 69.36 శాతానికి తగ్గింది. ఈ వివరాలను ఐఆర్‌డీఏ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటు బీమా సంస్థల మార్కెట్‌ వాటా 30.64 శాతానికి పెరిగింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో

Most from this category