STOCKS

News


1 ప్రాపర్టీ రూ.180 కోట్లు!

Saturday 22nd December 2018
personal-finance_main1545451578.png-23162

సాక్షి, హైదరాబాద్‌: ఒకే ఒక్క ప్రాపర్టీ.. ధర రూ.180 కోట్లు! ప్రత్యేకంగా స్విమ్మింగ్‌ పూల్, జిమ్, స్పా, గార్డెనింగ్, హెలిప్యాడ్‌.. వంటి అన్ని రకాల అత్యాధునిక వసతులు. వీటికి తోడు కార్యాలయ, వ్యాపార కేంద్రాలకు చేరువలో లగ్జరీ గృహాలు!
.. ఇదీ క్లుప్తంగా ప్రపంచంలోనే ఖరీదైన నగరం హాంగ్‌కాంగ్‌ గురించి! ప్రపంచవ్యాప్తంలో అల్ట్రా ప్రైమ్‌ ప్రాపర్టీల ఖరీదు, అమ్మకాలు రెండింట్లోనూ హాంగ్‌కాంగే కింగ్‌. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు మధ్య కాలంలో హాంగ్‌కాంగ్‌లో 2.5 బిలియన్‌ డాలర్ల అమ్మకాలు జరిగాయని గ్లోబల్‌ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్‌ ఫ్రాంక్‌ ఎల్‌ఎల్‌పీ నివేదికలో తెలిపింది.
అంతర్జాతీయ ప్రాపర్టీ కన్సల్టెన్సీ నైట్‌ ఫ్రాంక్‌ ఎల్‌ఎల్‌పీ ఏడాదిలో కనీసం 3 లావాదేవీలు రూ.180 కోట్లు (25 మిలియన్‌ డాలర్లు) కంటే ఎక్కువ జరిగిన మార్కెట్స్‌ అల్ట్రా ప్రైమ్‌ ప్రాపర్టీలకు పరిగణించింది. అల్ట్రా ప్రైమ్‌ మార్కెట్స్‌ను నగరాలు, సెకండ్‌ హోమ్‌ డెస్టినేషన్స్, స్కై రిసార్ట్స్‌ అని మూడు రకాలుగా విభజించింది. అల్ట్రా ప్రైమ్‌ నగరాల జాబితాలో తొలి ఆరు స్థానాల్లో హాంగ్‌కాంగ్, న్యూయార్క్, లండన్, సింగపూర్, లాస్‌ ఏంజిల్స్, సిడ్నీలు నిలిచాయి. సెకండ్‌ హోమ్‌ డెస్టినేషన్స్‌లో.. అమెరికాలోని మలైబు, పామ్‌ బీచ్, ఫ్రాన్స్‌లోని కోటె డిజౌర్, మోనాకో, కరేబియన్‌ దీవులు నిలిచాయి. స్కై రిసార్ట్స్‌లో.. స్విట్జర్లాండ్‌లోని సెయింట్‌ మోర్టీజ్, గ్యాస్టాద్, ఫ్రెంచ్‌లోని కోర్చెవల్, కొలరాడోలోని అస్పెన్, కొలరాడో ప్రాంతాలున్నాయి.
6 నగరాలు; రూ.47,520 కోట్లు..
టాప్‌–6 నగరాల్లో ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు మధ్య కాలంలో 153 లావాదేవీలు రూ.180 కోట్ల కంటే ఎక్కువ విలువ ఉన్నవి జరిగాయి. ఈ 6 నగరాల్లోని అల్ట్రా ప్రైమ్‌ ప్రాపర్టీల విలువ రూ.47,520 కోట్లు (6.6 బిలియన్‌ డాలర్లు). గత రెండేళ్లుగా 12 శాతం వృద్ధి నమోదవుతుంది. 47 లావాదేవీలు, 2.5 బిలియన్‌ డాలర్లతో హాంగ్‌కాంగ్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 39 లావాదేవీలతో న్యూయార్క్, 38 ట్రాన్సాక్షన్స్‌తో లండన్‌ నిలిచాయి. ఈ రెండు నగరాల లావాదేవీల విలువ మొత్తం 1.5 బిలియన్‌ డాలర్లు.
ఏ నగరాల్లో ఎంత ధరంటే?
హాంగ్‌ కాంగ్‌: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల్లో హాంగ్‌కాంగ్‌ది నంబర్‌ 1 స్థానం. ఇక్కడ కనీస లావాదేవీ విలువ 52.8 మిలియన్‌ డాలర్లు. ప్రాపర్టీలపై తక్కువ పన్నుల, మూలధన, వారసత్వ పన్నులు లేకపోవటం వంటి కారణాలతో నివాస విభాగంలో విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తుంది. విద్యా, ఉద్యోగ అవకాశాలు, కట్టుదిట్టమైన న్యాయ వ్యవస్థ, స్థిరమైన రాజకీయ వాతావరణంతో పాటూ అంతర్జాతీయ ఆర్ధిక కేంద్రం, నివాస, వర్క్‌ ప్లేస్‌కు అనువైన ప్రాంతం వంటివి హాంగ్‌ కాంగ్‌కు అనుకూల వాతావరణం.
లండన్‌: వ్యాపార, ఆర్ధిక కార్యకలాపాలతో పాటూ సౌకర్యవంతమైన భౌగోళిక ప్రదేశం లండన్‌ ప్రత్యేకతలు. కనీస ప్రాపర్టీ ధర రూ.42.5 మిలియన్‌ డాలర్లు. 2015 తర్వాత లండన్‌లో స్టాంప్‌ డ్యూటీ చార్జీలను పెంచడం, బ్రెగ్జిట్‌ ప్రభావంతో లావాదేవీలు తగ్గిపోయాయి. 2015లో అల్ట్రా ప్రైమ్‌లో 72 లావాదేవీలు జరిగితే.. ఈ ఏడాదిలో 38కి తగ్గిపోయాయి. బెల్‌గ్రావియా, మైఫేర్, నైట్స్‌బ్రిడ్జ్‌ ప్రాంతాలు అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతాలు. 62 శాతం లావాదేవీలు ఈ ప్రాంతాల్లోనే జరిగాయి.
న్యూయార్క్‌: వ్యక్తిగత సంపన్నులు, పెట్టుబడిదారులు, జీవన శైలి వంటి వాటితో అల్ట్రా ప్రైమ్‌ ప్రాపర్టీ నగరాల జాబితాలో న్యూయార్క్‌ చోటు దక్కింది. 2015–17 మధ్య కాలంలో నగరం 50 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ ఏడాది న్యూయార్క్‌లో 39 అల్ట్రా ప్రైమ్‌ ప్రాపర్టీ లావాదేవీలు జరిగాయి. లోయర్‌ మన్‌హాట్టన్‌ (డౌన్‌టౌన్‌), మిడ్‌ టౌన్‌ మన్‌హాట్టన్, అప్పర్‌ ఈస్ట్‌ సైడ్‌ ప్రాంతాలు హాట్‌స్పాట్స్‌.
లాస్‌ ఏంజిల్స్‌: 2015లో 5 అల్ట్రా ప్రైమ్‌ ప్రాపర్టీ లావాదేవీలు జరిగితే.. ఈ ఏడాది 12కి పెరిగాయి. ఇక్కడ లాస్‌ ఏంజిల్స్, బెవెర్లీ హిల్స్‌లో ప్రీమియం మార్కెట్స్‌. 
సింగపూర్‌: 2016లో 2 అల్ట్రా ప్రైమ్‌ లావాదేవీలు జరిగితే, 2017 నాటికి 5కి.. ఈ ఏడాది ఆగస్టు నాటికి 12 లావాదేవీలకు పెరిగాయి. ఇక్కడ ఆర్చిడ్‌ రోడ్‌ ప్రీమియం మార్కెట్‌.
––––
నగరాల వారీగా లావాదేవీల విలువ (మిలియన్‌ డాలర్లలో)
        2015    2016        2017        2018 (జనవరి–ఆగస్టు వరకు)    
హాంగ్‌కాంగ్‌    1831    1646        2679        2481
న్యూయార్క్‌    1026    1723        1627        1497
లండన్‌        2881    1713        1563        1479
సింగపూర్‌    175    131        146        529
లాస్‌ ఏంజిల్స్‌    201    718        660        441
సిడ్నీ        195    123        221        219
 



You may be interested

నివాస భవనాలకూ ఈసీబీసీ

Saturday 22nd December 2018

సాక్షి, హైదరాబాద్‌: నివాస భవనాలకు ఎనర్జీ కన్సర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌ (ఈసీబీసీ) నిబంధన అమల్లోకి వచ్చింది. గృహ విభాగంలో ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గతేడాది జూన్‌లో వాణిజ్య భవనాలకు ఈసీబీసీ కోడ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. నివాస విభాగంలో ఈసీబీసీ కోడ్‌తో 2030 నాటికి 125 బిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ శక్తి ఆదా అవుతుందని కేంద్రం

ఫార్మా హబ్‌ వైట్‌ అప్రాన్‌!

Saturday 22nd December 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఫార్మసీ స్టూడెంట్స్‌కు ఎదురయ్యే ప్రధాన సమస్య... ల్యాబ్స్, రసాయనాలు అందుబాటులో ఉండకపోవటం. గ్రామీణ, పట్టణాల్లోని కాలేజీల్లో అయితే మరీనూ! నెల్లూరులో బీ–ఫార్మసీ చదివిన బ్రహ్మం పెద్దపోతులకూ ఇదే సమస్య. కానీ, తాను మాత్రం అక్కడితో ఆగిపోకుండా దీనికో పరిష్కారం చూపించాడు. రసాయనాలు, ల్యాబ్‌ పరికరాలు, వైద్య ఉపకరణాలను విక్రయించేందుకు ‘వైట్‌అప్రాన్‌. ఇన్‌’ ప్రారంభించాడు. మరిన్ని వివరాలు ‘స్టార్డప్‌ డైరీ’తో ఆయన మాటల్లోనే... ‘‘మాది వైఎస్‌ఆర్‌ కడప జిల్లా

Most from this category