News


వావ్‌.. త్రీడీ వాల్‌

Saturday 22nd September 2018
personal-finance_main1537593771.png-20477

సాక్షి, హైదరాబాద్‌: ప్రధాన గది, పిల్లల గది, పడక గది... ఏదైనా సరే గదిలోని ఒక వైపు గోడకు వాల్‌ పేపర్‌తో ముస్తాబు చేసుకుంటే.. మన ఇంటికొచ్చే బంధుమిత్రులు, అతిథులు వావ్‌ అంటారు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా.. వాల్‌ పేపర్లలోనూ సరికొత్త పోకడలు సంతరించుకున్నాయి. ఇందులో భాగంగానే మార్కెట్లో త్రీడీ వాల్‌ పేపర్లు హల్‌చల్‌ చేస్తున్నాయి. వీటి నిర్వహణలో కాస్త శ్రద్ధ చూపిస్తే చాలు దశాబ్ధ కాలంపాటు మన్నికగా నిలుస్తాయి. ‘అమ్మో అని రోజులూ ఒకే డిజైనా?’ అని అనుకుంటే వెంటనే డిజైన్‌ మార్చుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. 
కొత్తగా ఇలుల కొనుక్కొన్నా.. పాత ఇల్లు అయినా వాల్‌ పేపర్ల సహాయంతో ఇంటిని అందంగా అలంకరించుకోవచ్చు. మార్కెట్లో వాల్‌ పేపర్లు రోల్స్‌ రూపంలో లభ్యమవుతాయి. ఒక్క రోల్‌ కొంటే కనీసం 57 చ.అ. విస్తీర్ణానికి సరిపోతుంది. దీని ప్రారంభ ధర రూ.2 వేల నుంచి ఉంటుంది. గోడ సైజు 10 ఇంటు 10 ఉంటే కనీసం రెండు రోల్స్‌ సరిపోతాయి. గోడకు అంటించడానికి అదనపు చార్జీలుంటాయి. కనీసం రూ.400 వరకుంటుంది.
త్రీడీలో వాల్‌..
మారుతున్న అభిరుచులకు అనుగుణంగా ఇంటీరియర్‌ డిజైనర్లు ఎప్పటికప్పుడు కొత్త పోకడలను పరిచయం చేస్తున్నారు. ప్రధానంగా వాల్‌ పేపర్ల విభాగంలో త్రీడీ పేపర్స్, కస్టమైజ్డ్‌ వాల్‌ పేపర్లను మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇవి మనం కోరుకున్న డిజైన్లు, సైజుల్లో లభించడమే వీటి ప్రత్యేకత. దేవుడి బొమ్మలు, కుటంబ సభ్యుల బొమ్మలు, తమ అభిరుచులను ప్రదర్శించే బొమ్మలు వంటివి ఇంట్లోని గోడల మీద అంటించుకోవచ్చు. త్రీడీ వాల్‌ పేపర్లు సుమారు 1/1 సైజ్‌ నుంచి 20/20 సైజ్‌ దాకా లభిస్తాయి. ధర చ.అ.కు రూ.120 నుంచి వరకుంటుంది. త్రీడీ వాల్‌ పేపర్ల నిర్వహణ కూడా చాలా సులువు. మరకలు పడితే తడి గుడ్డతో తుడిస్తే శుభ్రమవుతుంది.



You may be interested

ఎంఎం ఫోర్జింగ్స్‌పై బుల్లిష్‌

Saturday 22nd September 2018

ప్రముఖ బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి తాజాగా ఎంఎం ఫోర్జింగ్స్‌ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. ఎందుకో చూద్దాం.. బ్రోకరేజ్‌: ఆనంద్‌రాఠి స్టాక్‌: ఎంఎం ఫోర్జింగ్స్‌ రేటింగ్‌: కొనొచ్చు ప్రస్తుత ధర: రూ.588 టార్గెట్‌ ప్రైస్‌: రూ.809 బ్రోకరేజ్‌ సంస్థ ఆనంద్‌రాఠి.. ఎంఎం ఫోర్జింగ్స్‌పై పాజిటివ్‌గా ఉంది. ఈ స్టాక్‌ను కొనుగోలు చేయవచ్చని సిఫార్సు చేసింది. టార్గెట్‌ ప్రైస్‌ను రూ.809గా నిర్ణయించింది. బై రేటింగ్‌ ఇచ్చింది. ఎంఎం ఫోర్జింగ్స్‌.. తను కార్యకలాపాలు అందించే విభాగంలో పెద్ద కంపెనీగా అవతరించడానికి

నగరంలో నిర్మాణ వ్యయం తక్కువే!

Saturday 22nd September 2018

సాక్షి, హైదరాబాద్‌: ఇల్లు, ఆఫీస్, షాపింగ్‌ మాల్,  హోటల్, పారిశ్రామిక గోదామ్‌.. ఏదైనా సరే హైదరాబాద్‌లో నిర్మాణ వ్యయం అత్యంత తక్కువ! వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలుతో నిర్మాణ సామగ్రి ధరల్లో స్థిరీకరణతో పాటూ పారదర్శకత నెలకొంది. దీంతో నిర్మాణ వ్యయం తగ్గిందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెన్సీ సీబీఆర్‌ఈ దక్షిణాసియా తెలిపింది. వ్యవసాయం తర్వాత అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పించే రంగం నిర్మాణ రంగం. సిమెంట్, స్టీల్‌ వంటి అనుబంధ పరిశ్రమలు

Most from this category