STOCKS

News


‘యస్‌’ బ్యాంకు నుంచి రెండు మ్యూచువల్‌ ఫండ్‌లు

Wednesday 5th December 2018
personal-finance_main1543984980.png-22644

  న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగంలోని యస్‌ బ్యాంక్‌కు చెందిన పూర్తి అనుబంధ సంస్థ, యస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ త్వరలో రెండు మ్యూచువల్‌ ఫండ్స్‌ను అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ నుంచి ఆమోదం పొందినట్లు యస్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ తెలియజేసింది. యస్‌ లిక్విడ్‌ ఫండ్‌, యస్‌ ఆల్ట్రా షార్ట్‌ టర్మ్‌ ఫండ్‌ల పేరుతో రెండు మ్యూచువల్‌ ఫండ్స్‌ స్కీమ్‌లను త్వరలో​‍అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. కాగా ప్రస్తుతం మన దేశంలో 40కు పైగా కంపెనీలు మ్యూచువల్‌ ఫండ్‌ స్కీమ్‌లను నిర్వహిస్తున్నాయి.
 



You may be interested

వాల్‌మార్ట్-ఫ్లిప్‌కార్ట్ డీల్‌పై ఐటీ దృష్టి..

Wednesday 5th December 2018

న్యూఢిల్లీ: దేశీ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ను అమెరికన్ రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ కొనుగోలు చేసిన డీల్ విషయంలో పన్ను పరమైన అంశాలపై ఆదాయ పన్ను శాఖ దృష్టి సారించింది. "వివిధ ఇన్వెస్టర్లకు వాల్‌మార్ట్ జరిపిన చెల్లింపులకు సంబంధించి మా దగ్గర పూర్తి వివరాలున్నాయి. కొన్ని కేసుల్లో పన్నులను మినహాయించుకుని చెల్లింపులు జరపగా, కొన్నింటిలో మాత్రం అలా జరగలేదు. ప్రస్తుతం వీటిని పరిశీలిస్తున్నాం. వీటిపై పన్ను ఎందుకు విధించరాదో వివరాలివ్వాలంటూ ఆయా

ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌లో ప్రభుత్వం పాల్గొనదు: ఐడీబీఐ బ్యాంక్‌

Wednesday 5th December 2018

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా పెంచుకోవడానికి గాను ఎల్‌ఐసీ ప్రకటించిన ఓపెన్‌ ఆఫర్‌లో ప్రభుత్వం పాల్గొనడం లేదు.  ఐడీబీఐ బ్యాంక్‌ మంగళవారం ఈ విషయాన్ని తెలిపింది. ఐడీబీఐ బ్యాంక్‌లో బీమా దిగ్గజం ఎల్‌ఐసీ తన వాటాను 51 శాతానికి పెంచుకుంటున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా 26 శాతం వాటా కొనుగోలు కోసం ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించింది. షేరు ఒక్కింటికి రూ.61.73 చొప్పున మొత్తం రూ. 12,602 కోట్లకు

Most from this category