News


సిప్‌ ఆపేస్తారా?

Monday 7th January 2019
personal-finance_main1546848277.png-23448

- సిప్‌ పెట్టుబడులపై సందేహాలే అనవసరం
- ఓర్పుగా ఉంటే లాభాలు అందుకోవచ్చు
– దీర్ఘకాలిక వ్యూహంతోనే పెట్టుబడి పెట్టాలి

నాలుగేళ్లుగా.. సిప్‌ మార్గంలో ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసిన రిటైల్‌ ఇన్వెస్టర్లకు బాగానే ఉంది. కానీ ఇటీవల మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుండటం వారిని కలవరపెడుతోంది. పెట్టుబడులపై పునరాలోచనల్లో పడేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సిప్‌ను ఇంకా కొనసాగించాలా? లేదా మార్కెట్లు చక్కబడే వరకూ ఆపేయాలా? అనేది వారి సందేహం. మన పెట్టుబడులపై రాబడులు రాకపోగా.. ఉన్నదీ పోతుందేమోననేది వారి భయం. అయితే,  సిప్‌ పెట్టుబడుల తీరుతెన్నులను కూలంకషంగా పరిశీలిస్తే ఇందుకు సంబంధించిన సందేహాలన్నీ తీరతాయి. 
    గత పాతికేళ్లుగా.. అంటే 1992 నుంచి 2017 దాకా డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్స్‌లో వచ్చిన వాస్తవిక రాబడులపై వేల్యూ రీసెర్చ్‌ సంస్థ అధ్యయనం చేసింది. ఈ కాలంలో మార్కెట్లు రెండుసార్లు బేర్స్‌ పంజా 2001లో (డాట్‌ కామ్‌ బబుల్‌), 2008లో (అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం) చవిచూశాయి. ఇక 1999–2000, 2004–2007, 2014–2016 మధ్య బుల్‌ మార్కెట్‌ కనిపించింది. ఈ అధ్యయనంలో సిప్‌ పెట్టుబడులపై ఆసక్తికరమైన అంశాలు వెల్లడయ్యాయి. వీటి గురించి ఎవరైనా ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌తో చర్చిస్తే.. సిప్‌ పెట్టుడులపై మరింత అవగాహన వస్తుంది.
1. ఓర్పుతో వచ్చే ఫలాలు మధురం
మ్యూచువల్‌ ఫండ్స్‌కి సంబంధించి ఎప్పుడైనా మార్కెట్‌ నిపుణులు, ఫైనాన్షియల్‌ అడ్వైజర్లు ఒకటే చెబుతారు. అదేంటంటే.. పెట్టుబడుల విషయంలో ఓపికగా వ్యవహరించాలని. వేల్యూ రీసెర్చ్‌ (వీఆర్‌)‡ అధ్యయనం దీనికి మరింత ఊతమిస్తోంది. దీని ప్రకారం .. డైవర్సిఫైడ్‌ ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులు పదేళ్ల వ్యవధిలో కేవలం 0.3 శాతం కేసుల్లోనే నెగటివ్‌ రాబడులిచ్చాయి. కనీసం నాలుగేళ్ల పైగా ఇన్వెస్ట్‌మెంట్‌ కొనసాగించిన పక్షంలో.. నూటికి తొంభై శాతం కేసుల్లో సానుకూల రాబడులే వచ్చాయి. అలా చూసినప్పుడు.. పదేళ్ల పాటు కొనసాగిస్తే పెట్టుబడులపై నష్టాలొచ్చే అవకాశాలు దాదాపు ఉండవనే చెప్పుకోవచ్చు.

2. నాలుగేళ్ల్ల పైబడితే... రెండంకెల స్థాయి రాబడులు
ప్రతి ఇన్వెస్టరూ రెండంకెల స్థాయి రాబడులు కోరుకుంటారు. అందుకు తగ్గట్లుగా మార్కెట్లు పెరుగుతూనే ఉండాలనుకుంటారు. కానీ వాస్తవం అలా ఉండదు. మార్కెట్లన్నాక హెచ్చుతగ్గులు తప్పవు. దీర్ఘకాలిక పెట్టుబడులపై వచ్చే రాబడుల గురించి ఆలోచించే వారికి వాల్యూ రీసెర్చ్‌ అధ్యయనంలో వెల్లడైన అంశాలు వాస్తవ పరిస్థితులపై అవగాహన కల్పిస్తాయి. కనీసం పది శాతం రాబడులు అందించిన వివిధ కాలవ్యవధుల పెట్టుబడులను వీఆర్‌ పరిశీలించింది. నాలుగేళ్లు, ఆ పైన కొనసాగించిన పెట్టుబడులపై రెండంకెల శాతం రాబడులు అందుకోవడానికి సుమారు 62 శాతం అవకాశాలున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. అదే పదేళ్ల కాలవ్యవధి తీసుకుంటే 10 శాతానికి మించి రాబడులు అందుకునే అవకాశాలు 77 శాతం పైగా ఉన్నాయి. ఓర్పు వహించే ఇన్వెస్టర్లకు సాధారణ సిప్‌ పెట్టుబడులు సగటున 15–19 శాతం మేర రాబడులిచ్చే అవకాశాలున్నాయి. 

3. మార్కెట్లు ఎలా ఉన్నా సరే...
మార్కెట్లో అదును చూసి ఇన్వెస్ట్‌ చేయడం కన్నా.. క్రమపద్ధతిలో ఇన్వెస్ట్‌ చేస్తూ వెళ్లటమే శ్రేయస్కరం. మార్కెట్లు గరిష్ట స్థాయుల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్‌ చేశామే.. ఇప్పుడేం చేయాలంటూ ఆందోళన చెందుతున్న వారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి. మీరు దీర్ఘకాలిక ఇన్వెస్టరైన పక్షంలో దీని గురించి భయపడనక్కర్లేదు. ఏడాది, రెండేళ్ల కోసం ఇన్వెస్ట్‌ చేస్తే మాత్రమే ఇలాంటివి ఆందోళన కలిగిస్తాయి. ఒకవేళ ఈ కాల వ్యవధి కోసమే ఇన్వెస్ట్‌ చేయదల్చుకుంటే... డెట్‌ ఫండ్లను ఎంచుకోవచ్చు. ఈ విషయంలో వీఆర్‌ అధ్యయనాన్ని పరిశీలిస్తే.. 2007లో మార్కెట్లు గరిష్ఠానికి చేరినపుడు సిప్‌లలో ఇన్వెస్ట్‌ చేసినవారు, తర్వాత మార్కెట్లు భారీగా పతనమైనా కూడా రెండేళ్ల వ్యవధిలోనే 60 శాతం సిప్‌ ఖాతాలు లాభనష్ట రహిత స్థాయికి చేరటాన్ని చూశారు. 2007లో గరిష్ట స్థాయుల్లో ఇన్వెస్ట్‌ చేసినవారిలో దాదాపు 99 శాతం మంది.. 2011 నాటికి తమ పెట్టుబడులపై రాబడులు అందుకున్నారు. దీన్ని బట్టి తేలేదేమిటంటే.. దీర్ఘకాలిక వ్యూహంతో పెట్టుబడులు పెట్టినప్పుడు.. మార్కెట్‌ హెచ్చుతగ్గుల గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు. మార్కెట్లు ఎలా ఉన్నా పెట్టుబడులు కొనసాగించడం ద్వారానే అధిక ప్రయోజనం పొందవచ్చు.

4. గైడెన్స్‌తో ఇన్వెస్ట్‌ చేయండి..
ఇన్వెస్టర్లు ఆర్థిక లక్ష్యాల సాధనకు అనుగుణంగా ఉండే సరైన సిప్‌లు ఎంచుకోవాలి. కాబట్టి అందుబాటులో ఉన్న ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనాల గురించి క్షుణ్నంగా తెలియకపోతే ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ సలహా తీసుకోవాలి. మీ ఆర్థిక అవసరాలను అంచనా వేసి, తదనుగుణమైన సాధనాన్ని సూచించే నైపుణ్యాలు అడ్వయిజర్‌కు ఉంటాయి. అలాగని ఇన్వెస్ట్‌ చేయగానే పని పూర్తయిపోయినట్లు కాదు. ఎప్పటికప్పుడు వాటిని సమీక్షించుకోవాలి. 

చివరిగా చెప్పేదేమిటంటే.. సిప్‌లలో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేయడమన్నది.. చిన్న మొత్తాల్లోనైనా పెట్టుబడి పెట్టే క్రమశిక్షణ అలవాటు చేస్తుంది. పెట్టుబడుల కాంపౌండింగ్, యావరేజింగ్‌ వంటి ప్రయోజనాలన్నీ పొందవచ్చు. ఒక్కో నీటి బొట్టు కలిస్తేనే మహాసముద్రమైనట్లు.. కొంత కొంతగా సిప్‌ ద్వారా పోగేస్తే పెద్ద మొత్తంలో సంపదను సమకూర్చుకోవచ్చు. 

- నిమేష్‌ షా, ఎండీ, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీYou may be interested

కొత్త ఏడాది బాగుంటుంది!

Monday 7th January 2019

సమీర్‌ ఆరోరా అంచనా మధ్యమధ్య కొన్ని వారాలు ఆటుపోట్లు కనిపించినా మొత్తం మీద కొత్త ఏడాది మార్కెట్లు బాగుంటాయని మార్కెట్‌ అనలిస్టు సమీర్‌ ఆరోరా అభిప్రాయపడ్డారు. గతేడాదితో పోలిస్తే ఈ దఫా మార్కెట్లు మరింత బాగుండొచ్చన్నారు. గతేడాది తలనొప్పులు తెచ్చిన పలు అంశాలు ఈ ఏడాది క్రమంగా సమసిపోతున్నాయన్నారు. ఎర్నింగ్స్‌ ఒడదుడుకులు, మిడ్‌క్యాప్‌ కరెక‌్షన్‌, ఎన్‌బీఎఫ్‌సీ సంక్షోభం, కరెన్సీ పతనం తదితర అంశాలు గతేడాది మార్కెట‍్లను కుంగదీశాయన్నారు. అయితే గత రెండు

ఏడాది మారింది... మరి మీరు?

Monday 7th January 2019

- కాలానికి అనుగుణంగా పెట్టుబడులు - స్టాక్‌ మార్కెట్లలో పెరిగిన అస్థిరతలు - సిప్‌ మార్గంలో ఇన్వెస్ట్‌ చేయడమే మెరుగు - లార్జ్‌క్యాప్‌కు ప్రత్యామ్నాయం మల్టీక్యాప్‌ ఫండ్స్‌ - మూలధన లాభాల పన్ను పడకుండానూ మార్గం - ఎఫ్‌ఎంపీ, ఎన్‌పీఎస్‌, షార్ట్‌టర్మ్‌ డెట్‌ ఫండ్స్‌... ఎన్నో ఆప్షన్లు (సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం) గతేడాది చాలా పెట్టుబడి సాధనాలు సగటు కంటే తక్కువ రాబడులే ఇచ్చాయి. ఇటీవలి కాలంలో ఎక్కువ అస్థిరతలు చూసింది గతేడాదిలోనే. అయితే, 2019లో పరిస్థితులు ఆశాజనకంగానే

Most from this category