STOCKS

News


హైదరాబాద్‌లో 1,585 లగ్జరీ గృహాలు

Saturday 15th December 2018
personal-finance_main1544848881.png-22949

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది దేశంలో మొత్తం 12,090 లగ్జరీ గృహాలు ప్రారంభమయ్యాయి. రూ.1.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ గృహాలు హైదరాబాద్‌లో 1,585 వరకుంటాయి. ఈ ఏడాది మూడు త్రైమాసికాల్లో కలిపి అత్యధికంగా ముంబైలో 6,310 లగ్జరీ గృహాలు ప్రారంభమయ్యాయి. ఇక, మిగిలిన నగరాల్లో చూస్తే.. ఎన్‌సీఆర్‌లో 2,650, కోల్‌కత్తాలో 160, పుణెలో 100 లగ్జరీ గృహాలు ప్రారంభమయ్యాయని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ తెలిపింది.
– న్యూ వరల్డ్‌ వెల్త్‌ రిపోర్ట్‌ ప్రకారం దేశంలో 2017లో 3,30,000 మంది మిలీనియర్స్‌ ఉన్నారు. 2027 నాటికి ఈ సంఖ్య 190 శాతం వృద్ధితో 9,50,000లకు చేరుతుందని అంచనా. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది లగ్జరీ గృహాల సప్లయి 29 శాతం వృద్ధిని నమోదు చేసింది.
– స్టార్టప్‌ ఫౌండర్స్, భారీ వేతనజీవులు, ఐటీ నిపుణులు, హై నెట్‌వర్త్‌ ఇండివిడ్యువల్స్‌ (హెచ్‌ఎన్‌ఐ) ఎక్కువగా లగ్జరీ గృహ కొనుగోలుదారులు. దేశంలోని ఏడు నగరాల్లో ఇప్పటివరకు 6.87 లక్షల గృహాలు అమ్ముడుపోకుండా (ఇన్వెంటరీ) ఉంది. ఇందులో సుమారు 82,280 లగ్జరీ గృహాలుంటాయని అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ రీసెర్చ్‌ హెడ్‌ ప్రశాంత్‌ ఠాకూర్‌ తెలిపారు.
––––––––––
మైండ్‌ స్పేస్‌కు యూఎస్‌జీబీసీ గుర్తింపు
సాక్షి, హైదరాబాద్‌: మాదాపూర్‌లోని రహేజా మైండ్‌ స్పేస్‌కు అమెరికా గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (యూఎస్‌జీబీసీ) గుర్తింపు లభించింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) గుర్తింపు లభించిన విషయం తెలిసిందే. మైండ్‌ స్పేస్‌లోని 12–ఏ బిల్డింగ్‌లో ఎలక్ట్రిక్‌ చార్జీంగ్‌ స్టేషన్స్, కార్‌పూల్‌ వెహికిల్స్, వర్షపు, మురుగు నీటి నిర్వహణ వ్యవస్థ, సౌర విద్యుత్‌ వంటి హరిత నిబంధనల్లో 69 పాయింట్లు వచ్చాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 110 ఎకరాల్లో విస్తరించి ఉన్న మైండ్‌ స్పేస్‌ పార్క్‌లో మొత్తం కోటి చ.అ.ల్లో 21 వాణిజ్య భవనాలున్నాయి. దేశవ్యాప్తంగా కే రహేజా కార్ప్‌కు 1.32 కోట్ల చ.అ.ల్లో హరిత వాణిజ్య భవనాలున్నాయి.
 



You may be interested

బైబ్యాక్‌ బాటలో ఓఎన్‌జీసీ కూడా !

Saturday 15th December 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్‌ దిగ్గజం, ఓఎన్‌జీసీ షేర్ల బైబ్యాక్‌ చేయనున్నది. షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదన  పరిశీలన కోసం ఈ నెల 20న (వచ్చే గురువారం) డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం కానున్నదని ఓఎన్‌జీసీ శుక్రవారం తెలిపింది. ఓఎన్‌జీసీలో కేంద్ర ప్రభుత్వానికి 67.48 శాతం చొప్పున వాటా ఉంది.  షేర్ల బైబ్యాక్‌ బాటలో చమురు కంపెనీలు... మరో ఆయిల్‌ దిగ్గజం ఐఓసీ షేర్ల బైబ్యాక్‌ ప్రతిపాదనకు డైరెక్టర్ల ఆమోదం పొందిన  మరుసటి రోజే ఓఎన్‌జీసీ

హైదరాబాద్‌లో మానవ రహిత విమానాల తయారీ

Saturday 15th December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఏరోస్పేస్‌, డిఫెన్స్‌ రంగంలో భాగ్యనగరం సిగలో మరో కలికితురాయి చేరింది. మానవ రహిత విమానాల (యూఏవీ) తయారీకి హైదరాబాద్‌ కేంద్రం అయింది. విభిన్న రంగాల్లో ఉన్న అదానీ గ్రూప్‌... తన అనుబంధ సంస్థ అదానీ డిఫెన్స్‌ అండ్‌ ఏరోస్పేస్‌ ద్వారా ఈ రంగంలోకి అడుగుపెట్టింది. ఇజ్రాయెల్‌ దిగ్గజం ఎల్బిట్‌ సిస్టమ్స్‌తో కలిసి సంయుక్తంగా శంషాబాద్‌ సమీపంలో 20 ఎకరాల్లో అదానీ ఎల్బి్‌ట్‌ యూఏవీ కాంప్లెక్స్‌ను ఏర్పాటు

Most from this category